Heart Attack in Young Women : 30-40 ఏళ్ల మహిళల్లో గుండెపోటు? సడెన్ హార్ట్ అటాక్‌కు SCAD కూడా కారణమే.. లక్షణాలు ఇవే
SCAD in Young Women : యువతుల్లో గుండెపోటు కొలెస్ట్రాల్, మధుమేహం లేకపోయినా వస్తుందట. Spontaneous Coronary Artery Dissection వల్ల గుండె రక్తప్రసరణకు ఆటంకం కలిగి హార్ట్ ఎటాక్ రావచ్చు.

- స్పాంటేనియస్ కరోనరీ డిసెక్షన్ గుండె ధమని చీలికకు కారణం.
- యువతులు, మధ్య వయస్సు మహిళల్లో SCAD అధికం, హార్మోన్ల ప్రభావం.
- అధిక శ్రమ, ఒత్తిడి, హార్మోన్లు SCAD ప్రమాద కారకాలు.
- SCAD చికిత్స వ్యక్తిగతం; అవసరమైతే బెలూన్ యాంజియోప్లాస్టీ చేస్తారు.
SCAD in Women Causes and Symptoms : గుండెపోటుకు వృద్ధాప్యం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, అధిక రక్తపోటు లేదా ధూమపానం వంటి అంశాలు తరచుగా ప్రధాన కారణమవుతాయి. అయితే గుండె జబ్బుల పరిస్థితికి ఎప్పుడూ ఇవే కారణం కాకపోవచ్చు. గుండెపోటుకు సాధారణ ప్రమాద కారకాలు లేకపోయినా.. ఆరోగ్యంగా కనిపించే మహిళల్లో ఆకస్మిక గుండెపోటు రావచ్చని చెప్తున్నారు నిపుణులు. దీనికి స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ కారణం కావచ్చు అంటున్నారు.
స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటే..
స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ (SCAD) అనేది గుండెపోటుకు భిన్నమైన, అంతగా గుర్తించలేని ఒక కారణం. ఇందులో గుండె ధమని లోపలి గోడకు ఆకస్మికంగా గాయం కావడం లేదా అది చిట్లడం జరుగుతుంది. దీనివల్ల ధమని గోడ పొరల మధ్య రక్తం పేరుకుపోయి, గుండెకు రక్త ప్రసరణకు ఆటంకం కలగవచ్చు.
Also Read : అయోర్టిక్ డిసెక్షన్ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఇది గుండెపోటు కంటే ప్రమాదమా?
గుండెపోటు కంటే ఇది ఎందుకు భిన్నం?
సాధారణ గుండెపోటులో.. గుండె రక్తనాళంలో కొలెస్ట్రాల్ పొర తరచుగా చిట్లిపోతుంది లేదా దెబ్బతింటుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టి రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. SCADలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఈ సందర్భంలో రక్తనాళం గోడ అకస్మాత్తుగా విడిపోవడం మొదలవుతుంది. లోపల పేరుకుపోయిన రక్తం మార్గాన్ని మూసుకుపోయేలా చేస్తుంది.
కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ కాదు..
మేయో క్లినిక్‌లో మూసుకుపోయిన గుండె సిరలకు చికిత్స చేయడంలో నిపుణుడైన డాక్టర్ రాజీవ్ గులాటి ప్రకారం.. SCADలో సిర దెబ్బతినడానికి కారణం దీర్ఘకాలంగా పేరుకుపోయిన కొవ్వు కాదు.. సిర గోడలో ఆకస్మిక మార్పు రావడమే.
Also Read : ఛాతీలో చీల్చేసినట్టు నొప్పి వస్తుందా? ఇది హార్ట్ ఎటాక్ కాదు.. కానీ చాలా ప్రమాదమంటోన్న వైద్యులు
యువతులలో SCAD ఎందుకు ఎక్కువ?
SCAD కేసులు ఎక్కువగా యువతులు, మధ్య వయస్కులైన మహిళల్లో కనిపిస్తాయి. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కార్డియాలజిస్ట్, ప్రొఫెసర్‌గా చేస్తోన్న డాక్టర్ అంబుజ్ రాయ్.. దాదాపు 80 నుంచి 90 శాతం SCAD కేసులు మహిళల్లోనే ఎక్కువగా సంభవిస్తాయని తెలిపారు. 50 ఏళ్లలోపు మహిళల్లో వచ్చే కొన్ని గుండెపోటులకు SCAD ఒక కారణం కావచ్చట. ఈ వ్యాధికి, శరీరంలోని హార్మోన్ల మార్పులకు సంబంధం ఉందని పరిశోధనలు చెప్తున్నాయి.
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ శరీరంలోని రక్తనాళ కణజాలం, నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ హార్మోన్లు నేరుగా SCADకు కారణమవుతాయని నమ్మనప్పటికీ.. వాటి స్థాయిలలో మార్పులు కొంతమంది మహిళల్లో రక్తనాళాల గోడలను బలహీనపరుస్తాయి. అందుకే ప్రసవానంతర కాలాన్ని కూడా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. డాక్టర్ గులాటి ప్రకారం.. కొన్ని SCAD కేసులు ప్రసవం తర్వాత కనిపిస్తాయి. చాలా వరకు డెలివరీ అయిన తొలి రోజుల్లోనే సంభవిస్తాయి.
Also Read : గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?
ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే..
మహిళలు యవ్వనంలో చురుకుగా ఉండవచ్చు. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా ధూమపానం వంటివి ఉండకపోవచ్చు. అందుకే ఛాతీ నొప్పిని త్వరగా గుర్తించకపోవడం జరుగుతుంది. డాక్టర్ రాయ్ ప్రకారం.. SCAD రోగులలో ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం ఒక సాధారణ లక్షణం మాత్రమే. ECG మార్పులు, రక్త పరీక్షలు కూడా గుండె సంబంధిత సంకేతాలను వెల్లడిస్తాయి.
ఒత్తిడి, అధిక పనిభారం
SCADకు ఒకే ఒక్క కారణం లేదు. తీవ్రమైన శారీరక శ్రమ, బరువైన వస్తువులను ఎత్తడం, అధిక మానసిక ఒత్తిడి, గర్భం, హార్మోన్ల మార్పులు వంటి కారణాలను పరిశోధనలు గుర్తించాయి. కొంతమంది రోగులు గతంలో శారీరక లేదా మానసిక ఒత్తిడికి గురైనట్లు కూడా తెలిపారు. అంతేకాకుండా ఫైబ్రోమస్కులర్ డిస్ప్లేసియా (FMD) వంటి నరాల వ్యాధులకు కూడా SCADతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి కొవ్వు నిల్వలు లేకుండానే నరాల నిర్మాణంలో మార్పులకు తీసుకువస్తుంది.
Also Read :గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎన్ని అడుగులు వేయాలి? 6,000 లేదా 10,000? వైద్యుల సూచనలు ఇవే
SCAD చికిత్స
SCAD చికిత్స ప్రతి రోగికి ఒకేలా ఉండదు. సిర పూర్తిగా మూసుకుపోయి, గుండెకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించాల్సి వస్తే.. బెలూన్ సహాయక యాంజియోప్లాస్టీ అవసరం కావచ్చు. కొన్ని సందర్భాల్లో వైద్యులు స్టెంట్ వేయరు. ఎందుకంటే ఇది సిర లోపల మరింత నష్టం కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఒకవేళ సిర పూర్తిగా మూసుకుపోకపోతే.. ప్రభావితమైన సిర కాలక్రమేణా దానంతట అదే నయం కాగలదు కాబట్టి, వైద్యులు తరచుగా రోగిని ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచుతారు. రోగి పరిస్థితిని బట్టి మందులు కూడా సూచిస్తారు.
Also Read : జిమ్‌లలో పెరుగుతోన్న యువకుల ఆకస్మిక మరణాలు.. నిజాన్ని వెలుగులోకి తెచ్చిన ICMR నివేదిక
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























