ప్రాణాపాయమైన ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. అయితే కొన్ని అలవాట్లు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణమవుతాయట. స్మోకింగ్ వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. ఇది బ్రెయిన్ స్ట్రోక్‌కి ప్రధాన కారణమవుతుంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. సరైన జీవనశైలి లేకపోవడం.. వ్యాయామం చేయకపోవడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆల్కహాల్‌ని మితంగా తీసుకుంటే మంచిదే కానీ.. మితిమీరి తీసుకుంటే స్ట్రోక్ ప్రమాదం పెంచుతుంది. ఒత్తిడి అనేది అధిక రక్తపోటుకు కారణమవుతుంది. దీనివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశముంది. (Images Source : Unsplash)