(Source: ECI/ABP News/ABP Majha)
Womens Day 2024 Gift Ideas: మీ జీవితంలో ‘ఆమె’ చాలా స్పెషలా? ‘ఉమెన్స్ డే’కి ఈ గిఫ్ట్స్ ఇవ్వండి
Womens Day 2024 Gift Ideas: ఉమెన్స్ డే.. వచ్చేసింది. మీ జీవితంలోని స్పెషల్ మహిళలకు ఏ గిఫ్ట్‌లు ఇవ్వాలో అర్థం కావడం లేదా? అయితే, ఈ ఐడియాలపై ఒక లుక్కేయండి.
Womens Day 2024 Gift Ideas: మార్చి 8న ఉమెన్స్ డే.. మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన మహిళలను గౌరవించుకునే రోజు ఇది. తల్లి, చెల్లి, భార్య, కొలిగ్, ఫ్రెండ్ ఎవరైనా కావొచ్చు.. ఉమెన్స్ డే రోజున వాళ్లకు స్పెషల్ బహుమతిని ఇస్తే.. వాళ్ల స్పెషల్ డే ఇంకా స్పెషల్ అవుతుంది. రెగ్యులర్‌గా ఇచ్చే ఫ్లవర్ బొకేస్, చాక్లెట్స్ లాంటివి కాకుండా స్పెషల్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా? మరి ఎలాంటి బహుమతి ఇవ్వాలో అర్థం కావడం లేదా? ఎం తీసుకోవాలో పాలుపోవడం లేదా? అయితే, ఈ పది గిఫ్ట్ ఐడియాలు మీ కోసమే.
క్రియేటివ్‌గా ఆలోచించే వాళ్లకి..
❤ నిజానికి చాలామంది మహిళల్లో బోలెడు టాలెంట్స్ ఉంటాయి. కానీ, కొన్ని కారణాల వల్ల వాటిని వాళ్లు బయటపెట్టలేరు. ఇంట్లో వాళ్లు ఎంకరేజ్ చేస్తే కచ్చితంగా వాళ్ల సక్సెస్ అవుతారు. అలా క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్ల కోసం క్రియేటివ్ గిఫ్ట్స్ ఇవ్వండి.
❤ ఆమెలోని ఆర్టిస్ట్‌ని బయటికి తీసుకొచ్చేందుకు ఉపయోగపడే కిట్‌ని ఇవ్వండి. పెయింటింగ్, జ్యువెలరీ మేకింగ్, సోప్ క్రాఫ్టింగ్ లాంటి కిట్స్ ఇస్తే.. వాళ్లలోని క్రియేటివిటీ బయటికి వస్తుంది.
❤ కొత్త విషయాలు, కొత్త స్కిల్స్ నేర్చుకునేందుకు ఉపయోగపడే గిఫ్ట్ వర్క్‌షాప్స్, సర్టిఫికెట్ కోర్సుల్లో చేర్పించండి. వాళ్లకు ఇంట్రెస్ట్ ఉన్న విషయాల్లో ఇంకా ఎక్స్‌పర్ట్ అయ్యేలా ఈ వర్క్‌షాప్స్‌కి ఫీజులు కట్టి ఎంకరేజ్ చెయొచ్చు.
❤ ఒక మంచి కొటేషన్‌తో పర్సనలైజ్డ్ స్టేషనరీ సెట్‌ను బహుమతిగా ఇస్తే ఆనందంగా ఫీల్ అవుతారు.
రిలాక్సేషన్ కోసం..
నిజానికి మహిళలు చాలా కష్టపడతారు. ఇక వర్కింగ్ ఉమెన్స్ అయితే అటు ఆఫీస్ వర్క్, ఇటు ఇంటి పనులు చేయలేక ఎప్పుడెప్పుడు రెస్ట్ దొరకుతుందా అని వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం.. వాళ్లు రిలాక్స్ అయ్యేందుకు ఏదైనా సర్‌ప్రైజ్ ఇస్తే హ్యాపీగా ఫీలవుతారు.
❤ స్పా, లేదా మసాజ్ ద్వారా రిలాక్స్ కలిగించొచ్చు. అలానే ఆమె సెల్ఫ్ కేర్ తీసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. అందుకే, ఆరోజు స్పా లేదా మసాజ్ కోసం తీసుకెళ్లండి. లేదా వాటి తాలుకు వస్తువులను గిఫ్ట్‌లా ఇస్తే రిలాక్స్‌గా ఫీలవుతారు.
❤ బాత్ ప్రాడెక్ట్స్, ఆమెకు నచ్చిన వాటి సబ్‌స్క్రిప్షన్స్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.
❤ పనిలో పడి అలిసిపోయే ఆమెకి రిలాక్సేషన్, కంఫర్ట్ కోసం మంచి వెయిటెడ్ బ్లాంకెట్ లేదా లగ్జరీ రోబ్ ఒకటి ఇస్తే.. చక్కటి నిద్రపట్టేందుకు, రెస్ట్ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.
ఫుడ్డీస్, ఎంటర్‌టైన్మెంట్ కోరుకునే వాళ్లకు..
రకరకాల ఫుడ్స్ టేస్ట్ చేయాలని, రకరకాల ఫుడ్స్ ఇంట్లో వాళ్లకు వండి వడ్డించాలని అనుకుంటారు మహిళలకు అలాంటి వాళ్ల కోసం కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్‌లు ఉంటాయి.
❤ మహిళలు ట్రైనింగ్ లేకుండానే చాలా చక్కగా వంట చేస్తుంటారు. కొంతమందికి కొన్ని కొత్త వంటకాలు చేయాలని, నేర్చుకోవాలనే కోరికలు ఉంటాయి. అలాంటి వాళ్లకి కుక్కింగ్ క్లాసులు జాయిన్ చేయడం, కొత్త కొత్త రకాల వంటకాలను తినిపించడం లాంటివి చేస్తే కచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు.
❤ బయటికి వెళ్లి తినడమే కాకుండా.. ఇంట్లో వాళ్లకు స్పెషల్స్ చేయాలని అనుకుంటారు చాలామంది. అలాంటి వాళ్ల కోసం స్పెషల్ రెసిప్పీలు ఉన్న పుస్తకాలు, మంచి చాపింగ్ బోర్డ్స్ లాంటివి ఇస్తే ఆమె కిచెన్‌కి ఎడిషనల్ లవ్‌ని యాడ్ చేసినవాళ్లు అవుతారు.
❤ కొత్త కొత్త వంటకాలు చేసే విధంగా, కొత్త కొత్త వస్తువులు తేచ్చిస్తే ఎంకరేజింగ్‌గా ఉంటుంది. వెన్న, లోకల్ హనీ, మంచి మంచి పండ్లు లాంటివి గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.
❤ తనకు ఇష్టమైన హీరో, కమెడియన్, సింగర్ ఎవరో ఒకరి కాన్సర్ట్ టికెట్స్‌తో సర్‌ప్రైజ్ చేయండి.
❤ చక్కటి వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేసి సర్‌ప్రైజ్ చేయొచ్చు. దీంతో రొటీన్ నుంచి బయటపడి రిలాక్స్‌గా ఫీల్ అవుతుంది. కొత్తదనాన్ని ఆస్వాదిస్తుంది.
❤ మీకు మహిళలకు సేవలు అందించే ఆసక్తి ఉన్నట్లయితే.. ఆమెతో కలిసి ఏదైనా ఒక మంచి పని చేయండి. వాలంటీర్‌గా ఆమెతోపాటు కంట్రిబ్యూట్ చేస్తే.. ఆనందపడటమే కాకుండా, మీ మధ్య బాండ్ కచ్చితంగా బలపడుతుంది.
Also Read: ‘గామి’ ట్రైలర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రభాస్, ఫ్యాన్స్ ఫిదా