గుండెకు ఏదైనా సమస్య వస్తే తప్పా.. దాని గురించి పెద్ద పట్టించుకోము.

దానికి సమస్య వచ్చి కాస్త ఆలస్యమై అటో.. ఇటో అయితే ఇంక అనుకునేదేమి ఉండదు.

కాబట్టి ముందు నుంచే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి ఉంచాలి.

మీరు తీసుకునే ఆహారంలో కొన్ని ఫుడ్స్ చేర్చుకుంటే హార్ట్​కి మంచిది.

పెరుగులోని పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు గుండెకు మంచివి.

వాల్​నట్స్​ రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గించి.. గుండె సమస్యలు దూరం చేస్తాయి.

చిక్కుళ్లలోని పీచూ పదార్థాలు అధికబరువును కంట్రోల్ చేసి.. గుండెను రక్షిస్తాయి.

పాలకూర వంటి ఆకు కూరలు, చేపలు కూడా గుండెను సంరక్షిస్తాయి. (Image Source : Unsplash)