ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీ మెదడు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటుందట!
నిజంగానే young by heart ఉండాలని అనుకునే వారు తప్పకుండా ఈ మూడు చిట్కాలను ప్రాక్టీస్ చెయ్యాలి.

Age is just a number అని, I am young by heart అని అనేవారిని తరచుగా చూస్తుంటాము. అయితే నిజంగానే చిన్నచిన్నజాగ్రత్తలతో వృద్ధాప్య ఛాయలు మెదడు మీద పడకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర లేచిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారం పూర్తిగా మానెయ్యడం, ప్రతి రోజూ కొద్దిసేపు ధ్యానం చెయ్యడం వల్ల మెదడును మరింత చురుకుగా ఉంచుకోవడం సాధ్యపడుతుందని అమెరికాకు చెందిన న్యూరో సైంటిస్ట్ ఎమిలీ మెక్డోనాల్డ్ కొన్ని చిట్కాలు ప్రతిపాదించారు. వీటిని పాటించడం ద్వారా వయసు పైబడడం వల్ల వచ్చే మతిమరుపుకు దూరంగా ఉండొచ్చు అని చెబుతున్నారు.
పొద్దున్న నిద్ర లేవగానే ముందుగా మొబైల్ చూడడం అంత మంచి అలవాటు కాదని, నిద్ర మేల్కొవడానికి మెబైల్ చూడడానికి మధ్య కనీసం 20 నిమిషాల వ్యవధి ఉండాలనేది ఆమె సలహా. నిద్ర , మేల్కొనడం మధ్య మెదడు పరివర్తన చెందే సమయం ఇవ్వాలి లేదంటే నిద్రలో ఉండే డోపమైన్ ప్రభావం వల్ల ఒక రకమైన కన్ఫ్యూజన్ తో పోరాడాల్సిన పరిస్థితి మెదడుకు ఏర్పడుతుంది. ప్రతి వారికి ఉదయం నిద్ర లేవగానే చాలా మంది చేసే పని ఫోన్ చూడడమే. అయితే ఈ ఒక్క చర్య మెదడు సామర్థ్యాన్ని చాలా తగ్గిస్తోందని ఎమిలీ చెబుతున్నారు. నిద్ర లేచిన తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు ఫోన్ వైపు చూడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనేది ఆమె అభిప్రాయం.
చీజ్ స్లైసెస్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం కాగ్నిటివ్ ఏజింగ్ మీద ప్రభావం చూపిస్తోందట. గట్ కి బ్రెయిన్ కి మధ్య కనెక్షన్ చాలా బలమైందని, అవకాడో వంటి మంచి కొవ్వులు, హోల్ ఫూడ్ వెరైటిస్, బ్లూబెర్రీల వంటి పండ్లు మెదడుకు మంచివనీ నిపుణులు సూచిస్తున్నారు. ప్రాసెస్డ్ ఫూడ్ మానేస్తే మెదడు చురుకుగా ఉంటుందనేది వీరి వాదన.
ధ్యాన సాధన గొప్ప యాంటీ ఏజింగ్ ప్రాక్టీస్ అని ఎమిలి సూచిస్తున్నారు. ఏకాగ్రత పెంచుకునేందుకు దీన్ని మించిన సాధనం మరోటి లేదు. మెదడులోని హిప్పోకాంపస్ లో కొత్త కణాలు పుట్టేందుకు దోహదం చేస్తుంది. హిప్పోకాంపస్ లెర్నింగ్, మెమొరిని నియంత్రించే మెదడు భాగం. రోజు కొంత సమయం పాటు ధ్యనంలో గడిపితే కచ్చితంగా మెదడుచుకుగా యవ్వనంగా ఉంటుందని ఎమిలి చెబుతున్నారు.
నిజంగానే young by heart ఉండాలని అనుకునే వారు తప్పకుండా ఈ మూడు చిట్కాలను ప్రాక్టీస్ చెయ్యాలి.
-
నిద్ర లేవగానే పోన్ చూడకూడదు
-
ప్రాసెస్డ్ ఫూడ్ అసలు తీసుకోవద్దు
-
ప్రతి రోజు తప్పకుండా కొంత సమయం పాటు ధ్యానం చెయ్యాలి.
ఇంతే ఈ మూడు చిట్కాలతో నిత్యం యవ్వనంతో ఉండడం సాధ్యమవుతుందని న్యూరో శాస్త్రవేత్త ఎమిలి మెక్డోనాల్డ్ చెబుతున్నారు. అతి సులభమైన ఈ మూడు చిట్కాలను జీవిత నియమాలు చేసుకుంటే ఆనందంగా, చురుకైన మెదడుతో ఉండవచ్చు.
Also read : షవర్ బాత్ చేస్తుంటే తలనొప్పి, మహిళకు అరుదైన సమస్య - కారణం ఏమిటీ?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.





















