Ear Cleaner : నొప్పి, రిస్క్ లేకుండా చెవులను శుభ్రం చేసే హెడ్‌ఫోన్స్
Smart Ear Cleaner : సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన పరికరానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనితో చెవులను సురక్షితంగా శుభ్రం చేసుకోవచ్చు. వీడియో చూడండి.

Viral Gadget for Ear Cleaning : సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. దీని పేరు స్మార్ట్ ఇయర్ క్లీనర్. ఈ పరికరం చెవులు శుభ్రం చేయడానికి సాధారణ పద్ధతులను మార్చగలదని నిరూపించింది. దీనిని ఉపయోగించడం ద్వారా చెవులు చాలా బాగా శుభ్రం అవుతాయి. ఈ కొత్త టెక్నాలజీకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని అందరూ చూస్తూనే ఉన్నారు.
ఈ పరికరాన్ని ఎలా ఉపయోగించాలంటే..
ఈ స్మార్ట్ ఇయర్ క్లీనర్ హెడ్‌ఫోన్ లాగా కనిపిస్తుంది. కానీ దీని పని పాటలు వినేందుకు కాదు. చెవులను శుభ్రం చేసుకోవడానికి. వీడియోలో ఒక మహిళ ఈ పరికరాన్ని ధరించి.. దానిని ఉపయోగిస్తోంది. ఈ పరికరం చెవిలోని మురికిని ఎంత బాగా శుభ్రం చేస్తుందో వీడియోలో చూడవచ్చు. నిపుణుల సమాచారం ప్రకారం.. ఈ పరికరంలో చిన్న కెమెరా, క్లీనింగ్ టూల్స్ ఉంటాయి. ఇవి చెవిలోని మురికిని శుభ్రం చేయడంతోపాటు.. దానిని ఎలా క్లీన్ చేస్తాయో లైవ్ స్ట్రీమ్‌లో కూడా చూపించేలా రూపొందించారట.
Self Hygiene का नया अध्याय अब शुरू होगा इस smart device के साथ।
— Faruk Pathan (@Faruk_pathan01) September 22, 2025
ना झंझट, ना रिस्क। बस आसान, सुरक्षित और स्मार्ट तरीका अपनाइए और हो गई मिनटों में आपको सफाई, क्योंकि टेक्नोलॉजी वहीं असली है, जो आपकी हेल्थ का आसानी से ध्यान रखे।
कान साफ करना अब बोरिंग नहीं लाइव स्ट्रीम के साथ मज़ा… pic.twitter.com/6koTUXzoEc
ఇకపై చెవుల శుభ్రత నిమిషాల్లోనే
ఈ పరికరాన్ని ఉపయోగించడం చాలా సులభం. పైగా పూర్తిగా సురక్షితం. దీనివల్ల చెవులు శుభ్రం చేయడం ఇప్పుడు నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై చాలామంది ఆసక్తి కూడా కలిగింది.
చెవి శుభ్రత అనేది అందరికీ చాలా ముఖ్యం. గులిమి పేరుకుపోయినప్పుడు వినికిడిలో మార్పులు ఉంటాయి. అంతేకాకుండా చెవినొప్పి రావడం వంటివి జరుగుతుంది. దాని శుభ్రత కోసం చాలామంది ఇయర్ బడ్స్ వాడుతారు కానీ.. అవి అంత మంచివి కాదని చెప్తారు. పైగా అవి గులిమిని మరింత లోపలికి పంపేస్తాయని.. దీనివల్ల మరిన్ని ఇబ్బందులు పెరుగుతాయని అంటున్నారు. అంతేకాకుండా చెవిలో ఏవి పడితే వాటిని పెట్టడం పోయడం వల్ల చెవి, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పరికరం ఆ సమస్యలకు చెక్ పెడుతూ.. చెవులను ఈజీగా, నొప్పి లేకుండా శుభ్రం చేస్తుందని అంటున్నారు.






















