అన్వేషించండి

Life After Death : చనిపోయాక గుండె ఆగిపోయినా కూడా బ్రెయిన్ పని చేస్తుందా? కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Brain Activity Post-Death : మరణించిన తర్వాత ఓ వ్యక్తి ఎలా భావిస్తాడు? బ్రెయిన్ పనిచేస్తుందా? అనే విషయాలపై పరిశోధనలు చేశారు. ఈ స్టడీలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. అవేంటంటే.. 

Brain Work After Death : చనిపోయిన తర్వాత మనిషి ఎలా ఫీల్ అవుతాడు.. మరణం తర్వాత కూడా బ్రెయిన్ పని చేస్తుందా? అనే అంశాలపై కొత్త పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇవి కచ్చితంగా దిగ్భ్రాంతికి గురిచేస్తాయని అంటున్నారు పరిశోధకులు. న్యూయార్క్‌లోని NYU లాంగోన్ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ సామ్ పర్నియా.. మరణానంతరం మెదడు చురుగ్గా ఉంటుందా అనే దానిపై అధ్యయనం చేశారు. దీనిలో భాగంగా ఆయన బృందం US, UKలోని 25 ఆసుపత్రులలో గుండెపోటు నుంచి బయటపడిన 53 మందిని అధ్యయనం చేసింది.

మరణం ఎల్లప్పుడూ జీవితంలోని చివరి దశగా పరిగణిస్తారు. అయితే గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత.. ఒక వ్యక్తి స్పృహ ఆగిపోతుందని నమ్ముతారు. కానీ ఒక కొత్త శాస్త్రీయ అధ్యయనం దీనిని సవాలు చేసింది. గుండె ఆగిపోయిన తర్వాత కూడా మెదడు కొంతకాలం చురుకుగా పని చేస్తుందని.. అలాగే చనిపోయిన వ్యక్తి తన చుట్టూ ఉన్న సమాచారాన్ని గ్రహించగలడని పరిశోధన తెలిపింది. ఈ వాదన వినడానికి ఆశ్చర్యకరంగా మాత్రమే కాదు.. జీవితం, మరణం గురించి మన అవగాహనను పునరాలోచించుకునేలా చేస్తుంది.

కొత్త అధ్యయనం ఏం చెప్తోందంటే..

రీసస్సిటేషన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం గురించి ప్రచురించారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయి క్లినికల్‌గా చనిపోయినట్లు ప్రకటించిన తర్వాత కొంతమందిలో CPR సమయంలో మెదడు కార్యకలాపాలు నమోదు అయ్యాయని నివేదిస్తుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని సందర్భాల్లో గుండె ఆగిపోయిన 35 నుంచి 60 నిమిషాల తర్వాత EEGలు గామా, డెల్టా, తీటా, ఆల్ఫా, బీటా.. మెదడు తరంగాల సంకేతాలను చూపించాయి. ఇవి సాధారణంగా ఆలోచన, అవగాహనతో సంబంధం ఉన్న అదే తరంగాలట.

హార్ట్ పేషెంట్లపై చేసిన ఈ పరిశోధనలో చాలామంది రోగులు హార్ట్ కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత కూడా జ్ఞాపకాలు, అనుభవాలను అనుభవిస్తున్నట్లు వారు నివేదించారు. గుండె ఆగిపోయిన 10 నిమిషాల తర్వాత శాశ్వత మెదడు దెబ్బతింటుందని గతంలో నమ్మేవారు.. కానీ CPR సమయంలో కూడా మెదడు విద్యుత్ కోలుకునే సంకేతాలను చూపించగలదని పరిశోధనలో కనుగొన్నట్లు డాక్టర్ పర్నియా చెప్పారు.

40 శాతం మందికి అవగాహన ఉందట..

అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది కొంత స్థాయి వరకు అవగాహనను కలిగి ఉన్నట్లు నివేదించారు. కొందరు తమ శరీరాల నుంచి వేరు అయినట్లు.. ఆసుపత్రి గదిలో కార్యకలాపాలను చూస్తున్నట్లు లేదా గ్రహించినట్లు అనుభూతి చెందారని వివరించారు. ఈ అనుభవాలు కలలు, భ్రాంతులు లేదా భ్రమల నుంచి భిన్నంగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.

దీనిని బట్టి చూస్తే చనిపోయిన తర్వాత కూడా మనిషికి తన చుట్టూ ఏమి జరుగుతుందో అని తెలుస్తుంది. ఇది ఓ రకంగా కాస్త భయానికి గురిచేసే విషయమే అయినా.. శాస్త్రీయంగా మరింత బలంగా చెప్పేందుకు ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget