నిశ్చలమైన, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా.. ఆరోగ్యం దెబ్బతింటుంది. వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఆరోగ్యకరమైన దినచర్య లేకపోవడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. ఇది అన్ని వయసుల వారిలోనూ ఒక సాధారణ సమస్యగా మారింది.
అధిక బరువు కేవలం రూపాన్ని మాత్రమే ప్రభావితం చేయదు. ఇది జీవక్రియ, హృదయనాళ సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
ఊబకాయం నేరుగా అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందా? ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు చూసేద్దాం.
పరిశోధనలు అధిక శరీర బరువు అధిక రక్తపోటు వచ్చే అవకాశాన్ని గణనీయంగా పెంచుతుందని నిర్ధారించాయి.
అధిక బరువు రక్త నాళాలు, మూత్రపిండాలు, ఇతర అవయవాలలో మార్పులకు కారణమవుతుంది. ఇది కాలక్రమేణా రక్తపోటును పెంచుతుంది.
పొత్తికడుపులో పేరుకుపోయిన కొవ్వు రక్త నాళాలను కుంచించుకు పోయేలా చేస్తుంది. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది.
బరువు తగ్గడం వల్ల రక్తపోటును సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చు. ఇవి ముఖ్యమైన అవయవాలపై భారాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
రక్తపోటును నియంత్రించడంతో పాటు.. బరువు తగ్గడం వల్ల స్ట్రోక్, ఇతర తీవ్రమైన గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది.