అన్వేషించండి

Hepatitis B and C : టాటూలు, టీకాలు, వైద్య చికిత్సలతో హెపటైటిస్ ముప్పు.. వైద్యులు ఇస్తోన్న సూచనలు ఇవే

Hepatitis :హెపటైటిస్ బి, సి లలో కొద్దిపాటి రక్తంతో వైరస్ వ్యాప్తి చెందుతుంది. టీకాలు మిస్ అవ్వడం నుంచి సరైన పద్ధతిలో టాటూలు, వైద్యపరమైన చికిత్సలు చేయించుకోకపోవడమే దీనికి కారణాలు అవుతున్నాయట.

Hidden Risks of Hepatitis : హెపటైటిస్ అనేది ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఇప్పటికీ దీనిని ముప్పుగానే చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది జీవితాలను ఇది సైలెంట్​గా ప్రభావితం చేస్తుంది. టాటూలు, టీకాలు, వైద్య చికిత్సలు వంటివాటి వల్ల ప్రధానంగా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు వోరా ఇంటర్నేషనల్ SOS విభాగానికి చెందిన డాక్టర్ విక్రమ్ వోరా. మనం తేలికగా తీసుకునే కొన్ని అంశాలే హెపటైటిస్​కి కారణమవుతున్నాయంటూ హెచ్చరిస్తున్నారు. హెపటైటిస్ లక్షణాలు త్వరగా కనిపించవని.. అది శరీరంలోనే సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా ఉండి.. కాలేయంపై ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు. అసురక్షితమైన, కొన్ని నిర్లక్ష్యమైన విషయాల వల్ల దీని వ్యాప్తి ఉంటుంది. కాబట్టి వ్యాప్తి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విక్రమ్ వోరా ఇస్తోన్న సూచనలు ఏంటో చూసేద్దాం. 

హెపటైటిస్ బికి టీకా సురక్షితమేనా?

భారతదేశంలో సార్వత్రిక హెపటైటిస్ బి టీకా 2007లో మాత్రమే నవజాత శిశువులకు ప్రామాణికంగా మారింది. దానికంటే ముందు మీరు పుట్టి ఉంటే.. మీరు పూర్తి స్థాయిలో టీకాను పొంది ఉండకపోవచ్చు. లేదా ఏ మోతాదులోనైనా తీసుకుని ఉండొచ్చు. టీకాలు వేయించుకున్న వారిలో కూడా.. అవి అసంపూర్ణ డోస్​లు, బూస్టర్‌లు మిస్ అయి ఉండొచ్చు. దాని గురించిన అవగాహన కార్యక్రమాలు లేకపోవడం వల్ల కొందరు ఆ టీకా కూడా వేయించుకుని ఉండరు. ఇలా ఏ విధంగా అయినా టీకాకు దూరంగా ఉంటే కచ్చితంగా చేయించుకోవాలంటున్నారు. 

టీకా చేయించుకోకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. కాబట్టి మీరు ఏదైనా ట్రీట్మెంట్ లేదా సర్జరీలు చేయించుకునే ముందు హెపటైటిస్ బి రోగనిరోధక శక్తిని క్రమం చెక్ చేయించుకోవాలి. యాంటీ-హెచ్‌బీఎస్ యాంటీబాడీ టెస్ట్ చేయించుకుని.. అవి లేకపోతే టీకాలు వేయించుకోవాలి.

టాటూలతో ప్రమాదం

టాటూలు ఫ్యాషన్ కోసం వేయించుకోవడం ఓ కల్చర్​లా మారిపోయింది. కానీ టాటూ మెషిన్ ద్వారా హెపటైటిస్ బి, సి వంటి రక్త సంబంధిత వైరస్‌ల ప్రమాదం ఎక్కువగా ఉందని మీకు తెలుసా? చాలా టాటూ స్టూడియోలు శుభ్రత విషయంలో ప్రోటోకాల్‌లు అనుసరిస్తున్నప్పటికీ.. చౌకగా లేదా త్వరగా సేవలు అందించే ప్లేస్​లలో ఒక క్లయింట్​కి ఉపయోగించిన సూదులను మళ్లీ ఉపయోగిస్తారు. పరికరాలను సరిగ్గా స్టెరిలైజ్ చేయరు. సిరా కూడా కలుషితం అవుతుంది. ఇవన్నీ హెపటైటిస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి.

