Yoga vs Bhramari Yoga : యోగాకి, భ్రమరి యోగాకి ఉన్న తేడాలివే.. ఏది మంచిదంటే..
International Yoga Day 2025 : మీకు భ్రమరి యోగా గురించి తెలుసా? యోగాకి దీనికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ రెండిటీలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Best Yoga for Health : యోగా గురించి చాలామందికి తెలుసు కానీ భ్రమరి యోగా (Bhramari Pranayama) గురించి ఎక్కువమందికి తెలియదు. యోగా దినోత్సవం నేపథ్యంలో భ్రమరి యోగా గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు.. అసలు భ్రమరి యోగా అంటే ఏంటి? యోగాకి, భ్రమరి యోగాకి మధ్య ఉన్న తేడా ఏంటి? వీటిలో ఏది మంచిది.. భ్రమరి యోగాతో కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యోగా
శారీరకంగా ఆసనాలు వేస్తూ.. శ్వాసకు అనుగుణంగా మూమెంట్స్ ఇస్తూ చేసేది యోగా.
భ్రమరి యోగా
ఒక బ్రీటింగ్ టెక్నీక్‌తో చేసే ప్రాణాయామాన్ని భ్రమరి యోగా అంటారు. దీనిని "బీ బ్రీత్" అని కూడా అంటారు.
యోగాతో కలిగే లాభాలు
యోగా రెగ్యులర్‌గా చేస్తే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా మెరుగ్గా ఉంటారు. యోగాలో వివిధ రూపాలు ఉంటాయి. హఠ యోగ, విన్యాస, అష్టాంగ వంటి మొదలైన రూపాలు ఉంటాయి. ఆసనాలు, స్ట్రెచ్ చేయడం, బ్రీతింగ్, మెడిటేషన్ రూపంలో యోగా చేస్తారు. యోగాలో బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఉంటాయి. అప్‌గ్రేడ్ అవుతూ యోగా నేర్చుకోవచ్చు. వయసు, కంఫర్ట్ ప్రకారం మారుతూ ఉంటాయి.
యోగా రోజూ చేయడం వల్ల ఫ్లెక్సీబిలిటీ పెరుగుతుంది. స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. అలాగే ప్రశాంతత పెరగుతుంది. ఫోకస్‌గా పనిచేసుకోగలుగుతారు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు. మీరు చేసే ఆసనాలు బట్టి రోజుకు అరగంట నుంచి గంట చేయవచ్చు.
భ్రమరి యోగా బెనిఫిట్స్
భ్రమరి యోగా మైండ్‌ని రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. యాంగ్జైటీని దూరం చేసి మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. బ్రీత్ కంట్రోల్ చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తారు. భ్రమరి యోగా చేసేందుకు ఓ ప్లేస్‌లో నిశబ్ధంగా కూర్చొంటారు. శ్వాసను లోతుగా తీసుకుని.. దానిని వదిలేప్పుడు హమ్మింగ్ సౌండ్ చేస్తూ వదులుతారు. తేనెటీగ ఎలా అరుస్తుందో.. అదే మాదిరి సౌండ్ చేస్తూ శ్వాసను వదలాలి.
ఏ వయసు వారైనా ఈజీగా చేయగలిగే ప్రక్రియ ఇది. మానసికంగా ఇబ్బందిపడేవారికి ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. యాంగ్జైటీ తగ్గుతుంది. పనులపై కాన్సెంట్రేషన్ పెరుగుతుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఒత్తిడి తగ్గుతుంది. రోజులో 5 నుంచి 10 నిమిషాలు చేసినా మంచి ఫలితాలు చూడగలుగుతారు.
యోగా మంచిదా? భ్రమరి యోగా మంచిదా?
మానసికంగా, శారీరకంగా కూడా ప్రయోజనాలు కావాలనుకుంటే యోగా చేయవచ్చు. మానసికంగా ఇబ్బంది పడుతూ యాంగ్జైటీ వంటివాటిని దూరం చేసుకోవాలనుకుంటే భ్రమరీ యోగా బెస్ట్ ఆప్షన్. రోజులో ఎక్కువ సమయం యోగాకి వెచ్చించలేనివారు భ్రమరి యోగాను ట్రై చేయవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















