(Source: ECI/ABP News/ABP Majha)
International Condom Day 2024 : కండోమ్స్‌కి కూడా ఒక డే ఉంది.. వాలెంటైన్స్ డే ముందు రోజే దానిని ఎందుకు జరుపుతారో తెలుసా?
Condom Day 2024 : బర్త్ కంట్రోల్‌కి, లైంగిక సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండేందుకు చాలామంది కండోమ్స్ ఉపయోగిస్తారు. దీని ప్రాముఖ్యతను తెలియజేస్తూ అంతర్జాతీయ కండోమ్ దినోత్సవాన్ని జరుపుతున్నారు.
Condom Day Significance : మన దేశంలో శృంగారం, కండోమ్ అంటే ఏదో తప్పుగా మాట్లాడేస్తున్నామనే భ్రమలో ఉంటారు. కానీ.. జనాభాలో మన దేశమే అగ్రస్థానంలో ఉంది. కండోమ్ అంటే ఏదో తప్పుగా భావించే భ్రమలో మీరు ఉంటే అది కచ్చితంగా పొరపాటే. ఎందుకంటే దీనిని కుటుంబ నియంత్రణ, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నిరోధించే సాధనంగా చెప్తున్నారు నిపుణులు. అందుకే దీని ప్రాముఖ్యతను అందరికీ తెలియజేసే విధంగా ఏటా ఫిబ్రవరి 13వ తేదీన అంతర్జాతీయ కండోమ్స్ డే నిర్వహిస్తున్నారు.
కండోమ్స్ వాడకం వల్ల లైంగిక సమయంలో సంక్రమణ ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. అసురక్షిత లైంగిక సంపర్కం ద్వారా గత పదేళ్లలో దేశంలో 17 లక్షల మందికి పైగా హెచ్ఐవి సోకింది. హెచ్ఐవికి పూర్తి నివారణ చికిత్స లేదు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కండోమ్స్ హెల్ప్ చేస్తాయి.
ఆ సమస్యలను కంట్రోల్ చేసేందుకు
వైరస్ కలిగిన రక్తం, వీర్యం, యోని స్రావాలతో వైరస్ సంపర్కం చెంది వ్యాప్తి జరుగుతుంది. ఈ వ్యాప్తి జరిగే చోట జాగ్రత్తలు పాటించకపోతే.. HIV, ఎయిడ్స్ అభివృద్ధి చెందుతుంది. అందుకే లైంగిక ఆరోగ్యం కోసం అందుబాటులో ఉండే వనరులను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. STDల గురించి తెలుసుకోవడం.. తమని తాము రక్షించుకోవడం ద్వారా వాటి వ్యాప్తి తగ్గుతుంది. ఇది మొత్తం లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. అందుకే కండోమ్ ప్రాఖ్యతను తెలుపుతూ.. అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం జరుపుకుంటున్నారు.
వాలెంటైన్స్ డే ముందుకు ఎందుకంటే..
బాధ్యతాయుతమైన, సురక్షితమైన లైంగిక ప్రవర్తన నొక్కిచెప్పడానికి, వాలెంటైన్స్ డేకి ఒకరోజు ముందు వ్యూహాత్మకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం జరుపుకుంటారు. సురక్షితమైన సెక్స్ పద్ధతులను ప్రోత్సహించడానికి, HIV లేదా STIలను నివారించడంలో కండోమ్ వినియోగం, ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. లైంగిక ఆరోగ్య విద్య కోసం, కండోమ్‌ల ప్రాప్యతను ప్రోత్సాహించడం కోసం, కండోమ్‌ల వినియోగం చుట్టూ ఉన్న కళంకాన్ని తగ్గించడం కోసం అంతర్జాతీయ కండోమ్ డేను నిర్వహిస్తున్నారు.
కండోమ్స్ డే లక్ష్యం ఏమిటంటే..
వ్యక్తులు తమ లైంగిక ఆరోగ్యం గురించి, వారి ఎంపికల గురించి, సురక్షితమైన లైంగిక అభ్యాసాల గురించి, దాని గురించిన సంభాషణను ప్రోత్సాహించడానికి, అవగాహన ప్రచారాలు, విద్యా కార్యక్రమాలు, కండోమ్స్ పంపిణీ కార్యక్రమాల ద్వారా STIలు, STDల వ్యాప్తిని అరికట్టడంలో ప్రపంచ ప్రయత్నాలకు సహకరించడమే అంతర్జాతీయ కండోమ్ దినోత్సవం ప్రధాన లక్ష్యం.
ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ మహమ్మారిపై కండోమ్‌లు గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. 1990 నుంచి కండోమ్ వాడకం పెరిగింది. 117 మిలియన్ల మందిలో కొత్త HIV ఇన్ఫెక్షన్లను ఇది నివారించినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 2020లో ప్రపంచ వ్యాప్తంగా 374 మిలియన్ల కొత్త STI ఇన్ఫెక్షన్లు 15 నుంచి 49 సంవత్సరాల మధ్య గల వారిలో సంభవించినట్లు గుర్తించారు. అందుకే కండోమ్స్ వినియోగంపై మళ్లీ విస్తృత స్థాయిలో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read : వాలెంటైన్స్ డే విషెష్‌ను ఇలా ప్రేమగా చెప్పండి.. వాట్సాప్‌లో ఇలాంటి కోట్స్ పెట్టేయండి