టాటూ వేయించుకోవడం పూర్తిగా వ్యక్తిగతం. కానీ దాని ద్వారా ఎలాంటి ప్రమాదాలు రాకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మంచిగా, హైజీన్​గా ఉండే ప్రదేశాలు ఎంచుకోవాలి. అలాగే వారు సూదులు, సిరా మారుస్తున్నారో లేదో కూడా చూసుకోవాలి. లైసెన్స్ పొందిన స్టూడియోల్లో చేయించుకుంటే మంచిది. 

అసురక్షితమై వైద్య చికిత్సలు

వైద్యులు ఉపయోగించే ఇంజెక్షన్​ల వల్ల కూడా హైపెటైటిస్ ఎటాక్ అవ్వవచ్చు. కొన్ని క్లినిక్‌లు, వెల్నెస్ సెంటర్‌లు, IV డ్రాప్స్, B12 షాట్‌లు లేదా గ్లూటాతియోన్ థెరపీని అందించే స్పాలలో కూడా.. సూదులను మళ్లీ ఉపయోగిస్తారు. కొన్ని ప్రదేశాల్లో శుభ్రతను పాటించరు. పరిస్థితి అధ్వాన్నంగా ఉంటూ.. హైజీన్ పాటించని ఆస్పత్రులు ఎంచుకోకపోవడమే మంచిది. ప్రసిద్ధ వైద్య కేంద్రాలు ఎంచుకోవాలి. మీకు IV థెరపీ లేదా షాట్‌లు అవసరమైతే.. సిరంజిలు మీ ముందే తెరిచేలా చూసుకోండి.

సరిగ్గా స్టెరిలైజ్ చేయని పరికరాలపై.. చేతులు, పాదాలు, షేవింగ్ కోసం ఉపయోగించే వాటిపై సూక్ష్మ మోతాదులో రక్తం ఉండవచ్చు. అవి కంటికి కనిపించవు. డెంటల్ ఆస్పత్రుల్లో కూడా ఇలా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ట్రీట్​మెంట్స్​కి వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండాలి. హెపటైటిస్ బి, సి వ్యాపించడానికి కొద్ది మొత్తంలో సోకిన రక్తం కూడా సరిపోతుంది. కాబట్టి చికిత్సకు, బ్యూటీ ట్రీట్​మెంట్​కి ఉపయోగించే పనిముట్లను స్టెరిలైజ్ చేయాలి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • హెపటైటిస్ బి, సి స్క్రీనింగ్ గురించి వైద్యుడిని అడిగి తెలుసుకుని చేయించుకోవాలి. ఇది ఒక సాధారణ రక్త పరీక్ష.
  • హెపటైటిస్ బి టీకా ద్వారా నివారించవచ్చు. ఆలస్యం చేయకండి. టీకాలు వేయించుకోండి.
  • టాటూ స్టూడియో, క్లినిక్ లేదా సెలూన్ అయినా.. మీ ఆరోగ్యం మీ బాధ్యత కాబట్టి. మీకున్న డౌట్స్ అడగాలి. ఆన్సర్స్ డిమాండ్ చేయాలి.

హైపటైటిస్ గురించి తెలుసుకోవడం, సరైన ఎంపికల ద్వారా వ్యాప్తి కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు నిపుణులు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

10K Step Count : రోజూ 10,000 అడుగులు నడవకపోతే ఆరోగ్యానికి మంచిది కాదా? ఎవరు ఎంత నడిస్తే మంచిది? 5 ఏళ్ల నుంచి 60 ఏళ్లు
రోజూ 10,000 అడుగులు నడవకపోతే ఆరోగ్యానికి మంచిది కాదా? ఎవరు ఎంత నడిస్తే మంచిది? 5 ఏళ్ల నుంచి 60 ఏళ్లు
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Scalp Care Tips : చుండ్రు, జిడ్డు తగ్గడం లేదా? స్కాల్ప్ శుభ్రంగా ఉంచుకోవడానికి తలస్నానం చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
చుండ్రు, జిడ్డు తగ్గడం లేదా? స్కాల్ప్ శుభ్రంగా ఉంచుకోవడానికి తలస్నానం చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Tragedy Story: బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
This Week OTT Web Series : ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
Cashews For Health : జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
Gill, Iyer Swap: వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
Embed widget