ప్రతి ఉదయం బాత్రూంలో మలబద్ధకం వల్ల ఇబ్బంది పడుతూ ఎక్కువ సమయం గడుపుతున్నారా? దీనివల్ల మీరు రోజంతా అసౌకర్యంగా ఉంటుంది.
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. అలా వచ్చే వాటిలో మలబద్ధకం అత్యంత సాధారణమైన సమస్యగా మారింది.
మలబద్ధకంతో బాధపడేవారు ఏమి తింటున్నాము.. ఏమి తాగుతున్నాము అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి.
మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా తినకూడని కొన్ని ఆహారాలు, డ్రింక్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.
శుద్ధి చేసిన పిండి, తెల్ల రొట్టెలు, కొత్త బియ్యం వంటి పదార్థాలు జీర్ణం చేసుకోవడం కష్టంగా మారుతాయి. దీనివల్ల మలబద్ధకం మరింత పెరుగుతుంది.
బఠానీలు, నల్ల శెనగలు వంటి పప్పులు ఉబ్బరానికి కారణం కావచ్చు. అలాగే మలబద్ధకం సమయంలో పేగు కదలికలను నెమ్మదింపజేస్తాయి.
ఐస్ క్రీమ్, ప్యాకేజ్ చేసిన స్నాక్స్, వేయించిన ఆహారాలు, మసాలా వంటకాలు, ఊరగాయలు, అధిక ఉప్పు, చల్లని పానీయాలు, జంక్ ఫుడ్స్ నివారించడం చాలా ముఖ్యం.
ఆలుగడ్డలు, కొన్ని రకాల దుంప కూరగాయలు తినకూడదు. ఎందుకంటే వీటిలోని పిండి పదార్థాలు మలబద్ధకం సమస్యను రెట్టింపు చేస్తాయి.
పూర్తిగా ఫ్యాట్ చీజ్, పాల ఉత్పత్తులలో పీచు తక్కువగా ఉంటుంది. అలాగే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని మరింత పెంచుతుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి పుష్కలంగా నీరు తాగాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి.