Oil Adulteration: మీరు వాడుతున్న నూనె కల్తీదో, మంచిదో ఇలా తెలుసుకోండి
కల్తీ నూనెలను ఇంట్లోనే పరీక్షించి తెలుసుకోవచ్చు.
Oil Adulteration:ఆహార పదార్థాలను కల్తీ చేయడం అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇదే ప్రధాన సమస్యగా మారింది. కల్తీ కంటికి కనిపించదు. దీనివల్ల ఆహారాన్ని తింటే దీర్ఘకాలంలో అనేక రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కల్తీ ఆహారం ఆరోగ్యం పై ప్రధాన అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. అందుకే మనం వాడే ఆహారం కల్తీదో కాదో తెలుసుకుంటూ ఉండాలి. దీనికోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహారాల్లోని కల్తీని ఎలా తెలుసుకోవాలో చెబుతోంది.
నూనె కల్తీని కూడా చిన్న పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. కల్తీ అయిన నూనె రంగు, వాసన, రుచి భిన్నంగా ఉంటాయి. అయితే వాటిని కనిపెట్టడం మాత్రం కష్టమే. కొన్ని అస్పష్టమైన లక్షణాలనే ఇవి కలిగి ఉంటాయి. అయితే చిన్న పరీక్ష ద్వారా కల్తీ నూనెను కనిపెట్టవచ్చు. ఒక టెస్ట్ ట్యూబ్‌లో ఒక మిల్లీలీటరు ఆయిల్‌ను వేయండి. దానిలో నాలుగు మిల్లీలీటర్ల డిజిటల్ వాటర్ కలపండి. టెస్ట్ ట్యూబ్‌ని బాగా కదిలించండి. దానికి రెండు మిల్లీలీటర్ల గాఢమైన HCL ను జోడించండి. కల్తీ లేని నూనె పై పొర పై ఎలాంటి రంగు మార్పు కనిపించదు. కల్తీ అయినదైతే నూనె పై పొరలో ఎరుపు రంగు వస్తుంది.
మంచి రంగులో కనిపించేందుకు కల్తీదారులు మెటానిల్ పసుపు రంగు వాడతారు. ఇది అనుమతి లేని ఆహార రంగు. మనుషులు వినియోగించకూడదు. అయితే నూనెలు మంచి రంగు కనిపించేందుకు ఈ పసుపును కలిపి అమ్ముతారు. అలాగే నూనెలో కలిపే మరో కల్తీ పదార్థం ట్రై ఆర్తో క్రిస్టల్ ఫాస్పేట్. ఇది విషపూరితమైనది. నూనెలో ఈ సమ్మేళనాన్ని గుర్తించాలంటే రెండు స్పూన్ల నూనెను ఒక గిన్నెలో వేయండి. దానిలో చెంచా పసుపు జోడించండి. నూనె రంగు మారకపోతే అది స్వచ్ఛమైనదని అర్థం. ఎరుపు రంగులోకి మారితే ఆ నూనె కల్తీదని అర్థం చేసుకోవాలి.
కల్తీ నూనెల ధరలు తక్కువ ఉంటాయి. అందుకే హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బజ్జీల కొట్లు వారు ఇలా కల్తీ నూనెనె కొంటారు. దీని వల్ల వాటిని తిన్నవారి ఆరోగ్యాలు పాడవ్వడం ఖాయం. కల్తీ నూనె అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
Is your oil adulterated with prohibited colour like metanil yellow.#Combatadulteration_1#EatRightIndia #foodsafety#AzadiKaAmritMahotsav@MoHFW_INDIA pic.twitter.com/2qKU5SDu74
— FSSAI (@fssaiindia) July 10, 2023">
Also read: పెళ్లయిన దగ్గర నుంచి దూరం పెడుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు