అన్వేషించండి

Excessive Hair Fall : జుట్టు ఎక్కువగా ఊడుతోందా? ఐరన్ లోపానికి ఇవే సంకేతాలు.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

Warning Signs of Iron Deficiency : జుట్టు ఎక్కువగా రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే అది ఐరన్ లోపం కావచ్చని చెప్తున్నారు నిపుణులు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అధిక జుట్టు రాలడం ఐరన్ లోపానికి సంకేతం కావచ్చు.
  • ఐరన్ లోపం జుట్టు రాలడం, అలసట, రక్తహీనతకు దారితీస్తుంది.
  • ఐరన్ ఆహారాలు, విటమిన్ సి తీసుకోవడం శోషణ పెంచుతుంది.
  • లక్షణాలు కొనసాగితే వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి.

Hair Loss And Iron Deficiency : జుట్టు ఊడటం అనేది చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య. వాతావరణ మార్పులు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాల వల్ల జుట్టు రాలిపోవచ్చు. అయితే కొన్నిసార్లు అధికంగా జుట్టు ఊడటం శరీరంలో ఐరన్ లోపానికి (Iron Deficiency) సంకేతం కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఐరన్ అనేది శరీరంలో ఆక్సిజన్‌ను కణాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తక్కువగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్లకు సరైన పోషణ అందక జుట్టు బలహీనమై రాలడం ప్రారంభమవుతుంది.

ఐరన్ లోపం ఉంటే జుట్టు ఎందుకు ఊడుతుంది?

ఐరన్ హిమోగ్లోబిన్ తయారీలో ముఖ్యమైన ఖనిజం. హిమోగ్లోబిన్ రక్తం ద్వారా ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు చేరవేస్తుంది. ఐరన్ లోపించినప్పుడు జుట్టు కుదుళ్లకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందక జుట్టు పెరుగుదల మందగిస్తుంది. ఫలితంగా జుట్టు పలుచబడటం, అధికంగా రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఐరన్ లోపానికి సంకేతాలు ఇవే..

దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు లేదా దిండుపై ఎక్కువగా జుట్టు కనిపిస్తే అది ఐరన్ లోపానికి సంకేతం కావచ్చు. అలాగే చిన్న పనులు చేసినా అలసిపోయినట్లు అనిపించడం, శక్తి లేకపోవడం ఐరన్ లోపంతో వచ్చే సాధారణ లక్షణాలుగా చెప్తున్నారు నిపుణులు. ముఖం, పెదవులు లేదా కంటి లోపలి భాగం తెల్లగా కనిపిస్తే రక్తహీనతకు సంకేతంగా చెప్తారు. గోర్లు సులభంగా విరిగిపోవడం, పలుచబడటం కూడా ఐరన్ లోపంతో సంబంధం కలిగి ఉండవచ్చు.

ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందక తల తిరగడం లేదా బలహీనంగా అనిపించవచ్చు. మెిట్లు ఎక్కినప్పుడు లేదా కొద్దిగా నడిచినా ఊపిరి ఆడకపోవడం, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల చేతులు, కాళ్లు తరచూ చల్లగా అనిపించడం వంటివి జరుగుతాయి. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు కొన్ని ఆహారాలు డైట్లో చేర్చుకోవాలి. 

ఐరన్ స్థాయిలను పెంచే ఫుడ్స్ ఇవే

మీకు ఐరన్ లోపం ఉంటే.. శరీరంలో దానిని పెంచుకోవడానికి కొన్ని ఫుడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, బీట్‌రూట్, ఖర్జూరాలు, కిస్‌మిస్, దానిమ్మ, గుడ్లు, చికెన్, చేపలు, పప్పులు, శనగలు, గుమ్మడికాయ గింజలు తీసుకోవచ్చు. ఐరన్ ఉన్న ఆహారాలతో పాటు నారింజ, నిమ్మకాయ వంటి విటమిన్ C అధికంగా ఉండే పదార్థాలను తీసుకుంటే ఐరన్ శోషణ మెరుగువుతుంది. 

వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే.. 

జుట్టు అధికంగా ఊడటం, అలసట, తల తిరగడం వంటి లక్షణాలు కొన్ని వారాల పాటుగా ఈ లక్షణాలు కొనసాగుతుంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. రక్త పరీక్షల ద్వారా ఐరన్ స్థాయిలు, హిమోగ్లోబిన్ స్థాయిలను పరీక్షించి సరైన చికిత్స తీసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా ఐరన్ సప్లిమెంట్లు వాడకూడదని చెప్తున్నారు నిపుణులు. 

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget