అన్వేషించండి

Urine Leaking : తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ అవుతుందా? ఈ సమస్యకు కారణం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?

Leaking Urine : దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మూత్రం లీక్ అవ్వడం, ఒత్తిడి వల్ల మూత్రం లీక్ అవ్వడం జరుగుతుందా? అయితే దీనికి ఏ వ్యాధి కారణమో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దగ్గినప్పుడు, నవ్వినప్పుడు మూత్రం లీకేజీని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు.
  • బలహీనమైన కండరాలతో మూత్రాశయంపై ఒత్తిడి వల్ల మూత్రం లీక్ అవుతుంది.
  • ప్రసవం, వయస్సు, ఊబకాయం, దీర్ఘకాలిక దగ్గు ప్రధాన కారణాలు.
  • వ్యాయామాలు, జీవనశైలి మార్పులు, వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

Stress Urinary Incontinence : చాలామందికి దగ్గబోయే ముందు మూత్రం బయటకు వస్తుందేమోనన్న భావన కలుగుతుంది. దగ్గినప్పుడు, నవ్వినప్పుడు, వంగినప్పుడు లేదా దేనికైనా ఆనుకున్నప్పుడు కూడా ఇదే సమస్య రావచ్చు. కొన్నిసార్లు ఈ సమస్య ఎంత తీవ్రంగా మారుతుందంటే.. ఆ సమయంలో ఇతరుల ముందు నవ్వడానికి లేదా వారికి ఇష్టమైన వ్యాయామాలు చేయడానికి కూడా దూరంగా ఉంటారు.

అయితే ఈ సమస్యకు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కారణం కావచ్చని వైద్యులు చెప్తున్నారు. ఈ పరిస్థితి మూత్ర నియంత్రణకు సంబంధించినది. ఇది కేవలం వృద్ధులకే పరిమితం కాదని.. పెద్దవారిలో కూడా వస్తుందని చెప్తున్నారు. అయితే పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందట.

స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే..

హెల్త్‌లైన్ అనే ఆరోగ్య సమాచార వెబ్‌సైట్ ప్రకారం.. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది ఒక రకమైన మూత్ర అసంయమనం. ఈ సమస్య ఉంటే మూత్రాశయంపై ఒత్తిడి ఏర్పడి మూత్రం లీక్ అవుతుంది. అయితే ఈ ఒత్తిడి అనేది మానసిక ఒత్తిడిని సూచించదు. శారీరక ఒత్తిడిని సూచిస్తుంది. అంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, నవ్వినప్పుడు లేదా బరువైన వస్తువును ఎత్తినప్పుడు, పొత్తికడుపు, మూత్రాశయంపై ఒత్తిడి పెరగవచ్చు.

Also Read : బాడీలో హీట్‌ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?

పెల్విక్ ఫ్లోర్ కండరాలు లేదా యురెత్రల్ స్ఫింక్టర్ కండరాలు బలహీనపడితే.. అవి మూత్రాన్ని సరిగ్గా నిలుపుకోలేకపోవచ్చు. ఇది అకస్మాత్తుగా కొన్ని చుక్కల మూత్రం లీక్ అవ్వడానికి దారితీస్తుంది. చాలా మందికి మూత్రాశయం నిండి పొంగిపోతున్నప్పుడు ఇది ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. కొందరికి కొన్ని చుక్కలు మాత్రమే లీక్ కావచ్చు. మరికొందరికి వారి బట్టలు కూడా తడిసిపోవచ్చు.

తుమ్మినప్పుడు మాత్రమే వస్తుందా?

తుమ్మడం మాత్రమే కాకుండా అనేక ఇతర సందర్భాలలో కూడా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ వల్ల మూత్రం లీక్ కావచ్చు. దగ్గినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు, వంగినప్పుడు, బరువైన వస్తువులను ఎత్తినప్పుడు లేదా అకస్మాత్తుగా కదిలినప్పుడు ఇలా జరగవచ్చు. కొంతమందికి వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసేటప్పుడు కూడా ఈ సమస్య ఎదురవ్వచ్చు. అందువల్ల ఈ పరిస్థితి పదేపదే సంభవిస్తే.. దానిని కేవలం ఒక సాధారణ బలహీనతగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు.

Also Read : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట

స్ట్రెస్ ఇన్కాంటినెన్స్‌కు కారణాలు

స్ట్రెస్ ఇన్కాంటినెన్స్‌కు ఒక ప్రధాన కారణం మూత్ర వ్యవస్థకు సంబంధించిన కండరాలు బలహీనపడటమే. మహిళల్లో ప్రసవానంతరం, ముఖ్యంగా యోని ద్వారా ప్రసవం జరిగిన తర్వాత.. పెల్విక్ ఫ్లోర్ కండరాలు ప్రభావితం కావచ్చు. అంతేకాకుండా గర్భాశయం, గర్భాశయ ముఖద్వారాన్ని తొలగించే శస్త్రచికిత్స తర్వాత కూడా చుట్టుపక్కల కండరాలు బలహీనపడవచ్చు. పురుషులలో ప్రోస్టేట్ శస్త్రచికిత్స తర్వాత యురెత్రల్ స్ఫింక్టర్ , పెల్విక్ నరాలు ప్రభావితం కావచ్చు.

వయసు పైబడటంతో వచ్చే కండరాల బలహీనత కూడా ఒక కారణం కావచ్చు. అధిక బరువు ఉండటం వల్ల కటి కండరాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. నడుము కింది భాగంలో గాయం లేదా దెబ్బతినడం కూడా ఈ కండరాలను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక దగ్గు, ధూమపానం వల్ల తరచుగా వచ్చే దగ్గు కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తుంది. పరుగెత్తడం లేదా తరచుగా దూకడం వంటి ఎక్కువసేపు చేసే తీవ్రమైన శారీరక శ్రమ కూడా ఒక కారణం కావచ్చు.

Also Read : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే

చికిత్స ఉందా?

దగ్గు లేదా తుమ్ములతో పాటు తరచుగా మూత్రవిసర్జన మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే.. వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. వైద్యుల సూచనలు ఫాలో అవుతూ.. జీవనశైలిలో మార్పులు చేస్తే మంచిది. కెఫీన్, ఆల్కహాల్, కార్బోనేటెడ్ పానీయాలను పరిమితం చేయమని సిఫార్సు చేస్తారు. మలబద్ధకం ఉండి, మలవిసర్జన సమయంలో ముక్కవలసి వస్తే కూడా చికిత్స అవసరం కావచ్చు.

వ్యాయామాలతో సెట్ చేసుకోవచ్చా?

స్ట్రెస్ ఇన్కాంటినెన్స్‌కు శస్త్రచికిత్స రహిత పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో డాక్టర్ బయోఫీడ్‌బ్యాక్, వెజైనల్ పెస్సరీ లేదా యురెత్రల్ ఇన్సర్ట్‌ను కూడా సిఫార్సు చేయవచ్చు. రుతువిరతి పొందిన కొంతమంది మహిళలకు ఈస్ట్రోజెన్ క్రీమ్ కూడా చికిత్సలో భాగంగా ఉంటుంది. ఈ పద్ధతుల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే.. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేస్తారు.

Also Read : 30-40 ఏళ్ల మహిళల్లో గుండెపోటు? సడెన్ హార్ట్ అటాక్‌కు SCAD కూడా కారణమే.. లక్షణాలు ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

DIY Sandalwood Face Packs : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
Coconut Milk : కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
High Blood Pressure : బీపీ సడెన్గా పెరిగిందా? వెంటనే తగ్గించుకోవడానికి ఇంట్లో చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే
బీపీ సడెన్గా పెరిగిందా? వెంటనే తగ్గించుకోవడానికి ఇంట్లో చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget