కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు.. మనస్తత్వాన్ని అధిగమించడానికి దృఢమైన, క్రమశిక్షణతో కూడిన ప్రయత్నాలు అవసరం. అవి మీకు ఆత్మ సంతృప్తిని ఇచ్చేలా ఉండాలి. ఎందుకంటే కొందరు ఎంత ఉన్నా తృప్తి పడరు.
చాలామంది ఒంటరిగా ఉండటం బెస్ట్ అని ఫీల్ అవుతారు. ఎందుకంటే అది వారికి ఫ్రీడమ్ ఇస్తుంది. కానీ అది సరికాదు. కాబట్టి ఉత్సాహభరితమైన సామాజిక, నాణ్యమైన లైఫ్ కోసం ట్రై చేయాలి.
ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల అసౌకర్యం, అపరాధ భావం, నిరాశ ఎక్కువగా కలుగుతాయి. నిరాశను దూరం చేసుకోవడానికి సానుకూల, ఆశావాద వ్యక్తులతో ఉంటే మంచిది.
చాలామంది అసలైన గోల్ వదిలేసి ఈజీగా డైవర్ట్ అవుతూ ఉంటారు. తర్వాత ఎఫర్ట్స్ పెట్టిన లక్ష్యాన్ని చేరుకోలేదని భావిస్తారు. కాబట్టి మనం మారినంత సులభంగా ప్రపంచం మనతో మారదని అర్థం చేసుకోవాలి.
కీర్తి, సక్సెస్ సాధించడం కష్టమే కావచ్చు. కానీ దాని తర్వాత గర్వం రాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ ప్రయాణాన్ని బలహీనపరుస్తుంది.
కొన్నిసార్లు ‘నేను ఏదైనా కోల్పోతున్నానా?’ అని ఆలోచిస్తాం. సోషల్ మీడియాలో కనిపించేవారితో పోల్చుకోకుండా జీవిత ప్రయాణాన్ని స్వీకరించాలి.
మీరు ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు కాన్ఫిడెన్స్‌గా రోజును ప్రారంభించండి. సందిగ్ధత పెట్టుకుని మొదలు పెట్టకపోవడమే మంచిది.
భయం సందేహాలను పెంచి నిరాశకు దారి తీస్తుంది. కాబట్టి ఎందుకు ప్రారంభించామో గుర్తు చేసుకుంటే పట్టుదలను పెరుగుతుంది. దీనివల్ల భయం తగ్గి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
కోపం జ్ఞాపకశక్తిని దూరం చేస్తుంది. తెలివిని అస్పష్టం చేస్తుంది. కోపం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకునే టెక్నిక్స్ ఫాలో అవ్వండి.
కామం అనేది ఒకరి ఇంద్రియాలను సంతృప్తి పరచుకునే కోరిక. అది నెరవేరనప్పుడు, అది కోపంగా మారుతుంది. లేదా అత్యాశకు దారి తీస్తుంది. కాబట్టి కామాన్ని రెచ్చగొట్టే పరిస్థితులకు దూరంగా ఉండాలి.