రుచికోసం, తొక్కల మీద ఏమైనా కెమికల్స్ ఉంటాయనే ఉద్దేశంతో చాలా ఫ్రూట్స్ పీల్ చేసి తింటాం.

కానీ పండ్లు, కూరగాయల్లో తొక్కల్లోనే 30 శాతం పోషకాలు ఉంటాయట.

వాటి తొక్కల్లోని పీచు మీ కడుపు నిండేలా చేసి బరువు తగ్గడంలో సహాయం చేస్తాయట.

బంగాళ దుంపలు పొట్టు తీయకుండా తింటేనే మంచిది అంటున్నారు.

పుచ్చకాయను తొక్కతో తింటే.. కండరాల నొప్పులు తగ్గుతాయట.

యాపిల్​ను తొక్కతో తింటే మెదడు, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది.

కీరదోసను పొట్టు తీయకుండా తింటే ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.

అరటి, కివీ పొట్టు తినాలంటే ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ.. వాటిని తొక్కతో తింటే మరి మంచిది అంటున్నారు.

అయితే ఏ ఫ్రూట్స్​ తినాలన్నా ముందుగా వాటిని నీటిలో బాగా శుభ్రం చేయాలి. (Image Sources : Unsplash)