నేటి బిజీ లైఫ్ స్టైల్లో జుట్టు సంరక్షణ తీసుకోవడం ఓ సవాలుగా మారుతుంది. కాలుష్యం, ఒత్తిడి, సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల జుట్టు రాలిపోయేలా చేస్తుందట.
మీరు పొడవైన, దట్టమైన జుట్టు కావాలనుకుంటే.. ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించండి. ఇవి చాలా సింపుల్, ప్రభావవంతమైనవి.
నానబెట్టిన మెంతులు, ఉసిరి పొడి, కొద్దిగా ఆలివ్ నూనెతో కలిపి చేసిన పేస్ట్ జుట్టును బలంగా చేస్తుంది. ఇది జుట్టును వాల్యూమ్ చేస్తుంది.
కొబ్బరి లేదా ఆలివ్ నూనెతో వారానికి రెండు లేదా మూడు సార్లు తలకు మసాజ్ చేస్తే మంచిది. రక్త ప్రసరణ పెరిగి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు హెల్ప్ చేస్తుంది.
జుట్టు శుభ్రత కోసం శిఖకాయ్ ఉపయోగించవచ్చు. ఇది తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చుండ్రును నివారిస్తుంది. జుట్టును దెబ్బతినకుండా కాపాడుతుంది.
సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉల్లిపాయ రసం.. జుట్టు మూలాలకు పోషణ అందిస్తుంది. జుట్టు వేగంగా, దట్టమైన పెరుగుదలను అందిస్తుంది.
ఉసిరి పొడిని నీటితో కలిపి పేస్ట్ చేయండి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి, లోపలి నుంచి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తలకు పట్టించవచ్చు.
ఒత్తిడి జుట్టు రాలడానికి అతిపెద్ద కారణాలలో ఒకటి. దానిని కంట్రోల్ చేస్తే మీ జుట్టు బలంగా, ఆరోగ్యంగా మారుతుంది. యోగా, ధ్యానం చేయవచ్చు.
పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది మీ జుట్టును పొడవుగా, దట్టంగా పెరగడానికి అవసరమైన పోషకాలు అందేలా చేస్తుంది.
సూర్యుని, కాలుష్యం నుంచి మీ జుట్టును రక్షించుకోవాలి. క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా, నష్టం లేకుండా ఉంటుంది.