అన్వేషించండి

Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ

RC16 Shoot Started: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ ఈ రోజు మొదలు అయ్యింది. ప్రస్తుతం దర్శకుడు సానా బుచ్చిబాబు కర్ణాటకలో ఉన్నారు. ఇంకా మరిన్ని వివరాల్లోకి వెళితే...

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan )కథానాయకుడిగా రూపొందుతున్న కొత్త సినిమా ఈ రోజు సెట్స్ మీదకు వెళ్ళింది. దర్శకుడుగా పరిచయం అయిన 'ఉప్పెన' సినిమాతో 100 కోట్ల క్లబ్బులో చేరిన బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ నేడు ప్రారంభించారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అది ఏమిటంటే...

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో...
రామ్ చరణ్ 16వ చిత్రమిది (RC16 Movie). దీనికి 'పెద్ది' టైటిల్ ఖరారు చేశారు. ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.‌ హీరో 16వ సినిమా కనుక RC16 అని వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఉదయం మైసూరులోని శ్రీ చాముండేశ్వరి మాత దేవాలయానికి బుచ్చి బాబు వెళ్లారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ మైసూరులో లేరు.

మండే నుంచి మైసూరులో రామ్ చరణ్...ప్రస్తుతం రామ్ చరణ్ హైదరాబాద్ సిటీలోనే ఉన్నారని తెలిసింది. ఈ ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ఆయన మైసూరు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మండే నుంచి రామ్ చరణ్ మీద సన్నివేశాలు తెరకెక్కించడానికి బుచ్చి బాబు సన్నాహాలు చేస్తున్నారు. అప్పటి వరకు ఇతర ప్రధాన తారాగణం మీద కీలకమైన సన్నివేశాలు తీయడానికి రెడీ అయ్యారు.

Also Read: 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?

ఉత్తరాంధ్ర నేపథ్యంలోని కథతో సినిమా రూపొందుతోంది. రామ్ చరణ్ వంటి స్టార్ హీరోను ఉత్తరాంధ్రకు తీసుకు వెళ్లి చిత్రీకరణ చేయడం కష్టం. దానికి తోడు కథ అనుగుణంగా కొన్ని సన్నివేశాలు వేరు వేరు ప్రదేశాలలో చిత్రీకరించాల్సి ఉంది. సో... ఇప్పుడు ఆ సీన్లు తీస్తున్నారు. 

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్!
RC16 movie actress: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు రెండో చిత్రమిది. దీనికి ముందు ఎన్టీఆర్ 'దేవర'లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 'రంగస్థలం' తర్వాత మరోసారి రామ్ చరణ్ చిత్రానికి రత్న వేలు ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Also Readక్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే


'గేమ్ చేంజర్' కోసం మధ్యలో కొంత గ్యాప్
సంక్రాంతికి రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' విడుదల కానున్న సంగతి తెలిసిందే.‌ జనవరి 10న ఆ సినిమా థియేటర్లలోకి రానుంది. ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం మధ్యలో బుచ్చిబాబు సినిమా చిత్రీకరణకు చరణ్ కొంత గ్యాప్ ఇవ్వనన్నారు. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget