(Source: ECI/ABP News/ABP Majha)
Vegetarian Food: పూర్తిగా శాకాహారులుగా మారడం ఆరోగ్యానికి నిజంగా ప్రయోజనకరమా?
పూర్తిగా మాంసాహారాన్ని మాని, శాకాహారులుగా మారితే ఆరోగ్యం బాగుంటుందా?
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తి. ఈమె స్వచ్ఛమైన శాఖాహారి. ఈ విషయాన్ని తానే వెల్లడించింది. తాను పూర్తిగా స్వచ్ఛమైన శాఖాహారినని చెప్పారు. అప్పటినుంచి స్వచ్ఛమైన శాఖాహారులు ఆరోగ్యంగా ఉంటారా అన్న విషయంపై చర్చ మొదలైంది. స్వచ్ఛమైన శాఖాహారులు అంటే ఎలాంటి మాంసాహారాన్ని ముట్టుకోనివారు. గుడ్లు కూడా తినరు. పాల ఉత్పత్తులను కూడా దూరం పెడతారు. హెల్త్ పబ్లిషింగ్ వెబ్‌సైట్లో చెప్పిన ప్రకారం... శాకాహారుల్లో వివిధ రకాలు ఉన్నారు. లాక్టో ఓవో శాకాహారులు... మాంసం ,చికెన్, చేపలు వంటివి తినరు. కానీ వీరు గుడ్లు, పాల ఉత్పత్తులను తింటారు. ఇక లాక్టో శాకాహారులు... మాంసం, గుడ్లు, చేపలు వంటివి తినరు. కానీ పాల ఉత్పత్తులను తీసుకుంటారు. అలాగే ఓవో శాఖాహారులు... మాంసం, చేపలు, పాల ఉత్పత్తులను తినరు. కానీ వీరు గుడ్లు తింటారు. ఇన్ని రకాలు ఉన్నారు శాకాహారులు. మరికొందరు మాంసాహారాన్ని వండినప్పుడు మాంసం ముక్కలను తినరు, కానీ అందులోని గ్రేవీని వేసుకొని తింటారు. వీళ్ళు కూడా తమను శాఖాహారులుగానే చెప్పుకుంటారు. నిజానికి వీరంతా స్వచ్ఛమైన శాఖాహారులు కారు. ఎవరైతే పూర్తిగా మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటివన్నీ మానేస్తారో, వారే స్వచ్ఛమైన శాఖాహారులు అని అంటున్నారు హార్వర్డ్ శాస్త్రవేత్తలు.
ఇతర ఆహారాలతో పోలిస్తే పూర్తి శాకాహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందో లేదో తెలుసుకుందాం. కొన్ని అధ్యయనాల ప్రకారం శాఖాహారం... గుండె వ్యాధుల నుంచి కాపాడుతుంది. స్వచ్ఛమైన శాఖాహారంలో కొవ్వు నిండిన ఆహార పదార్థాలు ఏవీ ఉండవు. కాబట్టి గుండె వంటి ప్రధాన అవయవాలు వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి. దీనివల్ల జీవన కాలం పెరిగే అవకాశం ఉంది. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాఖాహారులు తక్కువ సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్, విటమిన్ సి, విటమిన్ ఈ, డైటరీ ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ఫైటో కెమికల్స్ ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకుంటారు. దీని వల్ల వారు బరువు కూడా పెరగరు. అయితే శాకాహారులు చాలా జాగ్రత్తగా ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. వీరిలో త్వరగా పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంది. శాకాహారం తీసుకునే వ్యక్తుల్లో విటమిన్ బి12, విటమిన్ డి, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటివి లోపించే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ లోపాలు తీర్చడానికి సప్లిమెంట్లను వాడాలి. లేదా అవి అధికంగా ఉండే ఆహారాలు ఏవో తెలుసుకొని తినాలి. అయితే కొన్ని మాంసాహారాల్లోనే ఈ పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి సప్లిమెంట్లను వాడుకోవడం ఉత్తమ పద్ధతి.
Also read: సూర్యాస్తమయం తరువాత ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్, ఆ వ్యాధి ఉన్నట్లే
Also read: బ్లూ బెర్రీ పండ్లను చదువుకునే పిల్లలకు ఖచ్చితంగా తినిపించాలి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి