A Boy Diagnosed with Rare Wolf Syndrome : ప్రెగ్నెన్సీ సమయంలో పిల్లిని తిన్న తల్లి.. నక్క పోలికలతో జన్మించిన పిల్లాడు, పిల్లే దీనికి కారణమా?
Hypertrichosis or Werewolf Syndrome : ప్రెగ్నెన్సీ సమయంలో ఓ మహిళ పిల్లిని తిన్నదట. అయితే ఇప్పుడు ఆమె పిల్లాడు వేర్వోల్ఫ్ సిండ్రోమ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. దానికి కారణం పిల్లిని తినడమేనా?
Jaren Gamongan Suffering with Hypertrichosis : గర్భవతిగా ఉన్నప్పుడు చాలామంది ఫుడ్ క్రేవింగ్స్తో ఉంటారు. తమకి నచ్చిన ఫుడ్‌ని తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఫుడ్ ప్రభావం పిల్లలపై ఉంటుంది అంటోంది ఓ మహిళ. ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు క్రేవింగ్స్లో భాగంగా పిల్లిని తిన్నదట. దీనివల్ల తన కొడుకుకి వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ (నక్క పోలికల)తో జన్మించాడని అంటోంది తల్లి. ఫిలిప్పీన్స్‌కు చెందిన జారెన్ గమోంగన్(Jaren Gamongan)లో ఈ అరుదైన స్థితి చోటు చేసుకుంది. ఇంతకీ ఆ తల్లి తిన్న పిల్లే.. వేర్ వోల్ఫ్(Werewolf Syndrome) లక్షణాలకి కారణమా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? దీనికి చికిత్స ఉందా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లిని తినడం వల్లనే ఆ శాపం వచ్చిందట..
ఫిలిప్పీన్స్‌లోని అపయావోకు చెందిన జరెన్ గమోంగన్ వేర్ వోల్ఫ్ సిండ్రోమ్‌తో జన్మించాడు. ఈ సిండ్రోమ్ వల్ల అతని ముఖం, మెడ, వీపు, చేతుల పూర్తిగా నల్లని జుట్టుతో నిండిపోయింది. ఇదే కాకుండా బ్లాక్ సైడ్బర్న్స్, పాచెస్‌తో పుట్టినట్లు వైద్యులు తెలిపారు. కానీ అతని తల్లి మాత్రం తన బిడ్డ అలా పుట్టడానికి కారణం తను తిన్న పిల్లేనని చెప్తోంది. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో పిల్లిని తిన్నానని.. ఆ శాపం కారణంగానే తన కొడుకు వేర్ వోల్ఫ్లా మారిపోయాడని వాపోతుంది. నల్ల పిల్లిని హెర్బ్స్‌తో కలిపి ఫ్రై చేసుకుని తినడం వల్లే తన కొడుకుకి ఈ పరిస్థితి వచ్చిందని పశ్చాత్తాపం పడుతోంది.
స్కూల్‌కి పంపాలంటే భయంగా ఉంది..
జారెన్ను స్కూల్‌కి పంపించాలంటే భయంగా ఉందని.. తోటి విద్యార్థులు అతడిని హేళన చేస్తారని అల్మా భావిస్తున్నట్లు తెలిపింది. నా ఫుడ్ క్రేవింగ్స్ వల్లనే జారెన్ ఇలా పుట్టాడని అనుకున్నాను కానీ.. వైద్యులు దానికి దీనికి సంబంధం లేదని తెలిపారు. కానీ ఇప్పటికీ నాకు ఆ విషయంలో గిల్టీగా ఉందని బాధపడుతోంది. వేర్ వోల్ఫ్ లక్షణాలు వెంటుక్రల రూపంలో కనిపించడమే కానీ.. జారెన్ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాడని తెలిపింది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే అతని చర్మంపై దద్దుర్లు వస్తున్నాయని వెల్లడించింది. మొదట్లో అతని చర్మంపై వెంట్రుకలను కట్ చేయడానికి చూస్తే అవి మరింత మందంగా పెరగడాన్ని చూసి.. వైద్యుల దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలిపింది.
Jaren Gamongan a two year old, from Apayao Philippines, was born with 'werewolf syndrome' but his mother believes it was because she ate a wild cat during her pregnancy. 😼
— Carrington Mwendwa (@OleCarrington) April 10, 2024
Full story https://t.co/vn0I5htayX pic.twitter.com/BysoeeohrL
పిల్లి వల్ల కాదు.. కారణం అదే..
వైద్యులు మాత్రం హైపర్ట్రికోసిస్ (Hypertrichosis)అనే వైద్య పరిస్థితి వల్ల.. అతను వేర్ వోల్ఫ్ సిండ్రోమ్‌తో జన్మించాడని చెప్తున్నారు. అయితే ఇది పిల్లిని తినడం వల్ల జరిగింది కాదని.. ఆమె మూఢనమ్మకాన్ని మరింత పెంచేలా చుట్టుపక్కల వారు ఆమెను ట్రిగర్ చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమె జారెన్ను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు.. అతను హైపర్ట్రికోసిస్ అనే మెడికల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
వంద బిలియన్స్‌లో ఒకరికి..
వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ అనేది చాలా రేర్ కేస్ అని.. ప్రపంచవ్యాప్తంగా 50 నుంచి 100 మందికి మాత్రమే ఈ అరుదైన సిండ్రోమ్ వచ్చిందని వారు స్పష్టం చేశారు. ఇది ప్రతి వంద బిలియన్ మందిలో ఒకరిని మాత్రమే ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఈ సమస్యకు చికిత్స లేనప్పటికీ.. లేజర్, హెయిర్ రిమూవల్ చికిత్సలు కాస్త ఉపశమనం ఇస్తాయని వెల్లడించారు. నాలుగు నుంచి ఆరు వారాల్లో పది సేషన్లు చేయడం వల్ల వెంట్రుకలు తగ్గే అవకాశముందని తెలిపారు. కానీ ఈ వైద్యం కాస్త ఖర్చుతో కూడుకున్నదే.
హైపర్ట్రికోసిస్ అంటే ఏమిటి? చికిత్స ఉందా?
హైపర్ట్రికోసిస్, వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ అనేది ఓ వ్యక్తి శరీరంలోని ప్రతి భాగంపై జుట్టు పెరిగేలా చేస్తుంది. సాధారణంగా ఉండే జుట్టు కంటే ఎక్కువగా వస్తుంది. ఇది చాలా అరుదైన పరిస్థితి. పిల్లలు పుట్టిన తర్వాత వారు పెరిగే కొద్ది వెంట్రుకలు అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల కాస్మోటిక్ ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యకు చికిత్సలు పరిమితంగా ఉంటాయి. పైగా ఇవి పూర్తి ఫలితాలను ఇవ్వవు. అయితే జుట్టు పెరుగుదల మనిషి ఉంటున్న ప్రదేశం, అతని అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.
Also Read : HPV ఇన్ఫెక్షన్తో జెనిటిక్స్కు లింక్ ఉందట.. మహిళల్లో ఆ క్యాన్సర్‌ని ఇదే రెట్టింపు చేస్తుందన్న న్యూ స్టడీ