అన్వేషించండి

బంధాలను బద్నాం చేస్తున్న స్మార్ట్ ఫోన్, భోజనం చేస్తున్నా అదే పని - తాజా సర్వేలో షాకింగ్ విషయాలు!

పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగంలోని వివిధ కోణాలను అంచనా వేస్తూ స్మార్ట్ ఫోన్ వినియోగపు పరిధి, లాక్ డౌన్ ప్రభావం, వ్యక్తిగత ఆరోగ్యం ఇతరత్రా అన్ని అంశాలను గురించిన అధ్యయన వివరాలు

భార్యభర్తల గొడవల మధ్యలో ఎవరూ తల దూర్చరు. అలా చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏంటో అందరికి తెలుసు. అయితే, ఒక్కటి మాత్రం వారి విషయంలో తలదూర్చుతోంది. అంతేకాదు, వారి మధ్య దూరాన్ని కూడా పెంచేస్తోంది. బంధాల మధ్య చిచ్చు పెడుతోంది. అదే మొబైల్ ఫోన్. 

సైబర్ మీడియా రీసెర్చ్, మనుషుల మీద ఫోన్ ఇంపాక్ట్ ఎంతలా వుంది అనే విషయం పై సర్వే చేస్తే, షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. మెజారిటీ కపుల్స్, ఫోన్ చూస్తున్నపుడు డిస్ట్రబ్ చేస్తే తమ భాగస్వామి మీద చిరాకు పడుతున్నారట. దీనివలన రిలేషిప్‌లో స్పర్థలు వస్తున్నాయని వాళ్లే ఒప్పుకున్నారు. 58 % వినియోగదారులు భోజనం చేసేప్పుడు మొబైల్ ఫోన్స్ చూస్తూ తింటారట. నిద్ర లేచిన తర్వాత 15 నిమిషాల్లో 84 % ఇండియన్స్ ఫోన్ చేసుకుంటున్నారట. 66% వినియోగదారులు ఫోన్ వల్ల మా లైఫ్ క్వాలిటీ పెరిగిందని నమ్ముతున్నారంట. 70% వినియోగదారులు ఫోన్ ఎక్కువగా వాడడం వలన మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నామని ఒప్పుకున్నారు. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి. 

మొబైల్ పోన్లు జీవిత ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఈ మ్యాజికల్ పరికరం కమ్యుూనికేషన్ కు వినియోగించేదే కానీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. మనుషులను సమాజానికి దూరం చేస్తుంది. స్మార్ట్ ఫోన్ జీవితానికి కేంద్రంగా మారిపోయింది. మానవ సంబంధాలపై దీని ప్రభావం చాలా ఉంటోంది. పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగంలోని వివిధకోణాలను అంచనా వేస్తూ స్మార్ట్ ఫోన్ వినియోగపు పరిధి, లాక్ డౌన్ ప్రభావం, వ్యక్తిగత ఆరోగ్యం ఇతరత్రా అన్ని అంశాలను గురించి Vivo మొబైల్ కంపెనీ  ‘Smartphones and their impact on human relationships 2020’ పేరుతో రెండో ఎడిషన్ ఫలితాలను ప్రకటించింది.

స్మార్ట్ ఫోన్లు జీవితంలోనే అతి ముఖ్యమైనదిగా మారిపోయింది. స్నేహితులు, కుటుంబం, ప్రపంచం దేనితో కనెక్ట్ కావాలన్న సరే స్మార్ట్ ఫోన్ కావల్సిందే. ఇక కరోనా నేపథ్యంలో ప్రపంచం ఇంటికే పరిమితం అయిన సందర్భంలో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. స్మార్ట్ ఫోన్లు యావత్ ప్రపంచాన్ని మన అరచేతుల్లోనే చూపిస్తుంది. కానీ, దానికి ఎక్కువగా అలవాటు పడితే.. దానికి బానిసల్లా మారే ప్రమాదం ఉంది. 

భారతీయుల్లో 66 శాతం మంది స్మార్ట్ ఫోన్ తమ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ను మెరుగుపరుస్తుందని నమ్ముతున్నారట. ఈ విషయం ఇలా ఉంటే ఇప్పటికే 75 శాతం భారతీయులు స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతూ ఉంటే అది వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారు. అంతేకాదు 74 శాతం నిర్ణీత సమయం పాటు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం సాధ్యం అవుతుందని చెప్పారు. అయినా సరే 18 శాతం మంది మాత్రమే తమ ఫోన్లను స్వయంగా స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలిపారట.

2020 ఊహకందని సంవత్సరం. పాండమిక్ నడిపించనట్టు ప్రపంచమంతా నడుచుకుంది. సామాజికంగా దూరంగా ఉండాల్సి రావడం వల్ల స్మార్ట్ ఫోన్ సెంట్రిక్ అయిపోయింది. ఆఫీస్ వర్క్ కావచ్చు, అకాడమిక్స్ కావచ్చు, స్నేహితులు, దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతొ కమ్యూనికేషన్  కావచ్చు.. అన్నింటికి కావల్సింది స్మార్ట్ ఫోన్ మాత్రమే. దీని వల్ల కమ్యూనికేషన్ సులువైంది కానీ కొందరికి అది వ్యసనంగా మారింది. మానవ సంబంధాలను ప్రభావితం చేస్తోంది కూడా అని నివేదిక ప్రారంభ సమయంలో వీవో బ్రాండ్ డైరెక్టర్ నిపున్ తన అభిప్రాయం తెలిపారు.

మానవ సంబంధాలపై స్మార్ట్ ప్రభావం గురించిన అధ్యయనం ద్వారా స్మార్ట్ ఫోన్ల వినియోగంలో బాధ్యతాయుతంగా  వ్యవహరించాల్సిన అవసరం గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని వీవో ఇండియా లక్ష్యంగా పెట్టకున్నట్టు అధికారులు ప్రకటించారు.

ఈ అధ్యయనంలోని ముఖ్యాంశాలు

  • కోవిడ్ తర్వాత స్మార్ట్ ఫోన్ల వినియోగం 25 శాతం వరకు పెరిగింది.
  • లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా భారతీయులు స్మార్ట్ పోన్ లో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
  • స్మార్ట్ ఫోన్లో ఓటీటీ చూసేవారు 59 శాతం, సోషల్ మీడియా 55 శాతం, ఆటల కోసం వాడేవారు 45 శాతం ఉన్నారు.
  • స్మార్ట్ ఫోన్ నచ్చిన వ్యక్తులను దగ్గర చేసేందుకు ముఖ్యమైందని 79 శాతం మంది నమ్ముతున్నారు.
  • జీవన నాణ్యత స్మార్ట్ పోన్లతో మెరుగవుతుందని 66 శాతం మంది నమ్ముతున్నారు.

స్మార్ట్ ఫోన్లు అత్యవసరమైన వస్తువుల్లో ఒకటిగా మారిపోయాయి. నిజమే కానీ చాలా మందికి ఇది వ్యసనంగా మారింది.

  • కుటుంబ సభ్యులతో ఉన్నా సరే స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ గడుపుతామని 88 శాతం మంది చెప్పారు.
  • గంట సేపు ముఖాముఖి సంభాషణలో ఉంటే కనీసం 5 సార్లు ఫోను చూసుకునే వారు 46 శాతం.
  • నిద్ర లేచిన 15 నిమిషాల్లోపు 84 శాతం మంది తమ ఫోన్లు చెక్ చేసుకుంటారు.

స్మార్ట్ పోన్లు ఎక్కువగా వాడడం వల్ల మానవ సంబంధాలు, ఇతర ప్రవర్తన మీద ప్రభావం చూపుతోంది.

  • ఆత్మీయులతో గడిపే సమయం మీద స్మార్ట్ ఫోన్ ప్రభావం ఉంటోందని 89 శాతం మంది అంగీకరిస్తున్నారు.
  • స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండడం ముఖ్యమని 74 శాతం అభిప్రాయపడ్డారు.
  • స్మార్ట్ ఫోన్లను స్మార్ట్ గా వినియోగించక పోవడం వల్ల సంబంధ బాంధవ్యాల మీద ప్రతికూల ప్రభావం ఉంటోందని భావిస్తున్నారు.

శారీరక మానసిక ఆరోగ్యం కోసం స్మార్ట్ ఫోన్లను తక్కువగా వాడటమే ముఖ్యం. స్మార్ట్ ఫోన్లలో తక్కువ సమయం గడిపితే 73 శాతం మంది సంతోషంగా ఉండగలరని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ పరిస్థితిని బట్టి కాసేపు స్విచ్ ఆఫ్ చెయ్యడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపవచ్చని 74 శాతం మంది అంగీకరించారు.

Also Read: బాగా అలసటగా ఉంటోందా? ఇందుకు కారణాలివే!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget