అన్వేషించండి

ఈ లడ్డూ పిల్లలకు రోజుకొకటి తినిపించండి చాలు, ప్రొటీన్ లోపమే రాదు

పిల్లల్లో ప్రోటీన్ లోపం రాకుండా ఉండాలంటే ఈ లడ్డూని తినిపించండి.

పిల్లలకు చిప్స్, కుర్ కురేలు, బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చే కన్నా ఇలాంటి ప్రోటీన్ లడ్డూను స్నాక్స్ గా ఇస్తే ఎంతో మంచిది. వారిలో ఎలాంటి ప్రోటీన్ లోపం రాకుండా ఈ ప్రోటీన్ లడ్డు అడ్డుకుంటుంది. అంతేకాదు వారికి నిరంతరం శక్తిని అందిస్తుంది. ఆటలు ఆడినా వారు త్వరగా అలసిపోరు. చదువులో కూడా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచేందుకు ప్రోటీన్ లడ్డు ఎంతో సహకరిస్తుంది. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. దీనిలో బెల్లం వాడతారు. కాబట్టి ఐరన్ లోపం కూడా రాకుండా ఉంటుంది. దీన్ని పిల్లలకు అలవాటు చేస్తే శారీరకంగా, మానసికంగా వారు ఎంతో ఆరోగ్యంగా ఎదుగుతారు.

కావాల్సిన పదార్థాలు 
నువ్వులు - అరకప్పు 
పిస్తా - రెండు స్పూన్లు 
వేరుశెనగ గింజలు - అరకప్పు 
బాదం పప్పులు - పది 
గుమ్మడి గింజలు - రెండు స్పూన్లు 
అంజీర్ - నాలుగు 
ఖర్జూరాలు - నాలుగు 
బెల్లం - కప్పున్నర 
ఎండు కొబ్బరి - అరకప్పు
 యాలకుల పొడి - ఒక స్పూను 
నీళ్లు - తగినంత

తయారీ ఇలా
బాదం, పిస్తా పప్పులను సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశనగపప్పులు, నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే బాదం పిస్తా తరుగును కూడా ఒకసారి వేయించి తీసేయాలి. అందులో ఎండు కొబ్బరిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కళాయిలో బెల్లం నీళ్లు వేసి తీగపాకాన్ని తీయాలి. ఈ లోపు అంజీర్, ఖర్జూరాన్ని చిన్నగా తరుగాలి. బెల్లం తీగ పాకం రాగానే స్టవ్ కట్టేయాలి. యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నింటినీ అందులో వేసి బాగా కలపాలి. అది గోరువెచ్చగా అయ్యేదాకా వదిలేసి తరువాత ఆ పప్పులను బెల్లంతో కలిపి లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే ప్రోటీన్ లడ్డు సిద్ధమైనట్టే.

ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ కూడా ఒకటి. ఇది శరీర కండర ద్రవ్యరాశికి అవసరం. అలాగే కొవ్వులు పేరుకుపోకుండా అడ్డుకోవడంలో కూడా సహాయపడుతుంది. అథ్లెట్లకు ప్రోటీన్ చాలా అవసరం. ప్రొటీన్లు లోపం వస్తే శరీరం చాలా నీరసపడిపోతుంది. కండరాలు, ఎముకలు నిర్మించడానికి అవసరమైన హార్మోన్లు ఎంజైమ్‌కి ప్రోటీన్ ముఖ్యం. మన శరీరంలో ముఖ్యమైన శక్తి వనరు ప్రోటీనే. ఈ లడ్డూలో వాడిన అన్ని పప్పుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ లడ్డు తినడం వల్ల ఐరన్ లోపం కూడా రాదు. ఎందుకంటే బెల్లంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. పిల్లలు ఎక్కువగా రక్తహీనత సమస్య బారిన పడుతూ ఉంటారు. ఈ లడ్డు తినడం వల్ల ప్రోటీన్ లోపం కానీ ఇనుములోపం కానీ రాదు. కాబట్టి రక్తహీనత సమస్య వచ్చే అవకాశమే లేదు. అంతే కాదు వారు చురుగ్గా, బలంగా ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం ఈ ప్రోటీన్ లడ్డూను రోజుకు ఒకటి తినిపించడానికి ప్రయత్నించండి. ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ షేక్లు తాగడం కన్నా ఇలాంటి ప్రోటీన్ లడ్డూలు తయారు చేసుకొని తినడం వల్లే ఎక్కువ ఉపయోగం.

Also read: టీ పదేపదే వేడి చేసి తాగుతున్నారా? అది చాలా డేంజర్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. Gr

టాప్ హెడ్ లైన్స్

Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget