By: Haritha | Updated at : 03 May 2023 10:28 AM (IST)
(Image credit: Pixabay)
టైప్1 డయాబెటిస్ అంటే పుట్టుకతోనే వచ్చేది. చిన్నపిల్లల్లోనే ఇది వస్తుంది. వారసత్వంగా వచ్చే డయాబెటిస్ ఇది. ఇక టైప్2 డయాబెటిస్ పెద్దయ్యాక అనారోగ్యక జీవన శైలి కారణంగా వస్తుంది. ఈ రెండూ కాకుండా మూడో రకం డయాబెటిస్ కూడా ఉంది. అదే LADA. దీన్ని ‘ది లాటెంట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్’ అని కూడా పిలుస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది టైప్ 1.5 డయాబెటిస్. టైప్1 డయాబెటిస్‌లో ఇదొక వేరియంట్.
LADA పెద్దలకు మాత్రమే వస్తుంది. పిల్లల్లో కనిపించదు. చాలా నెమ్మదిగా శరీరంలో చేరి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మీ ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయడాన్ని ఆపివేసిన తర్వాత, ఈ టైప్ 1.5 డయాబెటిస్ ప్రారంభమవుతుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ డయాబెటిస్ లో రోగనిర్ధారణ జరిగిన తర్వాత చాలా సంవత్సరాల వరకు ఇన్సులిన్ అవసరం ఉండదు. ప్రస్తుతం ప్రపంచంలో మధుమేహంతో బాధపడుతున్న వారిలో పది శాతం మంది ఈ టైప్ 1.5 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నట్టు అంచనా. కానీ వారిలో సగం మందికి ఆ విషయం కూడా తెలియదు. తమకు వచ్చింది టైప్2 డయాబెటిస్ అనుకుంటారు.
LADA సాధారణంగా 30 ఏళ్ల వయసు దాటిన వారిలోనే అభివృద్ధి చెందుతుంది. దాన్ని చాలా మంది టైప్2 డయాబెటిస్ అనుకుని, వాటి మందులే వాడుతూ ఉంటారు. అయితే కొన్ని తేలికపాటి మందులు ఈ రోగాన్ని నిర్వహించడంలో కొన్ని సంవత్సరాల పాటు ప్రభావవంతంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు నమ్ముతున్నారు. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా క్షీణిస్తుందో, అప్పుడు ఆ మందులు LADA కోసం పనిచేయడం మానేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైపోతాయి.
లక్షణాలు ఎలా ఉంటాయంటే
టైప్1, టైప్2 డయాబెటిస్‌లో కనిపించే లక్షణాలే ఈ LADAలో కూడా కనిపిస్తాయి. తొలిసారిగా కొన్ని ప్రారంభ లక్షణాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించాలి.
1. మెదడు ముద్దు బారినట్టు అవుతుంది.
2. ఏకాగ్రత చూపించలేరు.
3. చర్మం పొడిగా మారి, దురద పెడుతుంది.
4. అలసటగా, నీరసంగా అనిపిస్తుంది.
5. ఎప్పుడూ ఆకలి వేస్తుంది.
6. తరచుగా దాహం వేస్తుంది.
7. మూత్ర విసర్జన పెరుగుతుంది.
8. దృష్టి మసకబారుతుంది
సకాలంలో ఈ టైప్ 1.5 డయాబెటిస్ ను గుర్తించి చికిత్స చేయాలి. లేకపోతే అది డయాబెటిక్ కీటోయాసిడోసిస్ వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధిలో ఇన్సులిన్ లేక శరీరం చక్కెరను ఉపయోగించుకోలేక పోతుంది. దీనివల్ల కొవ్వును కరిగించడం మొదలు పెడుతుంది. ఆ కొవ్వు విషపూరితంగా మారిపోవచ్చు. ఇది శరీరానికి చాలా ప్రమాదకరం.
LADA రావడానికి కారణాలు
ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే కణాలకు వ్యతిరేకంగా శరీరంలోని యాంటీ బాడీలు పనిచేస్తాయి. అందుకే దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని కూడా అంటారు. దీనివల్ల ప్యాంక్రియాస్‌కు నష్టం జరుగుతుంది. అలా జరగడం వల్ల టైప్ 1.5 మధుమేహం వస్తుంది అని వివరిస్తున్నారు వైద్యులు. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఊబకాయం వల్ల కూడా రావచ్చు.
Also read: ఇండోర్ వీధుల్లో నోరూరించే బంగారు కుల్ఫీ, ధర తక్కువే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్
High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!
Ghosts: మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూశారా? అవి కొందరికే ఎందుకు కనిపిస్తాయి?
Minister Jagadish Reddy: "కాళేశ్వరం జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేశారు సీఎం కేసీఆర్"
ఆ ‘ఐ డ్రాప్స్’తో పిల్లల్లోని దృష్టి లోపాన్ని నివారించవచ్చట - తాజా పరిశోధనలో వెల్లడి
Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!