News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Korrala Idli: కొర్రలతో ఇడ్లీ ఇలా చేశారంటే ఎంతో ఆరోగ్యం, పిల్లలు కూడా తినేస్తారు

ఎప్పుడూ ఒకే రకమైన ఇడ్లీ చేస్తే బోర్ కొట్టేస్తుంది, ఈసారి కొర్రలతో ప్రయత్నించండి.

FOLLOW US: 
Share:

చిరుధాన్యాల్లో కొర్రలు ముఖ్యమైనవి. వీటిని తినమని వైద్యులు కూడా సిఫారసు చేస్తారు. కానీ వీటి రుచి తెల్లని అన్నంతో పోలిస్తే వీటి రుచి అంత టేస్టీగా ఉండదు తెల్ల అన్నంలో సహజంగానే చక్కెర ఉంటుంది అందుకోసమే ఆ అన్నానికి కాస్త రుచి వస్తుంది కొర్రల్లో ఎలాంటి సహజ సంఖ్యలో ఉండవు అందుకే అవి చెప్పగా ఉంటాయి. చిరుధాన్యాలను తినే వారి సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. కొర్రలతో కేవలం అన్నం మాత్రమే వండుకోగలమనుకోకండి. దీంతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. టేస్టీగా ఇడ్లీ ఒకసారి ప్రయత్నించండి. డయాబెటిస్ రోగులకు కొర్రలతో చేసిన ఇడ్లీలు తినడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. హైబీపీ ఉన్నవారు కూడా కొర్రలతో చేసిన ఇడ్లీలు తింటే బీపీ అదుపులో ఉంటుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. కొర్రల వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
కొర్రలు - మూడు కప్పులు 
మినప్పప్పు - ఒక కప్పు 
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక స్పూన్

తయారీ ఇలా...
కొర్రలను మిక్సీలో వేసి రవ్వలా మార్చుకోండి. ఆ రవ్వను మూడు గంటల పాటు నీటిలో నానబెట్టండి. అలాగే మినప్పప్పును కూడా మూడు గంటల పాటు నానబెట్టండి. ఆ తరువాత మిక్సీలో వేసి మినప్పప్పును, కొర్రలను కలిపి పిండిలా రుబ్బుకోవాలి. ఆ పిండిని ఒక గిన్నెలో తీసి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఆరేడు గంటల పాటు అలా వదిలేయండి. ఆ తర్వాత ఇడ్లీ రేకులకు నూనె రాసి ఈ పిండిని ఇడ్లీల రేకులు వేసుకోండి. అరగంట తర్వాత వేడి వేడి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. కొబ్బరి చట్నీ, టమోటో చట్నీ, పల్లి చట్నీ... ఏ చట్నీ తో తిన్నా కొర్రలు ఇడ్లీలు ఎంతో రుచిగా ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఇందులో వెజిటబుల్స్‌ని కూడా కలుపుకోవచ్చు. పిండిలో క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము ఇలాంటివి కలిపి కూడా కొర్రలు ఇడ్లీని టేస్టీగా చేసుకోవచ్చు.

కొర్రలు రోజూ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మహిళలు, పిల్లలు కొర్రలతో చేసిన ఆహారాన్ని తింటే రక్తహీనత సమస్య దూరమైపోతుంది. నిజానికి రక్తహీనత అనేది మహిళలు, పిల్లల్లోనే అధికంగా కనిపిస్తుంది. అలాగే కీళ్లవాతం ఉన్నవారు కూడా కొర్రలతో చేసిన ఆహారాన్ని తినాలి. కాలిన గాయాలు అయినప్పుడు కొర్రల ఆహారాన్ని తినడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, క్యాల్షియం, ఫైబర్, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొర్రలు తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల ఎక్కువసేపు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. తద్వారా బరువు తగ్గవచ్చు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు కొర్రలను కచ్చితంగా తినాలి. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో కొర్రలు ముందుంటాయి. ఇవి మన శరీరానికి బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తిని ఇస్తాయి. కాబట్టి ఆహారంలో కొర్రలను భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Also read: నిద్రలోనే కార్టియాక్ అరెస్టు, ఇలా ప్రజలు నిద్రలోనే ఎందుకు చనిపోతారు?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Published at : 10 Aug 2023 11:05 AM (IST) Tags: Korrala Idli Recipes Korrala Idli Korrala Recipe Korrala Health benefits

ఇవి కూడా చూడండి

World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!

World Heart Day 2023: ఈ ఐదు విషయాలు బాగున్నాయంటే మీ గుండె పదిలంగా ఉన్నట్టే లెక్క!

Salt: మూడు రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమమైందో తెలుసా?

Salt: మూడు రకాల ఉప్పుల్లో ఏది ఆరోగ్యానికి ఉత్తమమైందో తెలుసా?

Dengue: డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాస్పిటల్‌లో ఎప్పుడు చేరాలి?

Dengue: డెంగ్యూ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాస్పిటల్‌లో ఎప్పుడు చేరాలి?

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?