అన్వేషించండి

Dementia Signs : మతిమరుపు లేదా డిమెన్షియా? ఈ 7 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, వైద్యుల సూచనలివే

Forgetfulness or Dementia : తరచుగా విషయాలు, పేర్లు మరచిపోతున్నారా.. వాటితో పాటు మీలో ఈ 7 లక్షణాలు ఉంటే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. అవేంటో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వయసుతో వచ్చే మతిమరుపు, డిమెన్షియాకు తేడాను గుర్తించాలి.
  • జ్ఞాపకశక్తి, ప్రవర్తనలో నిరంతర మార్పులు గమనించినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.
  • రోజువారీ పనులపై ప్రభావం చూపిస్తే వైద్య సలహా తప్పనిసరి.

Forgetfulness or Early Dementia Signs : వయసు పెరిగే కొద్దీ అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోవడం సహజమే. ఈ మధ్యే కలిసినా వ్యక్తి పేరు గుర్తుకు రాకపోవడం, ఏదైనా వస్తువు ఎక్కడ పెట్టామో గుర్తు రాకపోవడం వంటి చిన్న చిన్న మతిమరుపులు చాలామందిలో కనిపిస్తాయి. అయితే ప్రతి మతిమరుపును వయసు కారణంగానే భావించడం సరైనది కాదు. జ్ఞాపకశక్తి, ఆలోచనా విధానం లేదా ప్రవర్తనలో మార్పులు తరచుగా కనిపిస్తూ.. రోజువారీ పనులపై ప్రభావం చూపిస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెప్తున్నారు.

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌కు చెందిన కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి ప్రకారం.. డిమెన్షియా వృద్ధాప్యంలో సహజంగా వచ్చే సమస్య కాదు. కాబట్టి జ్ఞాపకశక్తి లేదా ఆలోచనా సామర్థ్యంలో మార్పులు క్రమంగా పెరుగుతున్నట్లు గుర్తిస్తే.. అవి మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలని అంటున్నారు. 

Also Read : తరచూ విషయాలు మర్చిపోతున్నారా? మతిమరుపు ఎక్కువైతే ఈ ఫుడ్ కాంబినేషన్స్‌ ట్రై చేయండి

" “అప్పుడప్పుడు మర్చిపోవడం సాధారణ వృద్ధాప్యంలో కనిపించవచ్చు. కానీ జ్ఞాపకశక్తి, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు నిరంతరంగా ఉండి.. రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయడం మొదలైతే దాన్ని కేవలం వయసు కారణంగా భావించకూడదు.” "
-డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్

పదేపదే మర్చిపోవడం

ఇటీవల జరిగిన సంభాషణలు, సంఘటనలు లేదా అపాయింట్‌మెంట్లను తరచుగా మర్చిపోవడం, ఒకే విషయాన్ని పదేపదే అడగడం వంటి మార్పులను గమనించాలి. గతంలో గుర్తుండే విషయాలు కూడా తరచుగా మర్చిపోతుంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

తెలిసిన పనులు చేయడంలో ఇబ్బంది

ఎప్పటినుంచో సులభంగా చేస్తున్న పనులే అయినా.. ఇప్పుడు వాటిని చేయడంలో ఇబ్బంది పడటం కూడా ఒక సంకేతమే. ఉదాహరణకు వంట చేయడం, షాపింగ్ చేయడం, డబ్బులు ఖర్చుపెట్టడం, లేదా తరచుగా ఉపయోగించే వస్తువులను ఆపరేట్ చేయడంలో ఇబ్బంది ఎదురైతే నిర్లక్ష్యం చేయకూడదు.

Also Read : మతిమరుపు ఎక్కువైందా? తరచూ మరచిపోవడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

ప్లానింగ్, సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బంది

రోజువారీ జీవితంలో సులభంగా చేసే పనులను ప్లాన్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా? తెలిసిన వంటకం తయారు చేసే విధానం మర్చిపోవడం, బిల్లులు చెల్లించడంలో ఇబ్బంది పడటం లేదా సాధారణ పనులను నిర్వహించలేకపోవడం వంటి మార్పులు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలి. 

" “ప్రతి మతిమరుపు డిమెన్షియా అని కాదు. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, డిప్రెషన్, కొన్ని మందులు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతపై ప్రభావం చూపవచ్చు. అయితే లక్షణాలు నిరంతరంగా ఉండటం, క్రమంగా పెరగడం లేదా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయడం మొదలైతే వైద్యుడిని సంప్రదించాలి.” "
-డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి

సమయం, ప్రదేశాలలో గందరగోళం

తేదీలు లేదా సమయం విషయంలో తరచుగా గందరగోళానికి గురికావడం, తెలిసిన ప్రదేశాల్లోనే దారి మర్చిపోవడం వంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు పదేపదే జరుగుతుంటే వైద్యుడిని సంప్రదించాలి.

Also Read : బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎవరికి ఎక్కువ? FAST టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ప్రాణం కాపాడొచ్చు.. లేకుంటే అంతే

పదాలు గుర్తుకు రాకపోవడం

మాట్లాడుతున్నప్పుడు తరచుగా సరైన పదం గుర్తుకు రాకపోవడం, సంభాషణను అనుసరించడంలో ఇబ్బంది పడటం లేదా చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా వ్యక్తపరచలేకపోవడం వంటి సమస్యలు కూడా గమనించాల్సినవే.

ప్రవర్తన, నిర్ణయాల్లో మార్పులు

గతంలో లేని విధంగా వ్యక్తిత్వం, మూడ్, ప్రవర్తన లేదా నిర్ణయాలు తీసుకునే విధానంలో మార్పులు కనిపించినా.. నిర్లక్ష్యం చేయకూడదు. కారణం తెలియకుండా ప్రవర్తనలో గణనీయమైన మార్పులు రావడం కూడా డిమెన్షియాతో సంబంధం కలిగి ఉంటుంది.

ఆధారపడటం

జ్ఞాపకశక్తి లేదా ఆలోచనా సామర్థ్యం తగ్గడం వల్ల మందులు తీసుకోవడం, డబ్బులు నిర్వహించడం, ఉద్యోగానికి సంబంధించిన పనులు, వ్యక్తిగత సంరక్షణ వంటి రోజువారీ బాధ్యతలను స్వయంగా నిర్వహించలేకపోతే వైద్య పరీక్ష అవసరం కావచ్చు.

Also Read : చనిపోయాక గుండె ఆగిపోయినా కూడా బ్రెయిన్ పని చేస్తుందా? కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

" “ప్రారంభ దశలోనే వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల జ్ఞాపకశక్తిలో మార్పులకు అసలు కారణం ఏమిటో గుర్తించే అవకాశం ఉంటుంది. అవి డిమెన్షియాకు సంబంధించినవా లేదా చికిత్స చేయగలిగే మరో ఆరోగ్య సమస్య వల్ల వచ్చాయా అనేది కూడా అంచనా వేయవచ్చు.” "
-డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

ఒక్కసారి ఏదైనా మర్చిపోవడం లేదా అప్పుడప్పుడు పేరు గుర్తుకు రాకపోవడం మాత్రమే ఉంటే వెంటనే డిమెన్షియా అని భయపడాల్సిన అవసరం లేదు. అయితే జ్ఞాపకశక్తి, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు తరచుగా జరుగుతూ, క్రమంగా ఎక్కువవుతూ, రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచించారు. 

Also Read : ప్రపంచ బ్రెయిన్ డే 2025.. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, మతిమరుపును దూరం చేసే టాప్ 5 ఫుడ్స్ ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Turkish Chicken Recipe : రెస్టారెంట్ స్టైల్ టర్కిష్ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి, రెసిపీ ఇదే
రెస్టారెంట్ స్టైల్ టర్కిష్ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి, రెసిపీ ఇదే
Phenyl for Floor Cleaning : ఫినాయిల్‌తో ఫ్లోర్ తుడుస్తున్నారా? వారానికి ఎన్నిసార్లు, ఎంత ఫినాయిల్, ఎలా వాడాలో తెలుసా?
ఫినాయిల్‌తో ఫ్లోర్ తుడుస్తున్నారా? వారానికి ఎన్నిసార్లు, ఎంత ఫినాయిల్, ఎలా వాడాలో తెలుసా?
Health Tests After 30 : బీపీ, షుగర్, కొలెస్ట్రాల్.. 30 తర్వాత ఈ హెల్త్ చెకప్స్ తప్పక చేయించుకోండి
బీపీ, షుగర్, కొలెస్ట్రాల్.. 30 తర్వాత ఈ హెల్త్ చెకప్స్ తప్పక చేయించుకోండి
Egg Maggi Recipe : ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
ఎగ్ మ్యాగీ రెసిపీ.. ఇలా చేస్తే టేస్టీగా, స్పైసీగా ఉంటుంది.. ఇంట్లోనే చేసుకోండిలా
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Tension: వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
వికారాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. గోశాల ఆవులపై దాడి, భయాందోళనలో స్థానిక ప్రజలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
Hyderabad Metro Rail Project:హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి ముహూర్తం ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Free Rice To Fishermen: మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఒక్కో కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఒక్కో కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం
TTD Online Tickets Booking: రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల గోల్‌మాల్ ఆరోపణలు.. భక్తులకు టీటీడీ క్లారిటీ
21,000 కిలోమీటర్ల ప్రయాణం.. Hyundai Alcazar పెర్ఫార్మెన్స్‌, ఫీచర్లు, కంఫర్ట్‌ ఎలా అనిపించింది?
Hyundai Alcazar లాంగ్‌ జర్నీ రిపోర్ట్‌.. 21,000 km ప్రయాణం ఎలా అనిపించింది?
H-1B Visa Changes: ఏడాదిలో హెచ్-1బి వీసా నిబంధనల్లో సమూల మార్పులు.. వీసా మోసాలపై క్రిమినల్ దర్యాప్తులు!
ఏడాదిలో హెచ్-1బి వీసా నిబంధనల్లో సమూల మార్పులు.. వీసా మోసాలపై క్రిమినల్ దర్యాప్తులు!
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
Embed widget