అన్వేషించండి

Breast Milk Donation : బ్రెస్ట్ మిల్క్ దానం చేయాలంటోన్న బ్యాడ్మింటన్ స్టార్.. 30 లీటర్ల తల్లిపాలు ఇచ్చిందట, ఎందుకంటే

Breast Milk : బ్రెస్ట్ మిల్క్​పై అవగాహన కల్పిస్తున్నారు జ్వాలా గుత్తా . ఇప్పటివరకు ఆమె 30 లీటర్ల తల్లిపాలు దానం చేసిందట ఈ బ్యాడ్మింటన్ భామ. ఎందుకో తెలుసా?

Breast Milk Donation Awarness : తల్లి పాల ప్రాధన్యతను తెలుపుతూ.. బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా (Jwala Gutta) బ్రెస్ట్ మిల్క్​ని దానం చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు జత చేసి సోషల్ మీడియాలో ఎప్పటినుంచో అవగాహన కల్పిస్తుంది. ఏప్రిల్​లో రెండో బిడ్డకు జన్మనిచ్చిన జ్వాలా గుత్తా అప్పటి నుంచి బ్రెస్ట్​ మిల్క్ క్యాంపైన్​లో పాల్గొంటుంది. ఆగస్టులో దానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి.. బ్రెస్ట్ మిల్క్ ప్రాముఖ్యతను తెలిపింది. ఇప్పటివరకు ఆమె ప్రభుత్వ ఆస్పత్రికి 30 లీటర్ల తల్లిపాలు దానం చేసినట్లు నివేదికలు చెప్తున్నాయి. 

తల్లిపాలు సరిగా ఎదగని పిల్లలకు మేలు చేస్తాయని.. పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయని.. అందరూ వీటిని డొనేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. అసలు తల్లిపాలు ప్రాధన్యత ఏంటి? వాటిని ఎలా ప్రిజర్వ్ చేస్తారు? వాటివల్ల కలిగే లాభాలు ఏంటి? బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేసేప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి వంటి విషయాలు చూసేద్దాం. 

తల్లిపాలు దానం ఎందుకు అవసరం?

తల్లిపాలు శిశువులకు అమృతం లాంటివి. వీటిలో ఉండే పోషకాలు, యాంటీబాడీలు శిశువుల ఆరోగ్యం కోసం అవసరమైన రక్షణను అందిస్తాయి. కానీ ప్రతి తల్లీ తన బిడ్డకు తల్లిపాలు ఇవ్వలేరు. ప్రసవానంతరం పాలు రాకపోవడం, ఆరోగ్య సమస్యలు, లేదా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో శిశువులు తల్లిపాలను పొందకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో తల్లిపాలు దానం (Breast Milk Donation) చేయడం ఒక వరంగా నిలుస్తుంది.

తల్లిపాలతో కలిగే ప్రయోజనాలు ఇవే

ప్రీమేచ్యూర్ పిల్లల(PreMature Babies)కు అంటే ముందుగానే పుట్టిన శిశువుల్లో ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉంటుంది. తల్లిపాలు తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గి, వారిలో వృద్ధి వేగంగా జరుగుతుంది. అలాగే ఫార్ములా పాలు కంటే తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయి. తల్లిపాలలో ఉండే యాంటీబాడీలు, పోషకాలు పిల్లల్లో (Baby's Immunity)ని బలపరుస్తాయి. తల్లిపాలలో ఉండే DHA, ప్రోటీన్లు.. శిశువు మెదడు, శరీర అభివృద్ధికి ఉపయోగపడతాయి.

తల్లిపాలు ఎలా దానం చేయవచ్చంటే..

తల్లిపాలు దానం ఇవ్వాలనుకుంటే ముందుగా హ్యూమన్ మిల్క్ బ్యాంక్ లేదా ఆసుపత్రిలో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత హెల్త్ స్క్రీనింగ్ చేస్తారు. HIV, హెపటైటిస్ వంటి టెస్టులు చేసి ఏవి లేవు అనుకుంటే మీరు దానం చేయగలుగుతారు. తల్లులు హైజీనిక్‌గా పాలు స్టెరైల్ కంటైనర్‌లో భద్రపరుస్తారు. ఇలా సేకరించిన పాలను హీట్ ట్రీట్‌మెంట్ చేసి హానికరమైన బాక్టీరియా తొలగించి డీప్ ఫ్రీజర్​లో భద్రపరిచి అవసరమైన పిల్లలకు అందిస్తారు. 

తల్లిపాలు అందని శిశువులకు దాతల పాలు మేలు చేస్తాయి. శిశువు బతికే అవకాశాలను పెంచుతుంది. కాబట్టి తల్లిపాలు దానం చేయడం అంటే కేవలం పాలు ఇవ్వడం మాత్రమే కాదు.. ఒక ప్రాణానికి ఆశ ఇవ్వడమని గుర్తించి.. అర్హత ఉన్నవారు దీనిలో పాల్గొనాలి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget