అన్వేషించండి

Alzheimers Patient Care : అల్జీమర్స్‌ పేషెంట్లను చూసుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. డాక్టర్‌ సూచనలు ఇవే

Caring for Alzheimers Patients : అల్జీమర్స్ వచ్చిన వ్యక్తిని చూసుకోవడంలో కుటుంబ సభ్యులు తెలిసో.. తెలియకో కొన్ని తప్పులు చేస్తారని.. అలా చేయకూడదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అల్జీమర్స్ రోగులతో వాదించవద్దు, కలుపుకొని ఒకే పని చెప్పండి.
  • ఆకస్మిక ప్రవర్తన మార్పులకు వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి.
  • ఇంట్లో ప్రమాదాలు నివారించడానికి అవసరమైన భద్రతా మార్పులు చేయాలి.
  • కుటుంబ సభ్యులు సంరక్షణ బాధ్యతలు పంచుకుని, ఒత్తిడి తగ్గించాలి.

Alzheimers Patients : అల్జీమర్స్‌ వ్యాధి ఉన్న వ్యక్తిని చూసుకోవడం కుటుంబ సభ్యులకు అంత సులభమైన విషయం కాదు. వ్యాధి ముదిరే కొద్దీ జ్ఞాపకశక్తి, మాట తీరు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో వారికి సహాయం చేయడం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా ఉండొచ్చు. దీంతో తెలియక కొన్ని తప్పులు చేస్తారని.. అవి పేషెంట్లలో గందరగోళం, ఆందోళనను మరింత పెంచుతాయని వైద్యులు చెప్తున్నారు. 

అల్జీమర్స్‌ రోగులను చూసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలిపారు డాక్టర్ మోహన్ కృష్ణ. హైదరాబాద్​లోని యశోద హాస్పిటల్స్​కు చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ మోహన్‌ కృష్ణ జొన్నలగడ్డ అల్జీమర్స్ పేషెంట్ల విషయంలో కుటుంబ సభ్యులు చేయకూడని కొన్ని తప్పులు గురించి వివరించారు. అవేంటో చూసేద్దాం. 

Also Read : మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే

పదేపదే వాదించకండి

అల్జీమర్స్‌ ఉన్న వ్యక్తి ఒక విషయాన్ని మర్చిపోయినప్పుడు.. ఇప్పుడే చెప్పాను కదా.. గుర్తు లేదా? అంటూ పదేపదే సరిదిద్దడం లేదా వాదించడం మంచిది కాదు. దీనివల్ల వారిలో అసహనం పెరగవచ్చు. ఒకవేళ వారు చెప్పే విషయాల్లో తప్పులు ఉన్నా.. ప్రతిసారీ దానిని నిరూపించడానికి ప్రయత్నించకుండా.. వారి భావాలను అర్థం చేసుకోవాలి. వాళ్లు ఇబ్బందిగా ఫీలైతే మరో టాపిక్​పైకి దృష్టి మళ్లించాలని డాక్టర్ మోహన్ కృష్ణ సూచించారు. 

దూరంగా పెట్టకండి..

జ్ఞాపకశక్తి, మాట్లాడే సామర్థ్యం తగ్గుతున్నప్పటికీ.. అల్జీమర్స్‌ ఉన్న వ్యక్తిని కుటుంబ చర్చలు, రోజువారీ మాటల నుంచి వారిని పూర్తిగా దూరం చేయకూడదు. వీలైనంత వరకు నేరుగా వారితోనే మాట్లాడాలి. సమాధానం చెప్పేందుకు వారికి తగినంత సమయం ఇవ్వాలి. 

Also Read : తరచూ విషయాలు మర్చిపోతున్నారా? మతిమరుపు ఎక్కువైతే ఈ ఫుడ్ కాంబినేషన్స్‌ ట్రై చేయండి

ఒకేసారి ఎక్కువ పనులు చెప్పకండి

ఒకేసారి ఎక్కువ పనులు చెప్తే.. అల్జీమర్స్‌ ఉన్న వ్యక్తికి అర్థం చేసుకోవడం కష్టంగా ఉండొచ్చు. అందుకే చిన్న చిన్న వాక్యాలతో సింపుల్‌గా మాట్లాడాలి. ఒక సమయంలో ఒక పని మాత్రమే చెప్పడం మంచిది. టీవీ, పెద్ద శబ్దాలు వంటి డిస్ట్రాక్షన్స్‌ తగ్గిస్తే.. వారు మీరు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడం సులభమవుతుందని డాక్టర్ మోహన్ కృష్ణ తెలిపారు.

ఆకస్మిక మార్పులు లైట్ తీసుకోకండి

అల్జీమర్స్‌ ఉన్న వ్యక్తిలో ఒక్కసారిగా గందరగోళం, చిరాకు లేదా ప్రవర్తనలో తీవ్రమైన మార్పు కనిపిస్తే.. దాన్ని కేవలం అల్జీమర్స్‌ కారణంగానే భావించకూడదు. నొప్పి, ఇన్ఫెక్షన్‌, డీహైడ్రేషన్‌, మలబద్ధకం, మందుల ప్రభావం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇలాంటి మార్పులకు కారణం కావచ్చు. ప్రవర్తనలో మార్పు గమనిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి.

Also Read : మతిమరుపు ఎక్కువైందా? తరచూ మరచిపోవడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

ఇంటిలో చేయాల్సిన మార్పులివే

వ్యాధి ముదిరే కొద్దీ పడిపోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్లి దారి తప్పడం, మందులను తప్పుగా తీసుకోవడం వంటి ప్రమాదాలు పెరగవచ్చు. అందుకే మందులను సురక్షితంగా భద్రపరచాలి. ఇంట్లో తడబడేలా లేదా పడిపోయేలా చేసే వస్తువులను తొలగించాలి. ఇంటి భద్రతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన మార్పులు చేసుకోవాలి.

ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి

మన దేశంలో అల్జీమర్స్‌ ఉన్న వ్యక్తి సంరక్షణలో సాధారణంగా జీవిత భాగస్వామి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి బాధ్యత తీసుకుంటుంటారు. అదే సమయంలో ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను కూడా చూసుకోవాల్సి రావడంతో కేర్‌గివింగ్‌ సవాలుగా మారుతుంది. ఈ సమయంలో అందరూ ఓ మాటమీద ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. 

Also Read : బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎవరికి ఎక్కువ? FAST టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ప్రాణం కాపాడొచ్చు.. లేకుంటే అంతే

రోగి రోజువారీ రొటీన్‌, తీసుకునే మందులు, వైద్యుల అపాయింట్‌మెంట్ల గురించి కుటుంబ సభ్యులందరికీ సమాచారం ఉండేలా చూసుకోవాలి. ఒకరు అందుబాటులో లేకున్నా.. మరొకరు అవాయిల్​బుల్​గా ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి హోమ్‌ కేర్‌, నర్సింగ్‌ లేదా ఇతర కమ్యూనిటీ సపోర్ట్‌ తీసుకోవచ్చు. 

ఒంటరిగా చేయకండి..

అల్జీమర్స్‌ ఉన్న వ్యక్తిని నిరంతరం చూసుకోవడం శారీరకంగా, మానసికంగా కుటుంబ సభ్యులకు కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి బాధ్యతను ఒక్కరే తీసుకోకూడదు. దీని వల్ల కేర్‌గివర్‌పై ఒత్తిడి పెరగవచ్చు. అందుకే కుటుంబ సభ్యులు బాధ్యతలను పంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

లేదు కాదు అని అన్నీ ఒక్కరే చేయడం మంచిది కాదని.. ఇది పేషెంట్​కే కాకుండా.. వారిని చూసుకునేవారికి కూడా ఇబ్బంది కలిగిస్తుందని అంటున్నారు. అందుకే అల్జీమర్స్ ఉన్న వ్యక్తిని చూసుకునేప్పుడు ఈ తప్పులు చేయవద్దంటున్నారు.

Also Read : చనిపోయాక గుండె ఆగిపోయినా కూడా బ్రెయిన్ పని చేస్తుందా? కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cigarette Cravings : సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి, స్మోకింగ్ తగ్గించుకోగలుగుతారు
సిగరెట్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి, స్మోకింగ్ తగ్గించుకోగలుగుతారు
Curry Leaf Oil For Hair : కరివేపాకులు తెల్లజుట్టును నల్లగా మార్చేస్తాయా? ఇంట్లోనే కరివేపాకు నూనె ఇలా చేసుకోండి
కరివేపాకులు తెల్లజుట్టును నల్లగా మార్చేస్తాయా? ఇంట్లోనే కరివేపాకు నూనె ఇలా చేసుకోండి
High Cholesterol : భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
భారత్‌లో 87.3 శాతం మందికి అధిక కొలెస్ట్రాల్.. ఫ్యామిలీ హిస్టరీ కంటే ఆహారమే కీలకమట
Cough and Cold in Kids : చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వచ్చాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
చలికాలంలో పిల్లలకు దగ్గు, జలుబు వచ్చాయా? ఉపశమనం కోసం ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget