Morning Drink for Better Health : లెమన్ గ్రాస్ టీ రోజూ తాగితే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చట.. అదే ఆడవారికైతే
Herbal Tea :హెర్బల్ టీలలో లెమన్ గ్రాస్ టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని రోజూ పరగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు.
Lemon Grass Tea Benefits : ఇంటి పెరట్లో.. లేదా ఖాళీ స్థలంలో ఓ కుండీ పెట్టుకుని దానిలో లెమన్ గ్రాస్ టీ వేసుకుంటే రోజూ మంచిగా లెమన్ గ్రాస్ టీ తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన మొక్కల్లో లెమన్ గ్రాస్ కూడా ఒకటి. వీటి ఆకులను నులిమితే నిమ్మకాయ వాసన వస్తుంది. అందుకే వీటిని లెమన్ గ్రాస్ అంటారు. ఈ హెర్బల్ టీ ఎన్నో మంచి లక్షణాలను కలిగి ఉంది. మలినాలు, టాక్సిన్లతో నిండిన శరీరానికి ఈ హెర్బల్ టీ మంచి ఉపశమనం అందిస్తుంది. ముఖ్యంగా మహిళలకు కూడా ఇది హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది.
అత్యంత సులభంగా తయారు చేసుకోగలిగే ఈ టీని రెగ్యూలర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరం అద్భుతమైన ప్రయోజనాలు చూపిస్తుంది. దీనిని తయారు చేయడానికి లెమన్ గ్రాస్, నీరు ఉంటే చాలు. లెమన్ గ్రాస్‌ను నీటిలో వేసి మరిగించి.. తాగవచ్చు. లేదా రెగ్యూలర్ టీలలో లెమన్ గ్రాస్ వేసి తీసుకోవచ్చు. దానిలో కాస్త తేనె కలిపి తాగితే మీరు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇంతకీ దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు చుద్దాం.
డిటాక్స్ కోసం
హెల్తీగా ఉండాలంటే శరీరాన్ని డిటాక్స్ చేయడం చాలా అవసరం. లెమన్ గ్రాస్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డిటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. మూత్ర విసర్జన రూపంలో టాక్సిన్లను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. కాబట్టి ఉదయాన్నే దీనిని తీసుకుంటే మంచిది.
బరువు తగ్గడం కోసం
బరువు తగ్గడంలో ఒక కప్పు లెమన్ గ్రాస్ టీ కచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఇది బొడ్డు కొవ్వు, శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయం చేస్తుంది. ఎక్కువ కాలం మీరు కడుపు నిండుగా ఉండేలా చేసి.. అన్ హెల్తీ ఫుడ్‌కి దూరంగా ఉంచుతుంది. ఇది మీ జీవక్రియను మెరుగుపరిచి.. వేగంగా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.
జీర్ణక్రియ కోసం
లెమన్ గ్రాస్ టీని మీరు ఉదయాన్నే తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా దీనిని తీసుకోవచ్చు. ఎసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఇది దూరం చేస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మొత్తం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రోగనిరోధక శక్తి కోసం..
లెమన్ గ్రాస్ టీలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతి రోజూ ఒక కప్పు ఈ టీ తాగితే.. జలుబు, ఇన్ఫెక్షన్లు, వైరల్ జ్వరాలు రాకుండా ఉంటాయి.
అధిక రక్తపోటు..
లెమన్ గ్రాస్ టీ రక్తపోటును కంట్రోల్ చేసి.. రక్తపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది. మెరుగైన రక్తప్రసరణను అందించడంతో పాటు.. బీపీని కూడా తగ్గిస్తుంది. ఉదయాన్నే ఈ టీని తాగడం వల్ల రోజంతా మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది.
పీరియడ్స్ పెయిన్ కోసం..
పీరియడ్స్ సమయంలో లెమన్ గ్రాస్ టీ తాగితే నొప్పులనుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా రిలీఫ్‌ని ఇచ్చి.. నరాలను ఉత్తేజ పరుస్తుంది. కడుపు నొప్పి, కాళ్లు లాగడం వంటి వాటినుంచి ఉపశమనం ఇచ్చి మెరుగైన నిద్రను అందిస్తుంది. పీరయడ్స్ సమయంలో వచ్చే కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.
స్కిన్ కోసం..
లెమన్ గ్రాస్ టీలో విటమిన్ ఎ, సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. పింపుల్స్, యాక్నే సమస్యలను దూరం చేస్తాయి.
Also Read : పరగడుపునే ఇవి తాగితే.. మధుమేహం, బరువు కంట్రోల్లో ఉంటుందట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.