అన్వేషించండి

Spying in India : దేశ రహస్యాలు లీక్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అరెస్ట్ నుంచి శిక్ష వరకు పూర్తి వివరాలివే

Punishment for Spying : దేశ రహస్యాలు లీక్ ఇండియాలో కఠిన శిక్షలు విధిస్తారు. దీనిని కేవలం గూఢచర్యంగానే కాకుండా.. దేశద్రోహంగా చూస్తారు. మరి ఎలాంటి శిక్ష వేస్తారంటే..

Espionage Laws in India : భారత్ లాంటి పెద్ద, సున్నితమైన దేశంలో భద్రత అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దేశ సైన్యం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ప్రభుత్వం కలిసి.. ఏ వ్యక్తి కూడా దేశ రహస్య సమాచారాన్ని శత్రు దేశాలకు అందించకుండా చూసుకుంటాయి. ఒకవేళ ఎవరైనా అలా చేస్తూ పట్టుబడితే.. వారికి చాలా కఠినమైన శిక్షలు ఎదురవుతాయి. గూఢచర్యం (Spying) కేవలం ఒక నేరం మాత్రమే కాదు. దేశానికి ద్రోహం చేసినట్లుగా పరిగణిస్తారు.

దురంధర్ సినిమా చూసిన తర్వాత స్పై అంటూ చాలామంది వైరల్ వీడియోలు చేస్తున్నారు. అయితే ఇండియాలో ఉంటూ ఇండియా సమాచారాన్ని ఇతర దేశాలకు అందిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలుసా? భారతదేశంలో గూఢచర్యానికి సంబంధించిన కేసుల కోసం అధికారిక రహస్యాల చట్టం 1923, భారతీయ న్యాయ సంహిత 2023 కింద చర్యలు తీసుకుంటారు. ఈ చట్టాల లక్ష్యం దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటమే. కాబట్టి భారతదేశంలో పట్టుబడిన గూఢచారికి ఎలాంటి ప్రమాదకరమైన శిక్షలు విధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

గూఢచర్యం చేస్తే ఎంత శిక్ష విధిస్తారు?

ఒక వ్యక్తి.. దేశ భద్రత లేదా సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రు దేశానికి లేదా దాని ఏజెంట్లకు అందిస్తే.. అతనికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఒకవేళ కేసు చాలా తీవ్రంగా ఉండి.. దేశ భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లితే.. కోర్టు జీవిత ఖైదు కూడా విధించవచ్చు. ఎవరైనా అనుమతి లేకుండా విదేశీ ఏజెంట్లను సంప్రదిస్తే.. వారికి 2 సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. ఎవరైనా ముఖ్యమైన సెన్సిటివ్ సమాచారాన్ని లీక్ చేస్తే.. వారికి 3 సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. తక్కువ స్థాయి గూఢచర్య కార్యకలాపాలకు కూడా 3 సంవత్సరాల వరకు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. 

ఏ కోర్టులో విచారణ చేస్తారంటే..

గూఢచర్యం ఒక తీవ్రమైన నేరం. అంటే పోలీసులు వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు. ఇలాంటి కేసుల విచారణ సాధారణంగా ప్రత్యేక లేదా ఫాస్ట్-ట్రాక్ కోర్టులలో జరుగుతుంది. తద్వారా త్వరగా నిర్ణయం తీసుకోగలుగుతారు. నిందితుడికి శిక్ష పడితే అతను మొదట హైకోర్టులో, తరువాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. మొత్తం చట్టపరమైన ప్రక్రియలో చాలా నెలల నుంచి దాదాపు 20 నెలల వరకు సమయం పట్టవచ్చు. 

శిక్షను ఎలా నిర్ణయిస్తారు?

కోర్టు శిక్షను నిర్ణయించేటప్పుడు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. నేరం ఎంత తీవ్రమైనది? దేశ భద్రతకు నష్టం జరిగిందా? నిందితుడు ఉద్దేశపూర్వకంగా పని చేశాడా లేదా ఏదైనా ప్రలోభాలకు లోనయ్యాడా? కోర్టులో సమర్పించిన ఆధారాలు నిందితుడు ఉద్దేశపూర్వకంగా దేశానికి వ్యతిరేకంగా పని చేశాడని రుజువైతే శిక్ష మరింత కఠినంగా ఉండవచ్చు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget