అన్వేషించండి

Immunity Booster : పిల్లల్లో ఇమ్మూనిటీని పెంచే అల్లం, క్యారెట్ సూప్.. రెసిపీ ఇదే

Ginger Carrot Soup Recipe : మీరు పిల్లలకు పోషకాహారాన్ని అందించాలనుకుంటే.. అల్లం, క్యారెట్ సూప్ తయారు చేసి పెట్టవచ్చు. ఇది చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Ginger Carrot Soup : చలికాలంలో పెద్దలతో పాటు.. పిల్లల్లో కూడా రోగనిరోధక శక్తి (Immunity)తగ్గుతూ ఉంటుంది. వారిలో ఇమ్యూనిటీ పెంచడం చాలా అవసరం. అయితే ఈ సమయంలో పిల్లలకు టేస్టీ, హెల్తీ సూప్ ఇవ్వాలనుకుంటే.. మీరు వారికి అల్లం, క్యారెట్ సూప్ ఇవ్వండి. ఇది కేవలం పిల్లలకే అనుకుంటే పొరపాటే.. పెద్దలు కూడా హాయిగా ఈ సూప్​ను ఆస్వాదించవచ్చు. మరి ఈ హెల్తీ సూప్​(Healthy Soup For Winter)ను ఏ విధంగా తయారు చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

క్యారెట్లు - 8 పెద్దవి

ఆలివ్ నూనె - పావు కప్పు

ఉప్పు - రుచికి తగినంత

వెజిటెబుల్ స్టాక్ - 6 కప్పులు 

అల్లం - అంగుళం (పై తొక్క తీసేయాలి)

పెద్ద ఉల్లిపాయ - 1 (చిన్నగా తరగండి)

వెల్లుల్లి - 2 (చిన్నగా తరగాలి)

మిరియాల పొడి -  కొంచెం 

తయారీ విధానం

అల్లం క్యారెట్ సూప్ తయారు చేసుకోవడానికి ఓవెన్ ఉంటే మంచిది. ముందుగా క్యారెట్​లతో తొక్కను తీసి.. రౌండ్ షేప్​లో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు రిమ్డ్ బేకింగ్​ షీట్​లో వాటిని పేర్చి.. దానిపై 2 టేబుల్ స్పూన్ల ఆలివ్​ నూనె వేయాలి. పైన కాస్త ఉప్పు చల్లండి. ఇప్పుడు ఓవెన్ రాక్ సెట్ చేసి బ్రాయిలర్​ ఆన్ చేయండి. దానిలో రాక్ ఉంచండి. క్యారెట్లు బ్రౌన్​ కలర్​లోకి మారి మెత్తబడేవరకు ఉంచండి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వాటిని తిప్పండి. 

ఈలోపు స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో వెజిటెబుల్ స్టాక్ వేయండి. అది మరుగుతున్న సమయంలో అల్లం, కొత్తిమీర వేసి ఉడికించండి. ఫ్రై పాన్​లో ఆలివ్​ నూనె వేసి ఉల్లిపాయను బ్రౌన్​ కలర్ వచ్చేవరకు వేయించండి. దానిలో వెల్లుల్లి వేయండి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న క్యారెట్లు కూడా వేయండి. వాటిని గరిటెతోనే స్మాష్ చేసి.. బాగా కలపండి. ఇప్పుడు మరిగించిన వెజిటేబుల్ స్టాక్​ని దీనిలో వేసేయండి. బాగా కలిపి.. రుచికి తగినంత ఉప్పు వేయండి. సూప్​ బాగా మందంగా అనిపిస్తే.. నీరు వేయొచ్చు. చివరిగా మిరియాల పొడి వేసి బాగా కలిపి దించేయండి. అంతే వేడి వేడి అల్లం క్యారెట్ సూప్ రెడీ. 

పిల్లల్లో ఈ సూప్​ ఇమ్యూనిటీని పెంచుతుంది. వారు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. పెద్దల్లో కూడా ఈ సూప్​ పలు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. వింటర్​లో వచ్చే ఫ్లూ వంటి వ్యాధులు దరిచేరకుండా రక్షిస్తుంది. ఒకవేళ జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు దీనిని తీసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని హాయిగా లాగించేయవచ్చు. బరువు తగ్గడంలో కూడా ఈ సూప్​ ముఖ్యపాత్ర పోషిస్తుంది. వింటర్​లో బద్ధకంగా అనిపిస్తే.. ఈ సూప్​ ఒక కప్పు తాగండి. ఇది మీరు రోజంతా యాక్టివ్​గా ఉండేలా చేస్తుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదండోయ్.. జుట్టు, చర్మ సంరక్షణకు ఇది సహాయం చేస్తుంది. చలికాలంలో ఎదురయ్యే జుట్టు, చర్మ సమస్యలను దూరం చేస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేసి పొడిబారకుండా చేస్తుంది. 

Also Read :హెల్తీ, టేస్టీ బనానా మిల్క్.. ఇది ప్రోటీన్​కు మంచి సోర్స్

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆

*T&C Apply*

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget