ఆవలింతలు ఒకరి నుంచి ఒకరికి ఎందుకు వ్యాపిస్తాయో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Canva

ఒకరి నుంచి మరొకరికి..

ఆవలింతలు ఒక వ్యక్తి ఆవలిస్తే దగ్గరలో ఉండే ఇతరులకు అవి రావడం ప్రారంభమవుతాయి.

Image Source: pexels

సహజమైన చర్య

ఆవులింత అనేది అందరికీ జరిగే సహజమైన ప్రక్రియ. దీనికి వయసుతో సంబంధం ఉండదు.

Image Source: pexels

ఆవలింతల వ్యాప్తి

ఆవలింతలు ఒకరి నుంచి ఒకరికి ఎందుకు వ్యాప్తిస్తాయి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

న్యూరాన్ల ఎఫెక్ట్

ఆవలింత ఒకరి నుంచి ఒకరికి ప్రతిచర్య. ఇది మెదడులో ఉండే న్యూరాన్స్ వల్ల జరుగుతుందని చెప్తున్నారు.

Image Source: pexels

ప్రతిస్పందించే నాడీ కణాలు

మెదడులోని న్యూరాన్లు ఇతరులను అనుకరించేలా చేస్తాయి. అలా ఎవరైనా ఆవులిస్తున్నప్పుడు మెదడు దానికి రియాక్షన్ ఇస్తూ ఆవలించేలా చేస్తాయి.

Image Source: pexels

న్యూరాన్ వ్యవస్థ

ఒక వ్యక్తి ఆవులిస్తే.. మెదడులోని న్యూరాన్ వ్యవస్థ స్పందించి.. మనం కూడా ఆవులించేలా చేస్తుంది.

Image Source: pexels

అంటువ్యాధి

ఈ ప్రభావాన్ని అంటువ్యాధి ఆవులింత అంటారు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

Image Source: pexels

పరిశోధన చెప్పేది ఇదే

అధ్యయనాలు ఏమి చెప్తున్నాయంటే.. ఇతరులు ఆవులిస్తున్నప్పుడు చూసిన తరువాత దాదాపు సగం మంది ఆవులిస్తారనే చెప్తున్నాయి.

Image Source: pexels

మెదడు రిలాక్స్ అయితే

ఆవులింతకు మరొక కారణం ఏమిటంటే మెదడు రిలాక్స్ అయ్యే సమయంలో వస్తుందట.

Image Source: pexels

మానసిక శ్రమ తర్వాత

మనం ఎక్కువగా ఆలోచించినా లేదా కష్టపడి పనిచేసినా.. ఆవలింత మెదడును రిఫ్రెష్ చేయడానికి ఒక సహజమైన మార్గంగా పనిచేస్తుందట.

Image Source: pexels