Kidney Stone Prevention : కిడ్నీల్లో రాళ్లను తగ్గించడానికి హెల్ప్ చేసే ఫుడ్స్ లిస్ట్.. అస్సలు తినకూడని ఆహారాలు
Diet for Kidney Health : కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ రెగ్యులర్‌గా తీసుకోవాలని.. కొన్ని ఆహారాలు అస్సలు తినకూడదని చెప్తున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో చూసేద్దాం.

Foods to Reduce Kidney Stones : కిడ్నీల్లో రాళ్లు ఉంటే ఆరోగ్య పరిస్థితి చాలా దిగజారిపోతుంది. ఆ సమయంలో సమస్యను తగ్గించుకోవడానికి డైట్ బాగా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. కొన్ని ఫుడ్స్ డైట్లో చేర్చుకోవడంతో పాటు.. మరికొన్ని ఫుడ్స్‌ని అవాయిడ్ చేయమంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? వేటిని తింటే కిడ్నీల్లో రాళ్లు తగ్గుతాయి.. వేటిని తింటే ఇబ్బందులు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీల్లో రాళ్లు ఉంటే తినాల్సిన ఫుడ్స్ ఇవే
పుచ్చకాయ : పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే పొటాషియం కూడా ఉంటుంది. ఇది బీపీని తగ్గించి కిడ్నీలపై ఒత్తిడి పెరగకుండా కిడ్నీల్లో రాళ్లు బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది.
ఫ్రూట్స్ : సిట్రస్తో నిండిన ఫ్రూట్స్ కిడ్నీల్లోని రాళ్లు ఏర్పడకుండా.. వాటికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. వీటిలో సిట్రెట్ ఉంటుంది కాబట్టి సమస్య త్వరగా తగ్గే అవకాశముంది.
కీరదోస : కీరదోసలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఆక్సలేట్ లెవెల్స్‌ను తగ్గించి.. సమస్యను దూరం చేస్తాయి.
కాల్షియం : కాల్షియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు అనుకుంటారు కానీ.. ఆక్సలేట్ ఎక్కువగా ఉన్నప్పుడు కాల్షియం తీసుకుంటే లెవెల్ అవుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా హెల్ప్ చేస్తుంది. అయితే దీనిని తినాలంటే వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.
యాపిల్స్ : యాపిల్స్ తింటే కిడ్నీల్లో రాళ్లు దూరం అవుతాయట. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సలేట్‌ను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయట. తక్కువ కేలరీలతో ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది.
అరటిపండు : అరటిపండు కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీల్లో రాళ్లు తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఎక్కువగా తినకపోవడమే మంచిది.
ఇవే కాకుండా నీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరంలోని టాక్సిన్లు బయటకు ఫ్లష్ చేస్తుంది. బ్రకోలీ, తృణధాన్యాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. మరి కిడ్నీల్లో రాళ్లు ఉంటే తినకూడని ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
వీటిని తినకపోవడమే మంచిది..
చాక్లెట్ : చాక్లెట్స్‌లో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తింటే షుగర్స్, ఆక్సలేట్స్ శరీరంలో ఎక్కువై వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు కిడ్నీల్లో రాళ్ల సమస్యను కూడా పెంచుతాయి.
రెడ్ మీట్ : రెడ్ మీట్ కిడ్నీల్లో రాళ్లను ఎక్కువ చేస్తుంది కాబట్టి మీ డైట్లో అది తీసుకోకపోవడమే మంచిది. క్రేవింగ్ ఉంటే కూడా లిమిటెడ్‌గా తీసుకోవాల్సి ఉంటుంది.
సోడియం : సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్స్, ఉప్పు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. సోడియం తక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది.
వీటితో పాటు ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ జోలికి వెళ్లకూడదు. నట్స్ ఆరోగ్యానికి మంచిదే అయినా సరే కొన్ని సందర్భాల్లో ఇవి కిడ్నీల్లో రాళ్లను ట్రిగర్ చేస్తాయి. కాబట్టి వాటిని కొన్నాళ్లు అవాయిడ్ చేయడమే మంచిది. సోడాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా సమస్యను తీవ్రం చేస్తాయి. బీట్రూట్, పాలకూర, సోయా ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయడమే మంచిది. వైద్యుల సూచనలతో పాటు డైట్లో ఈ మార్పులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.






















