సమ్మర్లో ఈ టీలు తాగితే వేడి తగ్గుతుందట కొన్నిరకాల పువ్వులతో చేసే టీలు మీకు మంచి రిఫ్రెష్‌ను ఇస్తాయి. అంతేకాకుండా సమ్మర్లో శరీరంలోని వేడిని తగ్గిస్తాయి అంటున్నారు నిపుణులు. సమ్మర్లో జాస్మిన్స్ విరివిగా దొరకుతాయి. వీటితో చేసే టీ ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచి.. శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. గులాబీ రేకులతో చేసుకుని టీ కూడా వేడిని తగ్గించి.. రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. లావెండర్ టీలోని లక్షణాలు సమ్మర్ హీట్‌ని దూరం చేస్తాయి. చామంతులతో చేసే టీ మూడ్‌ని లిఫ్ట్ చేయడమే కాకుండా వేడిని దూరం చేస్తుంది. మందార పువ్వులతో చేసిన టీ క్రాన్బెర్రీ టేస్ట్‌నిస్తుంది. ఇవి కేవలం అవగాహన మాత్రమే. వైద్యుల సలహా తర్వాత తీసుకుంటే మంచిది. (Images Source : envato)