ఉద్యోగం చేసేవారు వివిధ కారణాల వల్ల ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. మీరు అలాంటి వారిలో ఒకరా?

అయితే మీ డేని యోగాతో ప్రారంభించండి అంటున్నారు నిపుణులు. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయట.

యోగా చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి హెల్తీగా ఉంటారు. అంతేకాకుండా ఎన్నో మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

బ్రెయిన్​ని షార్ప్ చేసి.. రోజంతా మీరు వర్క్​పై ఫోకస్​గా ఉండేలా చేస్తుంది.

మీ ఎనర్జీ లెవెల్స్​ని పెంచి యాక్టివ్​గా ఉండేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

మెటబాలీజం పెంచి.. బరువును అదుపులోకి తీసుకువస్తుంది. స్ట్రెస్​ వల్ల బరువు పెరగకుండా ఉంటారు.

గాఢ నిద్రను అందించి.. స్లీప్ సైకిల్​ని మెరుగుపరుస్తుంది. హార్మోన్స్ బ్యాలెన్స్డ్​గా ఉంటాయి.

శరీరాన్ని ఫ్లెక్సిబుల్​గా చేస్తుంది. ఎక్కువసేపు కూర్చోంటే వచ్చే సమస్యలను దూరం చేస్తుంది.

ఇమ్యునిటీని పెంచడంతో పాటు హార్ట్​ రేట్​ని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్​ను తగ్గిస్తుంది.

సంతోషంగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.

రోజూ 15 నిమిషాలు యోగా చేస్తే మార్పులు మీరు చూస్తారని చెప్తున్నారు నిపుణులు.