Curd: మామూలు పెరుగు కన్నా పులిసిన పెరుగు తింటేనే లాభాలెక్కువ
పెరుగు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందులోనూ పులిసిన పెరుగుతో ఇంకా ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి.
పెరుగు మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది.రోజూ కచ్చితంగా తినాల్సిన ఆహారంలో పెరుగు కూడా ఒకటి. అయితే సాధారణ పెరుగు కన్నా కాస్త పులిసిన పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. రోజూ పులిసిన పెరుగు తినడం మంచిది కాదు కానీ, అప్పుడప్పుడు తినడం వల్ల శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టిరియా పుష్కలంగా అందుతుందని అంటున్నారు. పొట్ట, పెద్ద పేగులకు మేలు చేసే ఎసినోఫిలస్, లాక్టోబాసిలస్, బిఫిడో వంటి మంచి బ్యాక్టిరియాలు సాధారణ పెరుగు కన్నా పుల్లని పెరుగులోనే పుష్కలంగా ఉంటాయి. ఈ బ్యాక్టిరియాలు మన పేగుల్లో అధికంగా ఉంటే అక్కడి ఆరోగ్యం అంత చక్కగా ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. కానీ పులిసిన పెరుగు అధికంగా తినడం వల్ల, రోజూ తినడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరిలో గ్యాస్టిక్ సమస్య రావచ్చు. కాబట్టి మూడు రోజులకోసారి పులిసిన పెరుగు తినేందుకు ప్రయత్నించండి.
రోజూ తినాల్సిందే
సాధారణ పెరుగు రోజూ తినాల్సిందేనని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శరీరానికి కావాల్సిన పోషకాలను నింపుకుని ఉంటుంది. కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, పొటాషియంతో పాటూ విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. పెరుగన్నం అరగకపోవడం అనే సమస్య ఉండదు. చక్కగా జీర్ణం అవుతుంది. అజీర్తి సమస్య ఉండదు. కాబట్టి ఎప్పుడైనా పెరుగన్నం తినవచ్చు. హైబీపీ ఉన్న వారు పెరుగు రోజూ తినంటే వారి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
స్త్రీలకు
మహిళలు పెరుగు తినడం చాలా అవసరం. జననాంగాలలో వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించే శక్తికి పెరుగుకే ఉంది. అంతేకాదు చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. అందంగా మెరిసేలా చేస్తుంది. 30 ఏళ్లు దాటిన మహిళల్లో కాల్షియం లోపిస్తుంది. అలాంటి వారు కచ్చితంగా పెరుగు, పాలు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
ఆరోగ్యానికి...
గుండె ఆరోగ్యానికి పెరుగు చాలా అవసరం. అలాగే మెదడు పనితీరును కూడా ఇది మెరుగు పరుస్తుంది. మానసిక సమస్యలక చెక్ పెట్టే సత్తా దీనికే ఉంది. మానసిక ఆందోళనలు తగ్గి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఎంపిక. వందగ్రాములు పెరుగు తింటే 59 క్యాలరీల శక్తి వస్తుంది. కాబట్టి ఆరోగ్యకరంగా బరువు తగ్గచ్చు. పెరుగును వంటకాలలో కూడా భాగం చేసుకుని వండితే మంచి రుచి వస్తుంది. కొన్ని రకాల కూరలు, బిర్యానీలలో పెరుగును వేస్తే రుచి అదిరిపోవడం ఖాయం.
Also read: మాంసాహారం అధికంగా తినేవారికి షాకింగ్ న్యూస్, డయాబెటిస్ బారిన పడే అవకాశం ఎక్కువ
Also read: రెండు నిమిషాల్లో చేసుకునే మ్యాంగ్ మగ్ కేక్