High BP : హై బీపీని కంట్రోల్ చేయడానికి లైఫ్స్టైల్లో ఈ మార్పులు చేయాలట.. మీరు ఫాలో అయిపోండి
High BP Lifestyle Changes : రోజూవారి పనుల్లో కొన్ని మార్పులు చేస్తే బీపీని కంట్రోల్ చేయవచ్చని చెప్తున్నారు నిపుణులు. ఆ పనులు ఏంటో.. వాటితో బీపీ ఎలా కంట్రోల్ అవుతుందో చూసేద్దాం.

High blood pressure : అధిక రక్తపోటును నియంత్రియచకుంటే ఆరోగ్య సమస్యలను ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే బీపీ అనేది దీర్ఘకాలిక సమస్యలను పెంచుతుంది. కాబట్టి దానిని కంట్రోల్ చేయడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ మార్పులను వీలైనంత త్వరగా ఆచరిస్తే.. తర్వాతి రోజుల్లో బీపీ ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్తున్నారు. ఇంతకీ బీపీని కంట్రోల్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన మార్పులు ఏంటో.. వాటి వల్ల పొందే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
వ్యాయామం
జిమ్‌కెళ్లి కష్టపడాలని నిపుణులు చెప్పట్లేదు కానీ.. శారీరకంగా మాత్రం కాస్త వ్యాయామం చేయాలని అంటున్నారు. దీనివల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. పైగా గుండె సమస్యలను దూరం చేయడంలో ఇది హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. వాటితో పాటు వాకింగ్ చేస్తూ ఉంటే బీపీ అదుపులో ఉంటుందని చెప్తున్నారు.
డైట్
బీపీ ఉండేవారు డైట్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాలి. సోడియం తగ్గించడంతో పాటు కొన్ని ఫుడ్స్‌ని రెగ్యులర్‌గా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్ ఫుడ్స్ డైట్లో ఉండేలా చూసుకోవాలి. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది.
బరువు
కచ్చితంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు బీపీని పెంచడంతో పాటు.. ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు పెరుగుతాయి. అందుకే బరువును కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు.
ఒత్తిడి
ఒత్తిడి కూడా బీపీని పెంచేస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇవి బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
నిద్ర
రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. దీనివల్ల బీపి కంట్రోల్ అవుతుంది.
ఆల్కహాల్, స్మోకింగ్
ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే.. కచ్చితంగా దానిని లిమిట్ చేయాలని సూచిస్తున్నారు. స్మోకింగ్ అయితే పూర్తిగా మానేయాలని చెప్తున్నారు. స్మోకింగ్ వల్ల బీపీ సమస్య మరింత పెరిగే అవకాశముందని చెప్తున్నారు.
వైద్యుల సూచన
కచ్చితంగా వైద్యుల సూచనలు ఫాలో అవ్వాలని చెప్తున్నారు. మందులు రెగ్యులర్‌గా తీసుకుని.. పైన చెప్పిన మార్పులను లైఫ్స్టైల్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రం కాకుండా ఉంటాయి.
Also Read : కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య ఉంటే.. ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















