వివిధ ఆరోగ్య సమస్యల వల్ల చాలా మందిలో బ్లడ్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో దీనివల్ల ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. అందుకే బ్లడ్ కౌంట్ పెరిగేందుకు మీరు కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి. బ్లడ్ పెరిగేందుకు తీసుకోవాల్సిన పదార్థాల్లో ఎండు ద్రాక్షలు ఒకటి. వీటిలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. స్త్రీలు వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశముంది. మలబద్ధకం, ఎసిడిటి సమస్యలకు వీటితో చెక్ పెట్టవచ్చు. (Images Source : Unsplash)