అన్వేషించండి

Homemade Fruit Custard Recipe : సమ్మర్​ స్పెషల్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్.. ఈ టిప్స్​తో సింపుల్​గా రెడీ చేసేయండి

Tasty Fruit Custard : సమ్మర్​లో చల్లగా, టేస్టీగా తినాలనుకుంటే మీరు ఫ్రూట్స్ కస్టర్డ్​ని తయారు చేసుకోండి. దీనిని సింపుల్​గా, రుచిగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Summer Special Fruit Custard Recipe : ఫ్రూట్ కస్టర్డ్​ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా సమ్మర్​లో బయట వీటిని తీసుకుంటూ ఉంటారు. కానీ కొందరికి దీనిని ఎలా తయారు చేయాలో తెలియదు. కానీ చాలా సింపుల్​గా దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. హెల్తీ, టేస్టీగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ రావాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? దీనిని ఎలా తయారు చేయాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు 

పాలు - 1 లీటర్

కస్టర్డ్ పౌడర్ - 4 టేబుల్ స్పూన్లు

పంచదార - అరకప్పు 

మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ - పావు టీస్పూన్

అరటి పండు - 1

ఆపిల్ - 1 ఆపిల్

సపోటా - 1

కివి - 1 

డేట్స్ - 7

జీడిపప్పు - 50 గ్రాములు 

నల్ల ద్రాక్ష - 50 గ్రాములు 

ద్రాక్ష - 50 గ్రాములు

దానిమ్మ గింజలు - అర కప్పు

తయారీ విధానం

ముందుగా పావు లీటర్ పాలు తీసుకోండి. దానిలో కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపండి. అనంతరం దానిలోనే వెనిలా ఎసెన్స్ వేసి మరోసారి బాగా తిప్పాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై మందపాటి కడాయి పెట్టండి. దానిలో పాలు వేసి.. మీడియం మంట మీద మరిగించండి. ఇక్కడ పాలు క్రీమ్ మిల్క్ తీసుకుంటే మంచిది. అవి మరిగిన తర్వాత దానిలో అరకప్పు పంచదార వేసి కలపాలి. అనంతరం ముందుగా పాలల్లో మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ముద్దలు లేకుండా దానికి కలుపుతూ చిక్కగా ఉడకనివ్వాలి. అది ఉడికి చిక్కబడిన తర్వాత స్టౌవ్ ఆపేయండి. రూమ్ టెంపరేచర్​కి వచ్చిన తర్వాత దానిని ఫ్రిడ్జ్​లో పెట్టి రెండు గంటలు ఉంచండి.

ఆలోపు ఫ్రూట్స్​ని కట్ చేసుకోవాలి. అయితే మీరు ఫ్రూట్స్​ని కూడా ఫ్రిడ్జ్​లో పెడితే రుచి మరింత పెరుగుతుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఫ్రూట్స్​కి పైన తొక్క తీసేయాలి. పుల్లని ఫ్రూట్స్ నారింజ వంటివి వేయకుండా ఉంటేనే మంచిది. సపోటాకి పైన తొక్కతీసి గుజ్జును ముక్కలుగా కోయాలి. అలా చేసినప్పుడు సీడ్స్​కూడా తీసేయొచ్చు. దానిమ్మ గింజలు పక్కన పెట్టుకోవాలి. ద్రాక్షలను మధ్యలోకి కోస్తే రుచి బాగుంటుంది. అరటి పండు, యాపిల్ తప్పా అన్ని ఫ్రూట్స్​ని మీరు కట్ చేసి ఫ్రిడ్జ్​లో పెట్టుకోవచ్చు. ఇవి ఎందుకు వద్దంటే.. వాటిని కట్ చేసి ఫ్రిడ్జ్​లో పెడితే రంగు మారిపోతాయి. 

సర్వింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు అరటి, యాపిల్​ను ముక్కలు చేసుకోవాలి. యాపిల్​పై తొక్క పీల్​ చేస్తే తినడానికి సౌకర్యంగా ఉంటుంది. రెండు గంటల తర్వాత కస్టర్డ్ మిశ్రమం పెరుగులా మారుతుంది. దీనిని నేరుగానే ఫ్రూట్స్​తో మిక్స్ చేసుకోవచ్చు. కానీ అది మరింత క్రీమ్​గా రావాలంటే.. దానిని మిక్సీలో వేసి.. క్రీమ్​గా వచ్చేవరకు బ్లెండ్ చేయాలి. ఇప్పుడు సర్వింగ్ చేసుకుని లాగించేయాలి. అయితే సర్వింగ్ చేసేప్పుడు ముందుగా గ్లాస్​లో ఓ కస్టర్డ్ మిక్స్ వేయాలి. అనంతరం దానిపై లేయర్​గా ఫ్రూట్స్ వేయాలి. మరికొంచెం కస్టర్డ్ వేసి.. డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. మళ్లీ కస్టర్డ్, ఫ్రూట్స్ ఇలా లేయర్స్​గా వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. 

రుచిని మరింత రెట్టుపు చేసుకోవాలంటే.. ఇలా రెడీ చేసుకున్న గ్లాస్​ను మరో గంట ఫ్రిడ్జ్​లో ఉంచి తింటే.. దాని రుచి మిమ్మల్ని కట్టిపడేస్తుంది. సమ్మర్​లో టేస్టీగా, కూల్​గా తినాలనుకుంటే ఇది మంచి ఆప్షన్ అవుతుంది. హెల్తీగా, ఇంటిల్లీపాది చక్కగా కూర్చోని దీనిని ఆస్వాదించవచ్చు. మధ్యాహ్నం తినాలనుకుంటే మార్నింగ్ దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా వేడి నుంచి ఉపశమనం కోసం ఈ టేస్టీ కస్టర్డ్​ను తినవచ్చు. మరి ఈ సమ్మర్​కి మీరు కూడా ఈ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్​ను చేసేసుకోండి. 

Also Read : బరువు తగ్గాలనుకుంటే రాత్రి ఏడు గంటలకు ముందే డిన్నర్ ఫినిష్ చేసేయాలట.. నిపుణులు ఏమంటున్నారంటే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

DIY Hair Pack : మందార పువ్వు, కొబ్బరి పాలుతో హెయిర్ ప్యాక్.. జుట్టు రాలడాన్ని తగ్గించి మెరుపును పెంచుతుందా?
మందార పువ్వు, కొబ్బరి పాలుతో హెయిర్ ప్యాక్.. జుట్టు రాలడాన్ని తగ్గించి మెరుపును పెంచుతుందా?
Sri Lankan Chilli Vada Recipe : శ్రీలంక స్పెషల్ మిర్చి వడ.. టేస్టీ, క్రంచీ స్నాక్ కోసం ఈ రెసిపీ ట్రై చేసేయండి
శ్రీలంక స్పెషల్ మిర్చి వడ.. టేస్టీ, క్రంచీ స్నాక్ కోసం ఈ రెసిపీ ట్రై చేసేయండి
Vaginal Health Tips : యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏమి చేయాలి? ప్రతి మహిళ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏమి చేయాలి? ప్రతి మహిళ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
Sweet Cravings During Weight Loss : బరువు తగ్గాలని షుగర్స్ మానేశారా? స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి
బరువు తగ్గాలని షుగర్స్ మానేశారా? స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget