Influenza Vs Covid 19: ఇన్‌ఫ్లూయెంజా A వైరస్, కోవిడ్-19 ఒకేసారి సోకితే వ్యాధి తీవ్రమవుతుందా? స్టడీలో తేలింది ఇదే!

ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్, కోవిడ్-19 వైరస్‌లు ఒకేసారి దాడి చేస్తే ప్రమాదకరమా? ఈ రెండు వైరస్‌లను మన శరీరం తట్టుకోగలదా?

FOLLOW US: 

కోవిడ్-19 ఇప్పుడు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మరోవైపు ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సైతం ఉనికి చాటుతోంది. ఇలాంటి తరుణంలో ఆ రెండు వైరస్‌లు ఒకేసారి సంక్రమిస్తే? వామ్మో, ఇంకేం ఉంది ప్రాణాలు పోవడం ఖాయం అని అనుకుంటున్నారా? కానే కాదు.. మీకు ఆ భయం వద్దని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. ఈ రెండు వైరస్‌లు ఒకేసారి సంక్రమిస్తే పెద్ద ముప్పు ఉండదని అంటున్నారు. ముఖ్యంగా ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకినవారికి SARS-CoV-2 (కరోనా వైరస్) సోకినట్లయితే.. వ్యాధి తీవ్రత పెరగదని తేలింది. పైగా ఈ వైరస్ కోవిడ్‌ను గణనీయంగా అణిచివేస్తుందని పరిశోధన వెల్లడించింది. 

న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు దీనిపై మాట్లాడుతూ SARS-Cov-2, ఇన్‌ఫ్లూయెంజా A.. ఈ రెండూ శ్వాసకోశ ఆర్ఎన్ఏ వైరస్‌లు. ఇవి రెండు ప్రజారోగ్యానికి ప్రమాదకరమైనవే. అందుకే ఈ పరిశోధన చాలా కీలకమైనది. ఈ రెండు వైరస్‌లు వాయుమార్గాలకు సోకడం వల్ల గణనీయమైన అనారోగ్యానికి గురికావడమే కాదు.. మరణాలకు కూడా దారితీయొచ్చు. 

ఇప్పటివరకు జరిగిన క్లినికల్ అధ్యయనాల ప్రకారం.. ఇతర వైరస్‌లతో కలిసి SARS-CoV-2 సంక్రమిస్తోందని తేలింది. ఈ సహసంస్కరణ వల్ల వైరస్‌లు మన వాయుమార్గంలోని ఉండే కణాలకు సోకుతాయి. ఇన్‌ఫ్లూయెంజా A వైరస్ సోకిన కణాలకే మళ్లీ కోవిడ్-19 వైరస్‌లు సోకుతాయి. ముఖ్యంగా ఊపిరితీత్తుల్లో SARS-CoV-2 వ్యాప్తిని అడ్డుకుంటాయి. ఇలా సుమారు వారం రోజుల వరకు కొనసాగవచ్చు. 

జర్నల్ ఆఫ్ వైరలాజీలో పేర్కొన్న వివరాల ప్రకారం.. SARS-CoV-2 పెరుగుదలను పరిమితం చేసే ఇన్ఫ్లుఎంజా A వైరస్ వ్యాధి తీవ్రతపై ఎంత ప్రభావం చూపుతుందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఈ వైరస్‌ల ప్రభావాన్ని తెలుసుకొనేందుకు ఎలుకలపై కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ సందర్భంగా ఒకేసారి రెండు వైరస్‌లు ఇచ్చారు. మూడు రోజుల తర్వాత వాటిని పరీక్షించగా.. వాటి రోగనిరోధక శక్తి ప్రభావం పెరిగి వైరస్‌లను ఎదుర్కొన్నాయి. అయితే, ఇన్‌ఫ్లూయెంజా A వైరస్.. కోవిడ్ కణాలను అడ్డుకోవడాన్ని గమనించారు. ఈ రెండు వైరస్‌లు కలిగిన ఎలుకల్లో ప్రతికూల ప్రభావాలేవీ కనిపించలేదు. ఈ నేపథ్యంలో రెండు వైరస్‌ల సహ-సంక్రమణతో మానవాళికి ఎలాంటి ముప్పు కలగదనేది స్పష్టమైంది. అయితే, ఇది అధ్యయన ఫలితం మాత్రమే. వీలైనన్ని జాగ్రత్తలు పాటిస్తూ వైరస్‌లు సోకకుండా జాగ్రత్తపడండి.

Also read: డయాబెటిక్ రోగులు నేరేడు పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలిస్తే వదలకుండా తింటారు

Also read: పిల్లలు బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ ఆహారాలు తరచూ తినిపించండి

Published at : 14 Jul 2022 12:07 PM (IST) Tags: SARS-CoV-2 Influenza Vs Covid 19 Influenza Vs Covid 19 affects SARS-CoV-2 infection Influenza A Influenza Virus

సంబంధిత కథనాలు

Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు

Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు

Irregular Sleeping : ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ

Irregular Sleeping : ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ

Friendship Day Wishes Telugu: మీ ప్రియనేస్తానికి తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి, మీకు నచ్చే కోట్స్ ఇక్కడ ఎంచుకోండి

Friendship Day Wishes Telugu: మీ ప్రియనేస్తానికి తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి, మీకు నచ్చే కోట్స్ ఇక్కడ ఎంచుకోండి

Heart Health: చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది

Heart Health: చామదుంపలో ఉండే ఈ  గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది

Water: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్

Water: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్