Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Hepatitis B vs Hepatitis C : హెపటైటిస్ బి, సి రెండూ లక్షణాలు లేకుండానే కాలేయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్లు. మరి వీటి మధ్య తేడాలు ఏంటి? వ్యాప్తి, చికిత్సలు ఎలా ఉంటాయో చూద్దాం.

- హెపటైటిస్ B, C కాలేయ వైరస్లు, వ్యాప్తి, చికిత్సలో భేదం.
- హెపటైటిస్ B రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి; దీనికి టీకా ఉంది.
- హెపటైటిస్ C కలుషిత సూదుల ద్వారా వ్యాప్తి; టీకా లేదు, నయం చేయవచ్చు.
- లక్షణాలు లేకున్నా కాలేయ నష్టం, సకాలంలో చికిత్స ముఖ్యం.
Hepatitis B vs Hepatitis C Key Differences : హెపటైటిస్ బి, హెపటైటిస్ సి.. రెండూ కాలేయాన్ని ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్లు. ఈ రెండు వ్యాధులు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు చూపించకపోవచ్చు. దీనివల్ల చాలామందికి తమకు ఇన్ఫెక్షన్ వచ్చిందనే విషయం కూడా గుర్తించలేరు. అయితే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్‌లు వ్యాప్తి చెందే విధానం.. వాటి నివారణ, చికిత్స విషయంలో చాలా తేడాలు ఉంటాయి. మరి ఈ రెండింటి మధ్య తేడాలేంటి? ఏది ఎలా వ్యాపిస్తుంది? చికిత్స ఎలా ఉంటుంది?
యశోద ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, లీడ్, అడ్వాన్స్‌డ్ ఎండోస్కోపిక్ ఇంటర్వెన్షన్స్ అండ్ ట్రైనింగ్, క్లినికల్ డైరెక్టర్గా చేస్తోన్న నవీన్ పోలవరపు హెపటైటిస్ బి అండ్ సి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. వీటిని గురించి అవగాహాన అందరికీ కచ్చితంగా ఉండాలని సూచించారు. మరి ఆయన చెప్పిన విషయాలు ఏంటో చూసేద్దాం.
Also Read : హెపటైటిస్ తగ్గించే మార్గాలివే.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే రోజువారీ అలవాట్లు
హెపటైటిస్ బి
హెపటైటిస్ బి వైరస్ (HBV) వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌ను హెపటైటిస్ బి అంటారు. ఇది ప్రధానంగా ఇన్ఫెక్టెడ్ బ్లడ్, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుందని డాక్టర్ నవీన్ పోలవరపు తెలిపారు. లైంగిక సంబంధాలు, కలుషితమైన సూదులు, సురక్షితం కాని వైద్య ప్రక్రియల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపించవచ్చు. అలాగే హెపటైటిస్ బి ఉన్న తల్లి నుంచి ప్రసవ సమయంలో బిడ్డకు కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని తెలిపారు.
Also Read : టాటూలు, టీకాలు, వైద్య చికిత్సలతో హెపటైటిస్ ముప్పు.. వైద్యులు ఇస్తోన్న సూచనలు ఇవే
హెపటైటిస్ సి
హెపటైటిస్ సి వైరస్ (HCV) కూడా కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఇది ప్రధానంగా ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ద్వారా వ్యాపిస్తుంది. కలుషితమైన సూదులను పంచుకోవడం, సురక్షితం కాని ఇంజెక్షన్లు, సరిగా స్టెరిలైజ్ చేయని టాటూ లేదా పియర్సింగ్ పరికరాలను ఉపయోగించడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : హెపటైటిస్ ముట్టుకుంటే వచ్చేస్తుందా? వాస్తవాలు కచ్చితంగా తెలుసుకోవాలంటోన్న వైద్యులు
హెపటైటిస్ బి, సి లక్షణాలు
హెపటైటిస్ బి, సి రెండింటిలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపించవచ్చు. అంటే ఎప్పుడూ అలసటగా ఉండటం, ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, కడుపులో అసౌకర్యం, మూత్రం ముదురు రంగులోకి మారడం, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. అయితే హెపటైటిస్ బి లేదా సి ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఈ లక్షణాలు కనిపించాల్సిన అవసరం లేదు. అలాగే ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా మారినప్పుడు చాలామందిలో ఎలాంటి లక్షణాలు ఉండవని డాక్టర్ నవీన్ తెలిపారు.
Also Read : ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం.. ఈ సైలెంట్ కిల్లర్ బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
చికిత్స ఎలా ఉంటుందంటే..
హెపటైటిస్ బి, హెపటైటిస్ సి రెండింటికీ చికిత్స విధానం ఒకేలా ఉండదని డాక్టర్ తెలిపారు. క్రానిక్ హెపటైటిస్ బి ఉన్న కొంతమందికి యాంటీవైరల్ మందులు ఇస్తారు. అందరికీ వెంటనే మందులు అవసరం ఉండకపోవచ్చు. వైరస్ స్థాయి, కాలేయ పరిస్థితి, ఇతర పరీక్షల ఫలితాలను బట్టి వైద్యులు చికిత్స లేదా రెగ్యులర్ మానిటరింగ్‌ను నిర్ణయిస్తారు. కొంతమందికి దీర్ఘకాలం చికిత్స అవసరం కావచ్చు.
హెపటైటిస్ సిని నయం చేయవచ్చా?
Also Read : కామెర్లు, హెపటైటిస్‌కి మధ్య వ్యత్యాసం ఇదే.. లక్షణాలు ఒకేలా ఉన్నా తేడాలు ఎక్కువే ఉన్నాయి జాగ్రత్త
చికిత్స చేయించుకోకుంటే..
హెపటైటిస్ బి లేదా సి ఇన్ఫెక్షన్ దీర్ఘకాలం కొనసాగితే కాలేయంలో క్రమంగా నష్టం ఏర్పడవచ్చు. Liver fibrosis, cirrhosis (కాలేయం గట్టిపడటం), liver cancer వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు.
హెపటైటిస్ బి, సి రెండూ లక్షణాలు లేకుండానే కాలేయాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే టెస్ట్‌లు చేయించుకోవడం కంటే.. రిస్క్ ఉన్నవారు వైద్యుల సలహాతో అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. హెపటైటిస్ బి లేదా సి ఉన్నట్లు అనుమానం ఉంటే స్వయంగా మందులు తీసుకోకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా లివర్ స్పెషలిస్ట్‌ను సంప్రదించాలి.
Also Read : హెపటైటిస్ HIV కంటే డేంజర్ అట.. ఇండియాలో ఏటా రెండు లక్షలమందిని ప్రభావితం చేస్తోన్న వైరస్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























