Moringa for Hair Growth : జుట్టు రాలకుండా, ఒత్తుగా పెరగాలంటే.. మునగాకును ఇలా డైట్లో తీసుకోవాలట
Moringa Benefits for Hair Growth : మునగాకు ఆరోగ్యానికే కాదు.. జుట్టు పెరుగుదలకు కూడా మంచిదట. ఇది జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది. కానీ అలాగే తీసుకోవాలట.

Boost Hair Growth Naturally with Moringa : మునగాకు ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా మంచి రుచిని కూడా ఇస్తుంది. దీనిలోని పోషకాలు ఇచ్చే ప్రయోజనాలు తెలియడంతో ఈ మధ్యకాలంలో చాలామంది దీనిని హెల్త్ కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఇది జుట్టుకు కూడా చాలామంచిదట. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుందని చెప్తున్నారు. అందుకే మునగాకును పొడి చేసుకుని జ్యూస్ లేదా ఆహారంతో పాటు కలిపి తీసుకోవచ్చని చెప్తున్నారు. లేదా నేరుగా వంటల్లో కలిపి తీసుకోవచ్చు. జుట్టు పెరుగుదలకు అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏంటో.. దీనివల్ల హెయిర్‌కి కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
మునగాకుతో జుట్టుకు కలిగే లాభాలు ఇవే
మునగాకులో విటమిన్ ఎ, సి, జింక్, ఐరన్ జుట్టును బలంగా, మెరిసేలా చేస్తాయి. విటమిన్ ఎ స్కాల్ప్‌ను తేమగా ఉంచుతుంది. చుండ్రును నివారిస్తుంది. విటమిన్ సి కొల్లాజెన్‌ను పెంచుతుంది. ఇది జుట్టును బలమైన పోషణ అందించి.. జుట్టు రాలకుండా చేస్తుంది. జింక్, ఐరన్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది జుట్టు మూలాలకు పోషణను సులభంగా చేరుస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ స్కాల్ప్‌కు లోపలి నుంచి పోషణ అందుతుంది. జుట్టు సమస్యలు తగ్గుతాయి.
జుట్టుకోసం మునగాకు పొడిని ఎలా తీసుకోవచ్చంటే..
మునగాకును జుట్టు, ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. దీనిని చాలా సులభంగా మీ రొటీన్లో చేర్చుకోవచ్చు. దానికోసం మీరు మునగాకు పొడిని ఉపయోగించవచ్చు. మునగాకు తెచ్చుకుని వాటిని ఎండబెట్టి.. ఆ ఆకులతో పొడి చేసుకుంటే ఈజీగా మీరు దానిని తీసుకోగలుగుతారు. ఉదయాన్నే స్మూతీ లేదా కొబ్బరి నీరు లేదా గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. రుచికోసం తేనెతో కలిపి తీసుకోవచ్చు.
పొడిగా వద్దు అనుకుంటే.. పప్పు లేదా సలాడ్లతో కలిపి తీసుకోవచ్చు. మునగాకులో ఉండే ప్రోటీన్, అమైనో ఆమ్లాలు.. జుట్టుకు ప్రోటీన్ అందిస్తాయి. కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మెరిసేలా చేస్తుంది. మొరింగా పొడి టేస్ట్ నచ్చకపోతే.. క్యాప్సుల్స్‌గా తీసుకోవచ్చు.
జుట్టు వేగంగా పెరగాలంటే..
తాజాగా, హైడ్రేటింగ్‌గా ఉండేందుకు.. మీరు మునగాకు జ్యూస్ తీసుకోవచ్చు. దీనిని మునగ ఆకులు, నీరు, నిమ్మరసంతో కలిపి చేస్తారు. రుచి కొద్దిగా చేదుగా ఉంటుంది. కానీ తేనె లేదా ఉసిరి రసంతో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఉదయం పరగడుపున 30 నుంచి 50 ml మొరింగా జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి పోషణ అంది.. స్కాల్ప్ ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. వాపు, మంటను తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. అలాగే కొబ్బరి లేదా ఆముదం నూనెతో కలిపి స్కాల్ప్ మీద మాస్క్‌గా ఉపయోగించుకోవచ్చు.
జ్యూస్, పొడిలో ఏది బెస్ట్
మునగాకు పొడి, జ్యూస్ రెండూ జుట్టుకు ఉపయోగపడతాయి. అయితే మీ లైఫ్‌స్టైల్, ప్రాధాన్యతల, రుచిని బట్టి మీరు ఎంచుకోవచ్చు. బిజీగా ఉంటే ప్రతిరోజూ మొరింగాను పొడి రూపంలో తీసుకోడం ఈజీగా ఉంటుంది. తాజాగా, డీటాక్స్ కూడా అవ్వాలి అనుకుంటే.. జ్యూస్ మంచిది. అయితే దీనిని పొడిరూపంలో వారానికి 5 రోజులు, జ్యూస్ రూపంలో రెండు రోజులు తీసుకోవచ్చు.






















