బరువు తగ్గాలనే ఉద్దేశంతో కొందరు ఒకపూట మాత్రమే భోజనం చేస్తారు. పగలు ఏ పని చేసినా శక్తి కావాలి కాబట్టి మధ్యాహ్నం తిని రాత్రుళ్లు తినడం మానేస్తారు. అయితే డిన్నర్ మానేయడం వల్ల ఆరోగ్యానికి మంచి కన్నా చెడు ఎక్కువట. రాత్రి నుంచి ఉదయం వరకు కడుపును ఖాళీగా ఉంచడం అస్సలు మంచిది కాదట. లంచ్ లేదా డిన్నర్ మానేయడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువట. మధుమేహం ఉన్నవారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డిన్నర్ మానేయడం వల్ల ఒత్తిడి పెరగడమే కాకుండా.. నిద్ర సమస్యలు వస్తాయట. డిన్నర్ పూర్తిగా మానేయకుండా.. రాత్రి 7లోపే ముగిస్తే ఆరోగ్యానికి మంచిదట. (Image Source : Unsplash)