అన్వేషించండి

Anemia Symptoms : మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే ఇది రక్తహీనత (Iron Deficiency) కావచ్చు, లైట్ తీసుకోకండి

Anemia Signs : మహిళల్లో అనీమియా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే రక్తహీనత ఉన్నప్పుడు శరీరం కొన్ని లక్షణాలు ఇస్తుంది. అవి ఏంటో.. ఎప్పుడు వైద్య సహాయం తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రక్తహీనత వల్ల తరచుగా అలసట, చర్మం పాలిపోవడం సాధారణం.
  • ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, చేతులు కాళ్లు చల్లబడతాయి.
  • గుండె వేగంగా కొట్టుకోవడం, జుట్టు రాలితే వైద్యుడిని సంప్రదించాలి.

Anemia Warning Signs : శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ తగినంతగా లేకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా ప్రారంభంలో స్వల్పంగా ఉంటుంది. కాబట్టి దాని లక్షణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. అయితే ఐరన్ లోపం పెరిగేకొద్దీ అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం మంచిది. మరి రక్తహీనత లక్షణాలు ఎలా ఉంటాయో.. వేటిని నిర్లక్ష్యం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

తరచుగా అలసట

ఎంత విశ్రాంతి తీసుకున్నా తరచుగా అలసటగా, నీరసంగా అనిపించడం అనీమియా సాధారణ లక్షణాల్లో ఒకటి. శరీర కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల శక్తి తగ్గినట్లు అనిపించవచ్చు. 

పాలిపోయే చర్మం 

అనీమియా ఉన్నప్పుడు ముఖం, పెదవులు, నాలుక లేదా కంటి లోపలి భాగం సాధారణం కంటే పాలిపోయినట్లు కనిపించవచ్చు. అయితే స్కిన్ ఛేంజ్ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. అలాగే చర్మం రంగులో మార్పులకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.

Also Read : ఐరన్ లోపం ఉంటే ఇడ్లీ, దోశ తినవచ్చా? ఈ తప్పులు చేస్తే శోషణ కష్టమే

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది

మెట్లు ఎక్కడం, వేగంగా నడవడం లేదా వ్యాయామం చేయడం వంటి పనులు చేసినప్పుడు సాధారణం కంటే త్వరగా ఆయాసం రావచ్చు. శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గడం దీనికి ఒక కారణం కావచ్చు.

తల తిరగడం, తేలికగా అనిపించడం

అనీమియా తీవ్రత పెరిగినప్పుడు కొందరిలో తల తిరగడం, నిలబడినప్పుడు తూలుతున్నట్లు లేదా తేలికగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి తరచుగా వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి.

తలనొప్పి, ఏకాగ్రత తగ్గడం

ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల కొందరికి తలనొప్పి రావచ్చు. అలాగే చదవడం, పని చేయడం వంటి సమయంలో ఏకాగ్రత పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. 

Also Read : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది

చేతులు, కాళ్లు చల్లగా మారడం

అనీమియా ఉన్న కొందరికి చేతులు, కాళ్లు తరచుగా చల్లగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఇతర లక్షణాలతో పాటు ఈ సమస్య కూడా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

గుండె వేగంగా కొట్టుకోవడం

శరీరానికి ఆక్సిజన్ సరఫరాను కొనసాగించేందుకు గుండె వేగంగా కొట్టుకోవాల్సి రావచ్చు. దీంతో గుండె దడ, వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు కొందరిలో కనిపించవచ్చు.

Also Read : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే

జుట్టు రాలడం, గోర్లు పెళుసుగా మారడం

ఐరన్ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టు రాలడం, గోర్లు బలహీనంగా మారి సులభంగా విరిగిపోవడం వంటి మార్పులు కనిపిస్తాయి. అయితే వీటికి ఇతర పోషక లోపాలు, హార్మోన్ల సమస్యలు వంటి కారణాలు కూడా ఉండొచ్చు.

కాబట్టి మీలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు.. వైద్యులు సూచించే టానిక్, ఐరన్ సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించవచ్చు కూడా. కాబట్టి సమస్యను తేలికగా తీసుకోకూడదని చెప్తున్నారు నిపుణులు.

Also Read : రక్తహీనత దూరం కావాలంటే.. మహిళలు తప్పక తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget