News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sundown Syndrome: సూర్యాస్తమయం తరువాత ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్, ఆ వ్యాధి ఉన్నట్లే

సూర్యాస్తమయం తర్వాత కొన్ని రకాల లక్షణాలు కనిపించడం చాలా ప్రమాదకరం.

FOLLOW US: 
Share:

Sundown Syndrome: సూర్యాస్తమయం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో అధికంగా ఉన్న కాంతి, సూర్యాస్తమయం సమయానికి నారింజ రంగులో మారి అస్తమిస్తుంది. కానీ కొందరిలో సూర్యాస్తమయం జరుగుతున్న కొద్దీ... కొన్ని లక్షణాలు బయట పడుతూ ఉంటాయి. వారి శారీరక మానసిక స్థితిలో కొన్ని మార్పులు వస్తాయి. సూర్యాస్తమయం అవుతుంటూనే ఇలా భయపడి పోయే వారు కొంతమంది ఉంటారు. వారంతా కూడా సన్ డౌన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్న వారే. అంటే సూర్యాస్తమయం అవుతూ ఉంటే వారిలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆందోళన పెరిగిపోతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఇలా సన్ డౌన్ సిండ్రోమ్ బారిన పడే అవకాశం ఎక్కువ.

ఈ వ్యాధి బారిన పడినవారు సూర్యాస్తమయం తర్వాత గందరగోళంగా ఆలోచిస్తూ ఉంటారు. వారిలో ఆందోళన పెరుగుతుంది. గాభరా పడుతుంటారు. మతిమరుపు వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. చిత్త వైకల్యం ఉన్నట్టు కనిపిస్తారు. అశాంతిగా, చిరాకుగా ఉంటారు. తీవ్రంగా అలసట పడుతుంటారు.

అల్జీమర్స్, చిత్త వైకల్యం వంటి సమస్యలు సన్ డౌన్ సిండ్రోమ్‌కు సంబంధించిన నాడీ సంబంధిత వ్యాధులుగా చెప్పుకోవాలి. దీని గురించి తెలిసింది చాలా తక్కువే. ఇంకా ఈ సిండ్రోమ్ గురించి ఎన్నో పరిస్థితుల్లో జరుగుతున్నాయి. కొంతమంది నిపుణులు చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి సిర్కాడియన్ రిథమ్‌తో ఈ సన్ డౌన్ సిండ్రోమ్ సంబంధం కలిగి ఉండవచ్చు. ఈ సిండ్రోమ్ ఆ వ్యక్తుల జీవన నాణ్యత పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నీడలు అధికంగా చూసినా, కాంతి తగ్గిపోతున్నా వారిలో అనేక రకాల లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. 

డిమెన్షియా ఉన్నవారికి, అంటే చిత్తవైకల్యం ఉన్నవారికి ఈ సిండ్రోమ్ త్వరగా వస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం చిత్తవైకల్యం అనేది ఒక మానసిక రోగం. ఇది వృద్ధాప్యం అవుతున్న కొద్దీ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. డిమెన్షియా అనేది అల్జీమర్స్ వ్యాధిగా కూడా చెప్పుకుంటారు. అలాగే మెదడు స్ట్రోక్ వంటి వాటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతారు.

సన్‌డౌన్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే మానసిక వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది. వారు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన కౌన్సిలింగ్ మందులను మానసిక వైద్య నిపుణులు అందిస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడితే కచ్చితంగా ఈ సిండ్రోమ్ తగ్గే అవకాశం ఉంది.

Also read: బ్లూ బెర్రీ పండ్లను చదువుకునే పిల్లలకు ఖచ్చితంగా తినిపించాలి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి

Also read: జాగ్రత్త పడండి, పెరిగిపోతున్న మధుమేహం కేసులు - భవిష్యత్తులో 130 కోట్ల మందికి డయాబెటిస్
 
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Published at : 29 Jul 2023 11:33 AM (IST) Tags: sunset Sundown Syndrome Sundown Syndrome Causes What is Sundown Syndrome

ఇవి కూడా చూడండి

Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?

Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?

Walking Tips : ఇలా నడిస్తే డయాబెటిస్ రానేరాదట - మీరూ ట్రై చేయండి

Walking Tips : ఇలా నడిస్తే డయాబెటిస్ రానేరాదట - మీరూ ట్రై చేయండి

Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది

Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది

Stomach Cancer: కడుపులో ఇలా అనిపిస్తోందా? క్యాన్సర్ కావచ్చు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Stomach Cancer: కడుపులో ఇలా అనిపిస్తోందా? క్యాన్సర్ కావచ్చు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

టాప్ స్టోరీస్

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Mangalavaaram: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘మంగళవారం’ - ఎప్పుడు, ఎక్కడంటే?

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!