Iron-Rich Foods : ఐరన్ లోపం ఉంటే ఇడ్లీ, దోశ తినవచ్చా? ఈ తప్పులు చేస్తే శోషణ కష్టమే
Iron Deficiency : ఐరన్ లోపం ఉంటే కేవలం ఐరన్ అందించే ఫుడ్స్ తింటే సరిపోదని చెప్తున్నారు నిపుణులు. వాటితో పాటు మరికొన్ని ఫుడ్స్ యాడ్ చేసుకుంటేనే ఐరన్ను శరీరం శోషించుకుంటుందని చెప్తున్నారు.

- ఐరన్ లోపం ఉంటే తినడం కాదు, శరీరం శోషించుకోవడం ప్రధానం.
- ఐరన్ శోషణకు విటమిన్ సి సహాయం, టీ, కాఫీ ఆటంకం.
- మాంసాహార ఐరన్ సులభం; పులియబెట్టిన ఆహారాలు కూడా తోడ్పడతాయి.
Iron Rich Foods Alone May Not Be Enough : ఐరన్ లోపం ఉందని తెలిసిన వెంటనే చాలామంది పాలకూర, పప్పులు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్ వంటి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం మొదలుపెడతారు. కానీ ఆహారంలో ఐరన్ ఉండటం ఒక్కటే సరిపోదు.. అది మన శరీరాన్ని ఎంతవరకు శోషిస్తుందనేదే అసలు విషయమని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఒకే రకమైన ఫుడ్ ఇద్దరు వ్యక్తులు తిన్నా.. వారి శరీరంలో ఐరన్ స్థాయిలు ఒకేలా ఉండకపోవచ్చని తెలిపారు.
ఐరన్ శరీరానికి అందకపోవడానికి ఆహారంతో పాటు విటమిన్ సి, ఇతర పోషకాలు, భోజనం చేసే సమయం, టీ, కాఫీ వంటివి కూడా కారణం కావచ్చని చెప్తున్నారు. అందుకే ఐరన్ లోపం ఉన్నప్పుడు కేవలం ఐరన్ ఉన్న ఫుడ్స్ మాత్రమే కాకుండా.. మరిన్ని విషయాలపై ఫోకస్ చేయాలంటున్నారు. అవేంటో.. ఐరన్ శరీరాన్ని శోషించడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ లిస్ట్ ఏంటో చూసేద్దాం.
Also Read : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
ఐరన్ ఉన్న ఆహారం తింటే సరిపోదట..
జీర్ణవ్యవస్థ ఆహారంలోని మొత్తం ఐరన్‌ను శరీరంలోకి పంపదు. ముఖ్యంగా మొక్కల నుంచి లభించే నాన్ హీమ్ ఐరన్ శోషణ తక్కువగా ఉంటుందట. అందుకే పాలకూర లేదా పప్పులు తిన్నంత మాత్రాన వాటిలోని ఐరన్ మొత్తం శరీరానికి అందుతుందని అనుకోకూడదని చెప్తున్నారు. కానీ సరైన ఆహారాలను కలిపి తినడం ద్వారా ఐరన్ శోషణను మెరుగుపరచుకోవచ్చని అంటున్నారు నిపుణులు.
విటమిన్ సి బెస్ట్ ఆప్షన్
ప్లాంట్ బేస్డ్ ఆహారాల నుంచి లభించే ఐరన్ శరీరానికి సులభంగా అందేందుకు విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. అందుకే ఐరన్ ఉన్న ఆహారంతో పాటు విటమిన్ సి ఉన్న పదార్థాలను తీసుకోవడం మంచి అలవాటు. ఉదాహరణకు పాలకూర కూరలో కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు. పప్పులో టమాటా, నిమ్మకాయ లేదా చింతపండు వంటివి ఉపయోగించడం. డైట్లో భాగంగా జామ, నారింజ, ఉసిరి వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవచ్చు.
Also Read : జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
మాంసాహారంతో ఐరన్ మెరుగవుతుందా?
మాంసం, చికెన్, చేపలు వంటి జంతు ఆధారిత ఆహారాల్లోని హీమ్ ఐరన్.. మొక్కల నుంచి లభించే నాన్ హీమ్ ఐరన్‌తో పోలిస్తే శరీరానికి సులభంగా అందుతుంది. అందుకే మాంసాహారం తీసుకునేవారు ఐరన్‌ను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. అలా అని శాకాహారులు తప్పనిసరిగా ఐరన్ లోపంతో బాధపడతారని అర్థం కాదని చెప్తున్నారు. సరైన కాంబినేషన్తో మొక్కల ఆధారిత ఐరన్‌ను పొందవచ్చు.
ఆ సమయంలో టీ, కాఫీ వద్దు
చాలామంది చేసే పొరపాటు ఏంటంటే.. ఐరన్ ఉన్న ఫుడ్స్ తీసుకున్న వెంటనే టీ లేదా కాఫీ తాగేస్తారు. అంటే ఐరన్ ఉన్న పాలకూర, పప్పు లేదా ఇతర ఐరన్ ఫుడ్స్ తిన్న వెంటనే ఒక కప్పు టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే.. దానిని మార్చుకోవడం మంచిది. ఎందుకంటే టీ, కాఫీలలో ఉండే కొన్ని సమ్మేళనాలు ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే పాలు, చీజ్ వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని కూడా ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌తో తినకపోవడమే మంచిది.
Also Read : మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
ఐరన్ లోపం ఉంటే ఇడ్లీ, దోస తినొచ్చా?
సంప్రదాయ వంటకాల్లో ఉండే ఫెర్మెంటేషన్ పద్ధతి.. కొన్ని పోషకాలను శరీరం ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. ఇడ్లీ, దోస వంటి పులియబెట్టిన ఆహారాల్లో ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరుగుతుంది. ధాన్యాలు, పప్పుల్లో ఉండే ఫైటేట్ వంటి పదార్థాలు కొన్ని ఖనిజాల శోషణను తగ్గించవచ్చు. అలాగే చింతపండు, వెనిగర్, టమాటా వంటి సీ ఫుడ్స్ వంటల్లో ఉపయోగించడం కూడా మొక్కల ఆధారిత ఐరన్ శోషణకు అనుకూలంగా ఉండొచ్చు.
రక్తంలో ఐరన్ లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని పరీక్షల్లో తేలితే కేవలం ఆహారంతోనే సమస్యను పరిష్కరించుకోవాలని చూడకండి. కానీ ఐరన్ లోపానికి కారణం తెలుసుకోవడం ముఖ్యం. అవసరమైతే వైద్యుల సూచనతో ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : రక్తహీనత దూరం కావాలంటే.. మహిళలు తప్పక తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవే
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























