Hepatitis B Virus : హెపటైటిస్ HIV కంటే డేంజర్ అట.. ఇండియాలో ఏటా రెండు లక్షలమందిని ప్రభావితం చేస్తోన్న వైరస్
Hepatitis B Death Rates in India : ప్రపంచ ఆరోగ్య సంస్థ హైపటైటిస్ గురించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. హెపటైటిస్ బి.. హెచ్ఐవీ కంటే 50 నుంచి 100 రెట్లు ఎక్కువగా వ్యాప్తిస్తుందని తెలిపింది.
Hepatitis B cases in India : భారతదేశంలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధులలో హెపటైటిస్ బి ఒకటి. ఇది మొత్తం కాలేయ దీర్ఘకాలిక వ్యాధుల్లో మూడవ వంతు ఉంది. ఈ కాలేయ ఇన్ఫెక్షన్ ఇండియాలో ఏటా లక్షమందికి పైగా ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ దీర్ఘకాలిక వ్యాధి హెపటైటిస్ బి అనే వైరస్ ద్వారా వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. వైరల్ హెపటైటిస్ కేసులలో ఇండియా ప్రపంచంలోనే రెండవ అత్యధిక ప్రభావితమైనదిగా తెలిపింది. ఇండియాలో ప్రతి సంవత్సరం లక్షమందికి పైగా ప్రజలను ప్రభావితం చేస్తుందని వెల్లడించింది.
హెపటైటిస్ ఏ, ఈ వ్యాధి తీవ్రమైన రూపాన్ని కలిగి ఉంటుంది. హెపటైటిస్ బి, సి దీర్ఘకాలిక కాలేయ వ్యాధికి దారితీస్తుంది. ఇందులో సిర్రోసిస్ కాలేయ, క్యాన్సర్ కూడా ఉంటాయి. 60 శాతం కేసులు నేరుగా వ్యాపిస్తుంటే.. తల్లి నుంచి నవజాత శిశువుకు నేరుగా ప్రసారం అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. అసురక్షిత ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి పెరగడానికి ప్రధానకారణమవుతుందని తెలిపారు. IV మాదకద్రవ్యాల దుర్వినియోగం, టాటూయింగ్, అధిక ప్రమాదకరమైన లైంగిక ప్రవర్తన ద్వారా ఇది వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు.
హెచ్ఐవి కంటే వ్యాప్తి ఎక్కువ
డయాలిసిస్ రోగులు, HBV రోగులు, వృత్తిపరమైన రక్తదాతలు, IV ఔషద వినియోగదారులు.. ప్రమాదకరమైన లైంగిక సంబంధాలు ఉన్నవారిలో ఇది అధిక ప్రమాదాలను కలిగిస్తుంది. హెపటైటిస్ ఏ, ఈ వ్యాధి తీవ్రమైన రూపానికి దారితీస్తున్నాయి. హెపటైటిస్ బి,సి దీర్ఘకాలిక కాలేయ వ్యాధికి దారి తీస్తుంది. ఇందులో సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ ఈ పరిస్థితిని తీవ్రం చేస్తుంది. WHO ప్రకారం.. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) మాదిరిగానే సోకిన వ్యక్తి రక్తం లేదా శరీర ద్రవాల ద్వారా HBV వ్యాపిస్తుంది. హెచ్ఐవి కంటే హెచ్బివి ద్వారా 50 నుంచి 100 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు.
మరణాలకు దారితీస్తుంది..
HBV ఇన్ఫెక్షన్ తరచుగా సిర్రోసిస్ లేదా కామెర్లు, అసిటిస్, వరిసెయల్ బ్లీడింగ్ లేదా కాలేయ వైఫల్యం వంటి సమస్యల రూపంలో వస్తుంది. ఇది చాలా సంవత్సరాలు సైలెంట్‌గా ఉంటుంది. ప్రారంభదశలో ఈ వ్యాధిని గుర్తించడం చాలా కష్టం. దీనిని గుర్తించే సరికి జరగాల్సి డ్యామేజ్ అంత జరుగుతుంది. దీర్ఘకాలిక హెపటైటిస్ బి సంక్రమణ కాలేయ క్యాన్సర్ సగానికి పైగా, గణనీయమైన సంఖ్యలో కాలేయ సంబంధిత మరణాలకు దారి తీస్తుంది. హెపటైటిస్ బి అనేది సైలెంట్‌గా ఎటాక్ చేయడం వల్ల దీనివల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. దానిని ఎదుర్కోవడం కష్టతరంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.
వైద్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హెపటైటిస్ బి వైరస్ ఇండియాలో ప్రమాదకరంగా బాల్యంలోనే సంక్రమిస్తుందని అంటున్నారు. రోగనిర్ధారణ, చికిత్స గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల మరణాలు పెరుగుతున్నాయని వారు చెప్తున్నారు. అందుకే దీనిపై అవగాహన కల్పించాలంటున్నారు వైద్య నిపుణులు. HBV ఇన్ఫెక్షన్ రాకుండా రక్షణ కోసం.. కొన్నిరకాల టెస్ట్‌లు, యూనివర్సల్ టీకా, సురక్షిత లైంగిక పద్ధతులు, స్క్రీనింగ్, చికిత్సపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. హెపటైటిస్ ఏ వైరస్ సంక్రమణ పిల్లల్లో కాలేయ వ్యాధికి ప్రధాన కారణం అవుతుంది. ఇది తేలికపాటి నుంచి తీవ్రమైన కాలేయం వైఫల్యానికి కారణమవుతుంది.
నివారణ చర్యలు
హెపటైటిస్ ఏ వైరస్, హెపటైటిస్ బి వైరస్‌కి వ్యతిరేకంగా ఎన్ని టీకాలు అందుబాటులో ఉంటున్నాయి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, సురక్షితమైన ఫుడ్, నీటి వినియోగం, మురుగునీరు లేకుండా చూసుకోవడం, పారిశుద్ధ్య పద్ధతులను మెరుగుపరచుకోవాలి. చుట్టూ ఉండే ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లైంగికంగా కొన్ని సురక్షిత చర్యలు తీసుకోవాలి. హెపటైటిస్ ఎ వ్యాక్సిన్ దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని అందిస్తుంది. హెపటైటిస్ ఇ వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు.
Also Read : సమ్మర్ స్పెషల్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్.. ఈ టిప్స్‌తో సింపుల్‌గా రెడీ చేసేయండి