మగాళ్లకూ బ్రెస్ట్ క్యాన్సర్ - లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకే కాదు.. పురుషులకు కూడా వస్తుంది. మగాళ్లలో ఎక్కువగా 60-70 ఏళ్ల పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కనిపిస్తుంది. అయితే, ఈ మధ్య చిన్న వయస్సులో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవుతోంది. మీ ఛాతి పరిమాణంలో మార్పులు కనిపిస్తున్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించాలి. చంక, ఛాతి ప్రాంతాల్లో నొప్పి లేని గడ్డలు ఏర్పడుతున్నా అనుమానించాలి. ఛాతికి ఉండే చనుమొనలు లోపలికి కుచించుకు పోయినా సందేహించాలి. శరీరంపై దద్దుర్లు, చనుమొనల నుంచి రక్తస్రావం కూడా క్యాన్సర్‌కు సంకేతమే. క్యాన్సర్ ఏర్పడిన ప్రాంతంలో చర్మం పుండులా మారితే డాక్టర్‌ను సంప్రదించాలి. Images Credit: Pexels