Excessive Body Heat : బాడీలో హీట్ ఎక్కువైతే తినాల్సిన, తినకూడని ఫుడ్స్ లిస్ట్ ఇదే.. వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలంటే?
Body Heat : శరీరంలో హీట్ ఎక్కువైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ సమయంలో తినాల్సిన, తినకూడని ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- వేడికాలంలో శరీరంలో వేడి పెరిగితే దాహం, నీరసం వంటి సమస్యలు వస్తాయి.
- పుచ్చకాయ, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి శరీరాన్ని చల్లబరుస్తాయి.
- కారం, నూనె, జంక్ ఫుడ్ తగ్గించి, ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలి.
- అధిక జ్వరం, తీవ్ర తలనొప్పి వంటి తీవ్ర లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించండి.
Foods to Eat and Avoid for Excessive Body Heat : ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు.. శరీరంలో నీరు తగ్గినప్పుడు.. కొందరికి ఒంట్లో వేడి ఎక్కువ అవుతుంది. దీంతో ఎక్కువ దాహం వేయడం, నోరు పొడిబారడం, నీరసం, అధికంగా చెమట పట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొందరికి నోటి పుండ్లు, మలబద్ధకం లేదా కడుపులో మంట వంటి ఇబ్బందులు కూడా ఉండొచ్చు. ఇలాంటి సమయంలో ఆహారం, నీరు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త అవసరమని చెప్తున్నారు నిపుణులు. మరి ఈ సమయంలో తినాల్సిన ఫుడ్స్ ఏంటో.. తాగాల్సిన డ్రింక్స్ ఏంటో చూసేద్దాం.
నీరు ఎక్కువగా ఉండే ఫుడ్స్
శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. పుచ్చకాయ, కీరదోస, నారింజ, బత్తాయి వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో పాటు రోజంతా తగినంత నీరు తాగాలి.
Also Read : నైట్ హీట్ వేవ్ వల్ల డెత్ రేట్ పెరుగుతుందంట.. రాత్రుళ్లు పెరిగే ఉష్ణోగ్రతలతో జాగ్రత్త అంటోన్న నిపుణులు
మజ్జిగ
మజ్జిగను ఉప్పు, జీలకర్ర లేదా కొత్తిమీరతో తీసుకోవచ్చు. పెరుగు, మజ్జిగ వంటి ఆహారాలు చాలామందికి తేలికగా ఉంటాయి. పెరుగును అన్నంతో లేదా కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. అయితే ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత కడుపు ఉబ్బరం, విరేచనాలు లేదా ఇతర సమస్యలు వస్తే దాన్ని తగ్గించడం మంచిది.
కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లు ద్రవాలు, కొన్ని ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. ఎక్కువగా చెమట పట్టినప్పుడు లేదా వేడి వాతావరణంలో బయట తిరిగినప్పుడు ఇవి ఉపయోగపడవచ్చు. డయాబెటిస్ లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు లిమిటెడ్‌గా తీసుకోవడం మంచిది.
పండ్లు, కూరగాయలు
పండ్లు, కూరగాయల్లో నీరు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కీరదోస, టమాటా, సొరకాయ వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు. పండ్లను జ్యూస్‌గా చేసుకోవడం కంటే నేరుగా తినడం మంచిది.
Also Read : 40 డిగ్రీల ఎండలో ఉంటే గంట గంటకు శరీరంలో ఏమి జరుగుతుంది? హీట్ స్ట్రోక్ లక్షణాలు, జాగ్రత్తలు
ఏ ఫుడ్స్ తినకూడదంటే..
బాడీలో వేడిగా ఉన్నప్పుడు కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించడం మంచిది. ఇవి కొంతమందిలో కడుపులో మంట, యాసిడ్ రిఫ్లక్స్ లేదా అసౌకర్యాన్ని పెంచవచ్చు. అధికంగా వేయించిన ఫుడ్స్, జంక్ ఫుడ్, ఎక్కువ ఉప్పు లేదా చక్కెర ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను తగ్గించండి. టీ, కాఫీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ తక్కువగా తీసుకుంటే మంచిది. ఆల్కహాల్ శరీరంలో డీహైడ్రేషన్ మరింత పెంచుతుంది కాబట్టి దానికి దూరంగా ఉండాలి.
ORS తీసుకోవచ్చా?
ఎక్కువగా చెమట పట్టడం, వాంతులు లేదా విరేచనాల కారణంగా శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్లు తగ్గితే కేవలం నీరు సరిపోకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో వైద్యుల సూచనతో ORS తీసుకోవచ్చు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
బాడీ హీట్ అని భావించి ప్రతిసారీ ఆహారంతోనే సమస్యను పరిష్కరించుకోవడం మంచిది కాదు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, నిరంతర వాంతులు, తీవ్రమైన నీరసం ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
Also Read : మీ శరీరం(Body) ఓవర్ హీట్ అవుతోందని చెప్పే సంకేతాలు ఇవే.. హీట్ స్ట్రోక్ విస్మరిస్తే ప్రాణాంతకమే
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























