అన్వేషించండి

Low Carb Diet : బరువు తగ్గాలనుకుంటే.. ఈ ఫుడ్స్ కచ్చితంగా తినండి

Weight Loss Tips with Diet : బరువు తగ్గాలని చూస్తున్నారా అయితే మీరు లో కార్బ్ డైట్​ ఫాలో అవ్వండి. ఈ సమయంలో ఏవి తింటే మీరు బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Low Carb Diet For Weight Loss : బరువు తగ్గాలనుకుంటే ముందుగా శ్రద్ధ తీసుకోవాల్సింది ఫుడ్​ పైనే. ఇది బరువు తగ్గడంలో, పెరగడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు మీరు తీసుకునే ఫుడ్​లో అధిక ప్రోటీన్, కార్బ్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే మీరు తీసుకోవాల్సింది సమతుల్యమైన ఆహారం(Balanced Diet). దీనిలో భాగంగా మీరు తీసుకునే ప్రతి పోషకాన్ని తగిన నిష్పత్తిలో తీసుకోవాలి. 

లో కార్బ్స్.. హై ప్రోటీన్​ కలిగిన ఆహారం బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది. కాబట్టి ఈ రకమైన డైట్​ మధుమేహమున్నవారికి కూడా చాలా మంచిది. కార్బ్స్ తగ్గించడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్​ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా మీ శరీరం మరింత గ్లూకోగాన్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తుంది. ఈ రకమైన డైట్​ను మీరు రెగ్యూలర్​గా తీసుకుంటే కొవ్వు కరిగిపోతుంది. అంతేకాకుండా అధిక ప్రోటీన్ (High Protein)​ కలిగిన ఆహారం.. రెగ్యులర్​ వ్యాయామాలు కూడా కొవ్వును తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇది కండరాలకు శక్తిని అందిస్తుంది. అయితే కార్బ్స్​ తక్కువగా ఉండి.. ప్రోటీన్​ అధికంగా కలిగిన ఆహారాల గురించి.. అవి మీరు బరువు తగ్గడంలో ఏవిధంగా హెల్ప్ చేస్తాయో తెలుసుకుందాం. 

వేయించిన శనగలు..

మీకు తెలుసా వేయించిన శనగలు పూర్తిగా పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో అధిక ప్రోటీన్, ఫైబర్​ కంటెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీరు వెజ్​ అయితే.. మీరు ప్రోటీన్​కోసం వీటిని మీ డైట్​లో కలిపి తీసుకోవచ్చు. స్నాక్స్​గా వీటిని తీసుకోవడం వల్ల మీ కడుపు నిండుతుంది. ఇతర చిరుతిళ్ల జోలికి వెళ్లాల్సిన అవసరం రాదు. కాబట్టి వీటిని హాయిగా మీ డైట్​లో చేర్చుకోండి.

సన్ ఫ్లవర్​ సీడ్స్

పొద్దు తిరుగుడు పువ్వుల గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గాలనుకుంటే ఇవి మీకు మంచి ఎంపిక. ఎందుకంటే వీటిలో ప్రోటీన్​, ఫైబర్​, విటమిన్ ఇ, ఫోలేట్, కాపర్​ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు స్నాక్స్​గా లేదా ఫ్రూట్స్, వెజిటెబుల్ సలాడ్స్​ మీద చల్లి తీసుకోవచ్చు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరాన్ని రోగాల బారిన పడకుండా చేయడమే కాకుండా.. మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

సాల్మన్

సాల్మన్​ ఫిష్​ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పూర్తిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్​లు, హెల్తీ ఫ్యాట్, ప్రోటీన్లతో నిండి ఉంటుంది. ఇది మీ ఆకలిని తగ్గించి.. మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది పొత్తికడుపు దగ్గర ఉన్న కొవ్వును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మీరు హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలనుకుంటే మీకు సాల్మన్ ఫిష్ మంచి ఎంపిక. ఇది మీ కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గేలా చేస్తుంది. 

పెరుగు

కొందరు పెరుగు తినడానికి ఇష్టపడరు కానీ.. మీరు పెరుగు తింటే బరువు తగ్గొచ్చు తెలుసా? గ్రీక్​ యోగర్ట్ ప్రోటీన్​కు అద్భుతమైన మూలం. ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. దీనిలో కాల్షియం, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. మీ కడుపు సమస్యలను దూరం చేసి హెల్తీ గట్ అందిస్తాయి. దీనిలో అధిక ప్రోటీన్.. తక్కువ కార్బ్స్ ఉంటాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మీరు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. 

ప్రోటీన్​ ఎక్కువగా.. కార్బ్స్ తక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అంతేకాకుండా ఇవి మీరు ఎక్కువ సేపు కడుపు నిండి ఉండేలా చేస్తాయి. తద్వారా మీరు ఎక్కువగా తినడాన్ని ఆపేయగలుగుతారు. చిరుతిళ్ల వైపు ధ్యాస మళ్లదు. కాబట్టి మీ డైట్​లో ఇవి ఉండేలా ప్లాన్ చేసుకోండి. వీటికి తోడు రెగ్యూలర్ వ్యాయామాలు తోడైతే.. మీరు మరింత వేగంగా బరువు తగ్గుతారు. 

Also Read : పిల్లల్లో ఇమ్మూనిటీని పెంచే అల్లం, క్యారెట్ సూప్.. రెసిపీ ఇదే

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget